ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద‍్దవాడ సమీపంలో గడ్డి లోడుతో వెళుతున‍్న ట్రాక‍్టర్‌ను గుర‍్తుతెలియని వాహనం ఢీకొనడంతో ట్రాక‍్టర్ డ్రైవర్ అక‍్కడికక‍్కడే మృతిచెందాడు.
కొమరోలు(ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద‍్దవాడ సమీపంలో గడ్డి లోడుతో వెళుతున‍్న ట్రాక‍్టర్‌ను గుర‍్తుతెలియని వాహనం ఢీకొనడంతో ట్రాక‍్టర్ డ్రైవర్ అక‍్కడికక‍్కడే మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. మృతుడు మార్కాపురం మండలం పోతలపాడు గ్రామానికి చెందిన రమణారెడ్డి(50)గా గుర్తించారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతునికి భార‍్య, నలుగురు పిల‍్లలు ఉన్నారు.