daddawada
-
ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 300 సిలిండర్లున్న లారీలో పేలుడు
ప్రకాశం జిల్లా కోమరోలు మండలం దద్దవాడ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్పీజీ సిలిండర్లతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలాయి. ఈ భారీ శబ్దాలకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీశారు. కర్నూలు నుండి ప్రకాశం జిల్లా ఉలవపాడుకి వెళ్తున్న ఈ లారీలో మొత్తం 300 సిలిండర్లు ఉన్నట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. మంటలు రావడం గమనించి లారీ నుంచి దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు. చదవండి: మార్గదర్శి కేసులో హైకోర్టు స్టే -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొమరోలు(ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ సమీపంలో గడ్డి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. మృతుడు మార్కాపురం మండలం పోతలపాడు గ్రామానికి చెందిన రమణారెడ్డి(50)గా గుర్తించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.