జానకిరామ్ ప్రమాద ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ అరెస్ట్ | Tractor driver arrested in Janakiram accident case | Sakshi
Sakshi News home page

జానకిరామ్ ప్రమాద ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ అరెస్ట్

Published Tue, Dec 9 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

Tractor driver arrested in Janakiram accident case

మునగాల: నందమూరి జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడానికి కారకుడైన ట్రాక్టర్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్టు మునగాల ఎస్‌ఐ రమేష్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో వెళుతున్న జానకిరామ్ నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ట్రాక్టర్‌ను ఢీకొట్టి దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. గరిడేపల్లి మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన యలమంచి వెంకన్న ట్రాక్టర్‌ను జాతీయ రహదారిపై క్రాసింగ్ వద్ద రాంగ్‌రూట్‌లో యూటర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, వెంకన్న సోమవారం స్వగ్రామంలో ఉన్నాడని సమాచారం తెలుసుకుని వెళ్లి అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ వివరించారు. అదేరోజు ట్రాక్టర్ డ్రైవర్‌పై సెక్షన్ 304(ఏ) కింద కేసు నమోదు చేశామని తెలిపారు. అనంతరం నిందితుడిని కోదాడ మున్సిఫ్ కోర్టులో హాజరుపర్చినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement