YVS Choudary
-
తెలుగు భాషని ప్రతిబింబించేలా ఉంటుంది: వైవీఎస్ చౌదరి
‘‘తెలుగు భాషా దినోత్సవం, గిడుగు వెంకట రామమూర్తిగారి జన్మదినాన్ని పురస్కరించుకుని నేను తీయబోయే కొత్త సినిమా నేపథ్యం ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. 1980 నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. తెలుగు భాష, సంస్కృతి, తెలుగు జాతి నేపథ్యం వంటి అంశాలను ప్రతిబింబించేలా మా సినిమా ఉంటుంది’’ అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. దివంగత ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకీ రామ్ (ఎన్టీఆర్ సోదరుడు) తనయుడు తారక రామారావు హీరోగా, తెలుగమ్మాయి వీణా రావ్ని హీరోయిన్గా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.యలమంచిలి గీత ఈ చిత్రం నిర్మించనున్నారు. కాగా గురువారం హీరో అక్కినేని నాగార్జున బర్త్ డే, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ– ‘‘ప్రపంచంలో అత్యంత మధురమైన భాషల్లో రెండోది తెలుగు. ఈ సినిమాలో మరింత అందమైన, అర్థవంతమైన ΄పాటలు రాసే అవకాశం ఇచ్చిన చౌదరిగారికి, కీరవాణిగారికి ధన్యవాదాలు’’ అన్నారు. మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ–‘‘తెలుగు వాడు తెలుగు భాష గొప్పదనం గురించి తెలుగువాళ్లకి చెప్పడం విచిత్రమైన పరిస్థితి. తెలుగు మాట్లాడితే తల్లితండ్రులు, టీచర్లు కోప్పడే పరిస్థితి తెలుగులోనే ఉంది. ఇప్పుడున్న సమాజం ఇలానే కొనసాగితే తెలుగు ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంటుంది’’ అన్నారు. ‘‘వైవీఎస్ చౌదరి, కీరవాణి, చంద్రబోస్, సాయి మాధవ్ గార్లతో ఈ సినిమా కోసం పని చేయనుండటం ఆనందంగా ఉంది’’ అని యలమంచిలి గీత తెలిపారు. -
ఎన్టీఆర్‌తో సినిమా ఎందుకు చేయలేదు? డైరెక్టర్ వైవీఎస్ సమాధానమిదే
ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియని టాలీవుడ్ దర్శకుడు వైవీఎస్ చౌదరి.. చాన్నాళ్ల తర్వాత మెగాఫోన్ పట్టుకున్నారు. నందమూరి హరికృష్ణ కొడుకు జానకిరామ్ తనయుడు ఎన్టీఆర్ అనే కుర్రాడ్ని హీరోగా పరిచయం చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. తాజాగా మూవీకి సంబంధించిన మరో ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో భాగంగా జూ.ఎన్టీఆర్ గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురవగా.. దానికి సమాధానమిచ్చారు.ఎన్టీఆర్‌ని విపరీతంగా అభిమానించే వైవీఎస్.. అప్పట్లో హరికృష్ణ, బాలకృష్ణతో సినిమాలు తీశారు. కానీ అప్పటికే ఫామ్‌లో ఉన్న జూ.ఎన్టీఆర్‌తో మాత్రం మూవీ ఏం చేయలేదు. అయితే కావాలనే చేయలేదా? లేదంటే కుదరలేదా? అనే ప్రశ్న తాజాగా ప్రెస్మీట్లో ఎదురైంది. దీనికి వైవీఎస్ చెప్పిన సమాధానం ఏంటంటే..(ఇదీ చదవండి: ఈసారి తెలుగమ్మాయిని పరిచయం చేస్తున్నాను: వైవీఎస్ చౌదరి)'నేను రెండుమూడేళ్లకు ఓసారి సినిమా చేస్తుంటా. స్టోరీ నేనే రాసుకోవడం వల్ల ఆలస్యమవుతూ ఉంటుంది. దీనికి ఎవరు సరిపోతారో వారిని మాత్రమే ఎంపిక చేసుకుంటా. పెద్ద హీరోలతో సినిమాలు తీయాలని నేను అనుకోను. తారక్‌తో సినిమా చేయాలనే ఆలోచన నాకు రాలేదు. అందుకే ఆయనతో తీసే స్టోరీ నా ఆలోచనల్లోకే రాలేదు. ఆ ఐడియా వస్తే కచ్చితంగా వెళ్తా' అని వైవీఎస్ క్లారిటీ ఇచ్చారు.కొత్త సినిమా ఏ జానర్ లో ఉండబోతుంది అనే విషయాలేం బయటపెట్టిన వైవీఎస్.. వీణా రావు అనే తెలుగమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. అలానే కీరవాణి, చంద్రబోస్, బుర్రా సాయిమాధవ్ లాంటి టాప్ టెక్నీషియన్స్ ఈ మూవీ కోసం పనిచేయబోతున్నారని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: నిన్న ఎంగేజ్మెంట్.. ఇప్పుడు పెళ్లిలో కనిపించిన నాగచైతన్య) -
ఈసారి తెలుగమ్మాయిని పరిచయం చేస్తున్నాను: వైవీఎస్ చౌదరి
‘‘నేను పరిచయం చేసిన ఎంతోమంది హీరోయిన్లు స్టార్స్‌గా వెలిగారు. అయితే ఇందులో చాలా మంది ముంబై నుంచి వచ్చిన వారే. ఈసారి మన తెలుగమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేయాలని వీణా రావుని ఎంచుకున్నా. ఈ మూవీలో అతిరథ మహారథులు ఇంకెందరో ఉంటారు. అలాగే కొత్త వారికి కూడా అవకాశం ఇస్తున్నాం’’ అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. దివంగత హరికృష్ణ కుమారుడు, దివంగత జానకి రామ్ (ఎన్టీఆర్ సోదరుడు) తనయుడు తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి ఇటీవల ఓ సినిమాని ప్రకటించారు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై యలమంచిలి గీత ఈ సినిమాని నిర్మించనున్నారు. కాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో వీణా రావు పేరుని పరిచయం చేశారు వైవీఎస్ చౌదరి. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘మహేశ్‌బాబుగారి బర్త్ డే (ఆగస్టు 9) సందర్భంగా మా సినిమా కార్యక్రమం జరుపుకోవడం హ్యాపీ. ఈ మూవీకి కీరవాణిగారు సంగీతం అందించనుండటం నా అదృష్టం. సాయి మాధవ్ బుర్రా మాటలు, చంద్రబోస్‌గారి పాటలు మహాద్భుతంగా ఉండనున్నాయి’’ అన్నారు. ‘‘వైవీఎస్ చౌదరి, కీరవాణి, చంద్రబోస్ వంటి మహామహులతో పనిచేసే అవకాశం ఇచ్చిన గీతగారికి ధన్యవాదాలు’’ అని డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా చెప్పారు. -
రవితేజ నా రూమ్ మేట్: టాలీవుడ్ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఇందులో ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని హరీశ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సందర్భంగా రవితేజ గురించి టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మిస్టర్ బచ్చన్‌తో పాటు డబుల్ ఇస్మార్ట్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నా రూమ్ మేట్ రవితేజ ఎప్పటికీ నా హృదయంలో ఉంటారని అన్నారు. ఎందుకంటే రవితేజ ఎంత కష్టపడి వచ్చాడో తనకు తెలుసన్నారు. నేను, రవితేజ ఎనిమిదేళ్ల పాటు రూమ్మేట్స్ అని వైవీఎస్ చౌదరి వెల్లడించారు. -
అది నా అదృష్టం – వైవీఎస్ చౌదరి
‘‘నా కెరీర్లో ఎంతోమంది కొత్తవారిని పరిచయం చేశాను. ‘దేవదాసు’ మూవీతో రామ్‌ని, ‘రేయ్’ చిత్రంతో సాయిధరమ్ తేజ్‌ని హీరోలుగా పరిచయం చేశాను. ఇప్పుడు నందమూరి కుటుంబంలో నాలుగో తరానికి చెందిన తారక రామారావుని ప్రపంచానికి పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. దివంగత హరికృష్ణ కుమారుడు దివంగత జానకి రామ్(ఎన్టీఆర్ సోదరుడు) తనయుడు తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ కొత్త సినిమాని ప్రకటించారు వైవీఎస్ చౌదరి. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై యలమంచిలి గీత ఈ సినిమాని నిర్మించనున్నారు. సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ–‘‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ మూవీతో దర్శకునిగా నాకు తొలి అవకాశం ఇచ్చిన నాగార్జునగారికి రుణపడి ఉంటాను. తొలి సినిమాకే నాగేశ్వరరావుగారితో పని చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టం. తాజాగా నా కొత్త సినిమాకి హీరోగా ఎవర్ని తీసుకోవాలి? అనుకుంటున్న సమయంలో తమ్ముల ప్రసన్న కుమార్‌గారు తారక రామారావుని చూపించారు. తనని చూడగానే జానకి రామ్ కలని నెరవేర్చుతాడనిపించింది. ఈ మూవీ ద్వారా తెలుగమ్మాయిని కథానాయికగా పరిచయం చేస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా’’ అన్నారు. ‘‘మా స్నేహితులు, సన్నిహితుల అండదండలతో న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. అందరి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నాం’’ అన్నారు యలమంచిలి గీత. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ అత్తిలి. -
రామ్‌తో రూపాయి బిజినెస్ కూడా ఉండేది కాదు: టాలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరో రామ్‌పై నిర్మాత వైవీఎస్ చౌదరి సంచలన కామెంట్స్ చేశారు. రామ్‌కు ఇండస్ట్రీలో పెద్దగా మార్కెట్ ఉండేది కాదని అన్నారు. అతనితో కలిసి నిర్మించిన దేవదాసు చిత్రానికి నాలుగు వారాల పాటు ప్రేక్షకులే రాలేదని వెల్లడించారు. సినిమాను ప్రొడ్యూస్ చేయటం అంత ఈజీ కాదని.. రామ్‌పై ఒక్క రూపాయి కూడా స్కేలబిలీటీ ఉండదని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో వైవీఎస్ చౌదరి మాట్లాడారు.వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ..'దేవదాసు సినిమా రిలీజ్ రోజునే రూ.10 కోట్లు పోయాయి అన్నారు. నా ఆస్తులన్నీ స్టేక్‌లో ఉన్నాయి. నాలుగు వారాల వరకు జనాలు లేరు. కానీ నేను బ్రహ్మండగా జనాలు ఉన్నారని మైకుల్లో మాట్లాడా. ఇదే నిజం. నేను శాటిలైట్స్ తక్కువ రేట్‌కే అమ్మాను. నా విజయాలు అంత ఈజీగా రాలేదు. జనవరి 11న దేవదాసు రిలీజైంది. ఆ తర్వాత 12వ తేదీనే స్టైల్ సినిమా రిలీజైంది. చిరంజీవి, లారెన్స్ ఆ దెబ్బకు నా సినిమా కుదేలైంది.' అన్నారుసంక్రాంతి సీజన్లో లవ్ స్టోరీలు సినిమాలు చూడరు. ఆ వైపు అస్సలు వెళ్లరు. 13న చుక్కల్లో చంద్రుడు, లక్ష్మి సినిమాలు రిలీజ్. నా సినిమాకు థియేటర్ల వద్ద జనాలే లేరు. ఇక 14వ తేదీకల్లా జీ టీవీకి ముందు అనుకున్న దానికంటే తక్కువ ధరకే శాటిలైట్ రైట్స్ అమ్ముకున్నా. డబ్బులు పెట్టుకుని తిరిగితే నాలుగు వారాల తర్వాత నా సినిమాకు సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత 17 సెంటర్లలో 175 డేస్ ఆడింది. ఇక్కడ రామ్‌ను నేను తక్కువ చేయడం లేదు.' అని అన్నారు. ప్రస్తుతం వైవీఎస్ చౌదరి నందమూరి జానకి రామ్ కుమారుడిని హీరోగా పరిచయం చేయనున్నారు.కాగా.. రామ్ పోతినేని ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను పూరి జగన్నాధ్ తెరకెక్కించనున్నారు. 2006లో రామ్, వైవీఎస్ చౌదరి కాంబోలో వచ్చిన దేవదాసు చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఇలియానా నటించారు. -
వెండితెరపై కనిపించనున్న మరో ఎన్టీఆర్
సీతారామరాజు, సీతారాముల కళ్యాణం చూతము రారండి, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వైవీఎస్ చౌదరి. తెలుగుదనం ఉట్టిపడేలా విభిన్న కథలతో సినిమాలు రూపొందించిన ఆయన కొంతకాలం బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు నందమూరి నాలుగో తరం నుంచి ఒకరిని వెండితెరకు ఆయన పరిచయం చేయనున్నాడు. ఈ విషయం గురించి వైవీఎస్ చౌదరి తాజాగా అధికారికంగా ప్రకటన చేశారు.స్వర్గీయ హరికృష్ణ గారి మనమడిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు వైవీఎస్ చౌదరి ప్రకటించారు. హరికృష్ణ పెద్ద కుమారుడు స్వర్గీయ జానకీ రామ్ అబ్బాయి 'తారక రామారావు'ను ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన అన్నారు. తన తాతగారి పేరుతో నాలుగో తరం నట వారసుడిగా తారక రామారావు ఎంట్రీ ఇవ్వనున్నాడు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్లో యలమంచిలి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పిల్లలతో రూపొందిన పౌరాణిక చిత్రం ‘దానవీర శూర కర్ణ’లో కృష్ణుడి పాత్రలో బాల నటుడిగా తారక రామారావు నటించాడు.వైవీఎస్ చౌదరి సినీ కెరీర్లో మంచి హిట్స్ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో సాయి ధుర్గ తేజ్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఆయనే నిర్మాతగా 'రేయ్' సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. ఆ తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత నందమూరి వారసుడి సినిమాతో మళ్లీ ఆయన మెగా ఫోన్ పట్టబోతున్నారు.Director #YVSChowdary along with #YalamanchiliGeetha visited #NTRGhat and paid their respects to the Legendary NTR garu and took the blessings for their Production NO-1 under NEW TALENT ROARS@ ✨@HelloYvs @NewTalentRoars pic.twitter.com/MeEJvwnR4N— BA Raju's Team (@baraju_SuperHit) June 10, 2024 -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'జానకీ రామ్' కుమారుడు.. కథ రెడీ చేసిన డైరెక్టర్
‘సీతారామరాజు, సీతారాముల కళ్యాణం చూతము రారండి, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వైవీఎస్ చౌదరి. తెలుగుదనం ఉట్టిపడేలా విభిన్న కథలతో సినిమాలు రూపొందించిన ఆయన కొంతకాలం బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఒక సినిమాను డైరెక్ట్ చేసే పనిలో ఉన్నారట.. అది కూడా కొత్త హీరోతో ఒక ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నాడట. వైవీఎస్ చౌదరి సినీ కెరీర్లో మంచి హిట్స్ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో సాయి ధరమ్ తేజ్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఆయనే నిర్మాతగా 'రేయ్' సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. ఆ తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఆయన మెగా ఫోన్ పట్టనున్నారని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అందుకోసం నందమూరి కుటుంబానికి చెందిన ఒకరిని హీరోగా ఆయన ఎంచుకున్నారట. స్వర్గీయ హరికృష్ణ గారి మనమడిని హీరోగా పరిచయం చేయాలని వైవీఎస్ చౌదరి ఉన్నారట. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీ రామ్ అబ్బాయి 'తారక రామారావు'ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఆయన ప్లాన్‌లో ఉన్నారట. జానకీ రామ్ కుమారుడికి కూడా సినిమాలంటే ఇష్టం.. అందుకే పిల్లలతో రూపొందిన పౌరాణిక చిత్రం ‘దానవీర శూర కర్ణ’లో కృష్ణుడి పాత్రలో ఆయన నటించాడు. అదే చిత్రంలో జానకీ రామ్ రెండో కుమారుడు సౌమిత్ర కూడా సహదేవుడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. వీరిలో తారక రామారావుతో డైరెక్టర్ వైవీఎస్ చౌదరి సినిమా ప్లాన్ చేశారు. తెలుగు సంస్కృతి, సంగీతం, సాహిత్యం కలబోతగా ఓ శక్తివంతమైన కథాంశంతో కథ ఉండబోతుందట. చక్కటి ప్రేమకథగా ఈ మూవీ ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రానికి తెలుగమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నట్లు డైరెక్టర్ ఉన్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే తారక రామారావుకు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ అండ కూడా బలంగా ఉంటుంది. ప్రస్తుతం తారక్ గ్లోబల్ మార్కెట్‌నే శాసిస్తున్నాడు. ఆయనకు ఫ్యాన్స్ కూడ కోట్లలో ఉన్న విషయం తెలిసిందే. జానకీ రామ్ అంటే తారక్‌కు ఎనలేని ప్రేమ.. ఇన్నీ ఎమోషన్స్ మధ్య తారక రామారావు లాంచ్ జరిగితే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. వాస్తవంగా జానకీ రామ్ కూడా తన కుమారులను సినిమా ఇండస్ట్రీలో కొనసాగించాలని గతంలో పలు సందర్భాల్లో చెప్పేవారట. కానీ 2014 డిసెంబరు నెలలో కారు ప్రమాదంలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. -
సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా : వైవీఎస్ చౌదరి
విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రముఖ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి స్వాగతించారు. తెలుగు ప్రజల అభిమతం, అకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ పంథాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలోనే ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’అవార్డు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది. పాదయాత్ర సందర్భంగా నాడు వైఎస్ జగన్ ఇచ్చిన మాటను తు.చ. తప్పకుండా నిలబెట్టుకున్నారంటూ కృష్ణా జిల్లా వాసులు, ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో సంబరపడుతున్నారు. -
‘సిరివెన్నెల’ గారు సాహిత్య పరిశోధకుడు: దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి
ప్రతి పాటని ఒక తపస్సులా, తన సొంత బిడ్డలా భావిస్తూ పండితులను, పామరులను ఏకకాలంలో ఆకట్టుకుని కట్టిపడేసే ఒక సాహిత్యపు నిత్యాన్వేషి, నిరంతర పరిశోధకుడు అయిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి’గారు అకాల మరణం చెందటం తెలుగు చలన చిత్ర పరిశ్రమ చేసుకున్న దురదృష్టం. ఆయనతో, ఆయన బిడ్డలతో (పాటలతో), ఆయన కుటుంబ సభ్యులతో ఆత్మీయ పరిచయం నాకు కలగటం నేను చేసుకున్న అదృష్టం. నా దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’, ‘సీతారామరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’ వంటి సినిమాల్లో అన్ని పాటలను ఆయనతో రాయించుకోగలిగిన అనుభవాన్ని పొందటం నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా పాటల రూపంలో తెలుగు సాహిత్య ప్రియుల మధ్య ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు. -
లెక్కలేసుకుని సినిమాలు చేయను: వైవీఎస్ చౌదరి
‘సీతారామరాజు, సీతారాముల కళ్యాణం చూతము రారండి, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వైవీఎస్ చౌదరి. తెలుగుదనం ఉట్టిపడేలా విభిన్న కథలతో సినిమాలు రూపొందించిన ఆయన కొంతకాలం బ్రేక్ ఇచ్చారు. తాజాగా ఓ ఫవర్‌ఫుల్ కథాంశంతో ఓ సినిమా చేయబోతున్నానని ఆయన తన పుట్టిన రోజు (మే 23, ఆదివారం) సందర్భంగా చెప్పుకొచ్చారు. దాంతోపాటు సినిమా దర్శకత్వానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. ‘సినీ పరిశ్రమలో అడుగుపెట్టడమే అదృష్టంగా భావిస్తున్నాను. కెరీర్ పరంగా బాధపడిన సందర్భాలు లేవు. జయాపజయాలతో సంబంధం లేకుండా నా ప్రయాణాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నాను’ అంటూ వైవీఎస్ చౌదరి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత ఓ మంచి ప్రాజెక్ట్‌తో వస్తున్నట్లు ఆయన చెప్పారు. దర్శకుడు అనేవాడు మూసధోరణికి పరిమితమైపోకుండా అన్ని రకాల కథల్ని తీయాలన్నది తన సిద్ధాంతమన్నారు. ఆ ఆలోచనకు అనుగుణంగానే విభిన్న కథాంశాలతో సినిమాల్ని రూపొందిస్తున్నానని వైవీఎస్ తెలిపారు. ఇక తన తాజా ప్రాజెక్ట్ గురించి చెబుతూ.. తెలుగు సంస్కృతి, సంగీతం, సాహిత్యం కలబోతగా ఓ శక్తివంతమైన కథాంశంతో సినిమా చేయబోతున్నానని, అన్ని హంగులతో కూడిన చక్కటి ప్రేమకథగా ఈ మూవీ ఉండబోతుందన్నారు. ఈ సినిమా ద్వారా కొత్త నటీనటులను వెండితెరకు పరిచయం చేయబోతున్నానని, తెలుగమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఇక దర్శకుడిగా తాను ఎప్పుడూ కూడా మార్కెట్ లెక్కలు, అంచనాలు, క్యాలికులేషన్స్ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయనని ఆయన అన్నారు. -
నా తర్వాతి సినిమాలో తెలుగమ్మాయే హీరోయిన్
‘‘1990 వరకూ తెలుగు నుంచి చాలామంది హీరోయిన్లు వచ్చి స్టార్లు అయ్యారు. ఆ తర్వాత కాలంలో ప్రతిభావంతమైన తెలుగమ్మాయిలు వచ్చినా మంచి అరంగేట్రం దొరక్క, అనుకున్నంత స్థాయిలో మెరవలేక మరుగున పడిపోతున్నారు. నా తర్వాతి చిత్రానికి తెలుగమ్మాయినే కథానాయికగా పరిచయం చేస్తా. తను స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటే హ్యాపీ’’ అని దర్శక–నిర్మాత వైవీఎస్ చౌదరి అన్నారు. ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి, సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, ఒక్కమగాడు, సలీం, నిప్పు, రేయ్’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు వైవీఎస్ చౌదరి. ఆదివారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా వైవీఎస్ మాట్లాడుతూ – ‘‘చదువులో నేను ఫస్ట్ ర్యాంకర్‌ని. నందమూరి తారక రామారావుగారి స్ఫూర్తితో చదువును వదిలి చిత్రపరిశ్రమలోకి వచ్చాను.. సంతృప్తిగా ఉన్నాను. సినిమా ఓ అనిర్వచనీయమైన వ్యామోహం. ఈ రంగంలో ప్రతి శుక్రవారం సబ్జెక్టు మారుతుంది.. దానికి తగ్గట్లు సినిమాలు నిర్మించడం అన్నది పెద్ద ఛాలెంజ్. దర్శకునిగా నా కెరీర్ మొదలైన 23 ఏళ్లలో 10 సినిమాలే చేశా. రచయితగా, దర్శకునిగా, నిర్మాతగా మూడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ఒత్తిడి లేకుండా సినిమాలు చేయాలనుకుంటాను. అందుకే సినిమా సినిమాకి గ్యాప్ వస్తుంటుంది. ఎన్టీఆర్, మహేశ్‌బాబు వంటి స్టార్లతో సినిమా చేయాలని ఎవరికి ఉండదు? అన్నీ కలిసిరావాలి. నా తర్వాతి సినిమాకి కథ రెడీ. కోవిడ్ ఉధృతి తగ్గాక ప్రారంభిస్తా’ అన్నారు. -
సినిమాకి సినిమా కష్టాలు వచ్చాయి
‘‘సాధారణంగా ఎవరికైనా ఊహించని కష్టమొస్తే ‘సినిమా కష్టాలొచ్చాయి’ అంటారు. ప్రసుత్తం కరోనా వల్ల సినిమాకి, సినిమావాళ్లకి నిజంగానే సినిమా కష్టాలు వచ్చాయి’’ అన్నారు దర్శకుడు వైవీఎస్ చౌదరి. ‘సీతయ్య, దేవదాసు, లాహిరి లాహిరి లాహిరిలో’ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన వైవీఎస్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వైవీఎస్ మాట్లాడుతూ– ‘‘సినిమాకు కష్టాలు రావడం కొత్తేం కాదు. కేబుల్ టీవీ, సీడీ, డీవీడీ ప్లేయర్స్, సీరియల్స్, గేమ్ షోస్, క్రికెట్, ఐపీఎల్, యూట్యూబ్, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్. వీటన్నింటినీ తట్టుకొని సినిమా థియేటర్లో నిలబడుతూనే ఉంది. నిశ్చింతగా, నిశ్చలంగా ఉండటం సినిమాకి చేతకాదు. సముద్రపు అలలాగా పడినా పైకి లేవడం సినిమాకి తెలుసు. కోవిడ్ కాదు దానికంటే ప్రమాదకరమైనది వచ్చినా థియేటర్లో సినిమా చూడాలనే ప్రేక్షకుడి కాంక్షను ఆపలేదు. థియేటర్లో సినిమా చూసే అనుభూతికి మరేదీ సాటిరాదు. కోవిడ్ వల్ల ఒంటరితనాన్ని అనుభవిస్తున్న థియేటర్లు త్వరలోనే జన సమూహాలతో ప్రకాశవంతం చెందాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
కుశలమా? నీకు కుశలమేనా?
‘‘... అది పాత తెలుగు సినిమా పాటా కాదు.. నాలుక మీద నుంచి దొర్లిన పదాల కలయికా కాదు.. కుశలమా?.. నీకు కుశలమేనా? అన్నది మన ఆత్మీయుల యోగక్షేమాలను తెలుసుకోవాలనుకునే తొలి పలకరింపు’’ అంటున్నారు దర్శకుడు వైవీఎస్ చౌదరి. లాక్డౌన్ నేపథ్యంలో ఆయన తన మనోభావాలను ఈ విధంగా వ్యక్తపరిచారు. ‘‘కరోనా–వైరస్ వ్యాప్తి లాంటి విపత్కర పరిస్థితుల్లో నీకు కుశలమేనా? అనే పలకరింపుకి పని కల్పించండి. మన సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, మన వద్ద పని చేస్తున్నవాళ్లు.. ఇలా వారి యోగ–క్షేమాల్ని తెలుసుకోవడమే కాకుండా, మీ మాటల ద్వారా గానీ, చేతల ద్వారా గానీ వారిలో మానసిక స్థైర్యాన్ని, మనో నిబ్బరాన్ని నింపండి. వారికి అవసరమైతే మీకు కుదిరినంత ఆర్థికసాయం చేయండి. మన ప్రభుత్వాలు విధించిన ఆంక్షలకు అనుగుణంగా ఉంటూ కరోనా కట్టడికి చేపట్టాల్సిన జాగ్రత్తల్ని స్వయం నియంత్రణతో పాటించండి. బాధ్యతగల పౌరులుగా ఇంటిపట్టునే ఉండి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను కాపాడుకోండి’’ అంటూ ఆ దేవుని దయతో ప్రస్తుతానికి నేను, నా కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉన్నాం. ఆ దేవుని దయ మీకూ ఉంటుంది, ఉండాలని కోరుకుంటున్నా అన్నారు వైవీఎస్. -
'గుడివాడ చరిత్రలో ఇది గొప్ప రోజు'
సాక్షి, గుడివాడ : గుడివాడ చరిత్రలో ఈరోజును ఒక గొప్ప రోజుగా గుర్తుంచుకుంటామని పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గా నియమితులైన జస్టిస్ బట్టు దేవానంద్ ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని లింగ వరం రోడ్డు లోని కె కాన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. మంత్రి కొడాలి మాట్లాడుతూ.. ఎందరో ప్రముఖుల పురిటిగడ్డ ఈ గుడివాడ అని, ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం కోసం తలుపు తట్టే న్యాయ వ్యవస్థ ప్రాంతంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. బట్టు దేవానంద్ గుడివాడ నుంచి హైకోర్టు న్యాయమూర్తి గా నియమితులవడం ఈ ప్రాంతం అదృష్టమని తెలిపారు. సమాజంలో అనేక అసమానతలు తొలిగేలా అంబేద్కర్ ఆశయాలను దేవానంద్ నెరవేర్చుతాని తాము ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవ రావు,దర్శకుడు, నిర్మాత వైవీయస్ చౌదరి యూనేటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గుమ్మడి రవీంద్ర నాధ్ తదితరులు పాల్గొన్నారు.(‘ఎల్లో’ వైరస్ కరోనా కంటే ప్రమాదకరం) సినీ దర్శకుడు వైవీయస్ చౌదరి మాట్లాడుతూ.. ' గుడివాడలొనే నా విద్యాబ్యాసమంతా కొనసాగింది. నాకు సినిమా రంగంలో స్పూర్తి ఎన్టీఆర్. ఆయన స్పూర్తితోనే నేను సినిమా రంగంలోకి వెళ్ళాను. జీవితంలో ప్రతి ఒక్కరు..నువ్వు అనే పిలుపు నుంచి మీరు అని పిలిపించుకుని స్థాయికి చేరాలి. బట్టు దేవానంద్ నా చిన్ననాటి సహా విద్యార్థి. కానీ నేడు బట్టు దేవానంద్‌ను మీరు అని పిలిపించుకోవడం మన ప్రాంతం అదృష్టం. మత సామరస్యనికి నిలయం గుడివాడ.విద్యార్థి దశ నుంచే సమయ స్పూర్తి తో నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి బట్టు దేవానంద్' అంటూ తెలిపారు. మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ.. 'పేద కుటుంబ నుంచి వచ్చి వ్యక్తి ఉన్నత స్థాయికి రావడం సాదరణ విషయం కాదు. స్వాతంత్రం అనంతరం గుడివాడలో ఒక దళితుడు కూడా హైకోర్టు జడ్జి కాలేదు. నేటి రోజుల్లో పేదవారు పైకి రావడం చాలా కష్టం. పేదవారు కూడా ఉన్నత స్థాయికి రావాలన్నదే నా ఉద్దేశం. చరిత్రలో నిలిచిపోయే తీర్పులు ఇవ్వాలని నేను దేవానంద్‌ను కోరుతున్నాను. బట్టు దేవానంద్ సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి చేరాలని ఆశిస్తున్నా' అంటూ వెల్లడించారు. -
ఎన్టీఆర్ సినిమాలే ఆదర్శం
కృష్ణాజిల్లా, తెనాలి: మహానటుడు ఎన్టీ రామారావు సినిమాలను చూస్తూ సినీరంగంపై వ్యామోహాన్ని పెంచుకున్నానని, తన కీర్తి ఆ మహానుభావుడి ఖాతాలోంచి తీసుకుంటున్నట్టుగానే భావిస్తున్నానని సినీ దర్శకుడు, నిర్మాత వైవీఎస్ చౌదరి అన్నారు. ఎన్టీఆర్ అభిమాని కావటం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు. పట్టణానికి చెందిన పోలేపెద్ది నరసింహమూర్తి, తుమ్మల వెంకట్రామయ్య, ఎన్టీ రామారావు కళాపరిషత్ 12వ రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు శుక్రవారం ఇక్కడి టీజే కాలేజీ మైదానంలో ప్రారంభమయ్యాయి. ఎన్టీ రామారావు లెజెండరీ అవార్డును ఈ పర్యాయం సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరికి ప్రదానం చేసి స్వర్ణకంకణం బహూకరించారు. సంస్థ అధ్యక్షుడు, సినీ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, ప్రధాన కార్యదర్శి షేక్ జానిభాషా, కోశాధికారి ఆరాధ్యుల నాగరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు చౌదరికి అవార్డును అందజేసి సత్కరించారు. ప్రముఖ సినీ పబ్లిసిటీ డిజైనరు కే ఈశ్వర్‌కు ఆత్మీయ సత్కారం చేశారు. అనంతరం కళల కాణాచి లోగోను ఆవిష్కరించారు. కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు స్వాగతం పలికిన సభలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, మాజీ జెడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, సోమవరపు నాగేశ్వరరావు, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, ఏపూరి హరిప్రసాద్, షేక్ ఇర్ఫాన్, ప్రసన్న మాట్లాడారు. -
కోర్టును తప్పు దోవ పట్టించారు : మోహన్‌బాబు
ప్రముఖ నటుడు, వైఎస్ఆర్సీపీ నేత మంచు మోహన్‌బాబుకు హైదరాబాద్ ఎర్రమంజిల్ 23 మెట్రోపాలిటిన్ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు ఏడాది పాటు శిక్షను ఖరారు చేసిందని వార్తలపై మోహన్‌బాబు స్పందించారు. ‘2009లో ‘సలీమ్’ సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని దర్శకుడు వైవీఎస్ చౌదరికి చెల్లించేశాం. మా బ్యానర్లోనే మరో సినిమా చేయడానికిగానూ ఆయనకు రూ.40 లక్షల చెక్ ఇచ్చాం. ‘సలీమ్’ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో.. వైవిఎస్ చౌదరితో తదుపరి చేయాల్సిన సినిమాను వద్దనుకున్నాం. సినిమా చేయడం లేదని వైవీఎస్ చౌదరికి చెప్పాం. అలాగే చెక్‌ను బ్యాంకులో వేయవద్దని కూడా చెప్పాం. అయినా కూడా కావాలనే చెక్‌ను బ్యాంకులో వేసి చెక్‌ను బౌన్స్ చేశారు. నాపై చెక్ బౌన్స్ కేసుని వేసి, కోర్టును తప్పు దోవ పట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పుని మేం సెషన్స్ కోర్టులో చాలెంజ్ చేస్తున్నాం. కొన్ని చానెల్స్‌లో నాపై వస్తున్న తప్పుడు ఆరోపణలను నమ్మవద్దు’ అని పేర్కొంటు మోహన్ బాబు పత్రిక ప్రకటనను విడుదల చేశారు. -
సొంత సోదరుడిలా చూసుకునేవారు
హరికృష్ణతో ‘సీతారామరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వైవీయస్ చౌదరి ఆయనతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ – ‘‘నేను రాఘవేంద్రరావుగారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నప్పుడు హరికృష్ణగారితో అనుబంధం ఏర్పడింది. ఆయన బాలకృష్ణగారి సినిమాలకు ప్రొడక్షన్ కంట్రోలర్‌గా ఉండేవారు. నేను గుడివాడ నుంచి వచ్చానని తెలిసి చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. ‘బాలకృష్ణగారు అందంగా చందమామలా ఉంటారు. మీరు కొంచెం యాంగ్రీ యంగ్‌మేన్ సినిమాలు చేయొచ్చు’ కదా అని అడిగితే ‘నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రదర్’ అనేవారు. నన్ను ఆప్యాయంగా సొంత సోదరుడిలా చూసుకునేవారు. ఇంటికి వెళ్లినప్పుడు కలిసి భోజనం చేసేవాళ్లం. లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తారక రామారావుగారి అభిమానిగా ఉన్న నాకు ఆయన కుమారుడితో సావాసం చాలా గొప్ప ఆనందం కలిగించింది. నిర్మాతగా నాకు జన్మనిచ్చారు ‘సీతారామరాజు’ స్క్రిప్ట్ తయారు చేసుకున్నాక నాగార్జునగారికి చెప్పినప్పుడు వేరే హీరోని ఎవర్ని అనుకుంటున్నావు అని అడిగితే హరికృష్ణగారు అన్నాను. నీకు నమ్మకం ఉందా? అని అడిగారు. ఉందన్నాను. హరికృష్ణగారిని కలిసే ఏర్పాటు చేశారు. నా దగ్గర ఓ కథ ఉంది అని చెప్పగానే ‘నాగేశ్వరరావు బాబాయ్ ప్రొడక్షన్, నాగార్జున తమ్ముడి సినిమా. నువ్వు నా ఆత్మీయుడివి కచ్చితంగా చేస్తాను’ అని కథ కూడా వినకుండా ఓకే చెప్పారు. ఆ తర్వాత కూడా ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాని నా మీద నమ్మకంతోనే చేశారు. దర్శకుడిగా ‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి’ ద్వారా నాకు జన్మనిచ్చింది నాగార్జునగారైతే, నిర్మాతగా జన్మనిచ్చింది హరికృష్ణగారు. ఆ సమయంలో పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా వేరే పార్టీ స్థాపించి అపజయంలో ఉన్నారాయన. అలాంటి సమయంలో సినిమా చేస్తారా? అని అడగడమే సాహసం. పైగా ‘లాహిరి లాహిరి లాహిరిలో’ నిర్మాతగా నా ఫస్ట్ సినిమా. ఎలా చేస్తావు అని అడిగారు తప్ప కథ కూడా అడగలేదు. నేను ఆయనకు నచ్చాను, ఆయనకు నచ్చితే అచంచెలమైన నమ్మకం ఏర్పరుచుకుంటారు. ఆ సినిమా చేస్తున్న ప్రాసెస్‌లో మధ్యలో అడ్జస్ట్మెంట్స్ ఉన్నా భరించారు. సినిమా రెమ్యునరేషన్ కూడా అందరికీ ఇచ్చాకే ఇవ్వులే అన్నారు. నీకు కుదిరినదాన్ని బట్టి ఇవ్వు అన్నారు. ఆయనకు ఇతరులను కష్టపెట్టే తత్వం లేదు, మానవత్వం ఉంది. ‘లాహిరి లాహిరి..’లో సినిమా రిలీజ్ రోజే ఆ సినిమా శతదినోత్సవ సంబరాలు ఫలానా చోట జరుగుతాయని యాడ్ ఇచ్చాను. ఆయన ఓడిపోయిన గుడివాడలోనే ఆ సినిమా 100 రోజుల ఫంక్షన్‌ని ఓ పెద్ద బహిరంగ సభలా నిర్వహించాం. అది నాకు బెస్ట్ మూమెంట్ అని ఫీల్ అవుతాను. అక్కడే డైరెక్ట్‌గా అనౌన్స్ చేశాను.. మేం ఇద్దరం కలసి ‘సీతయ్య’ సినిమా చేస్తున్నాం అని. 175 ప్రింట్స్‌తో రిలీజ్ చేశాం 48 ఏళ్ల వయసులో ఫుల్ టైమ్ హీరోగా చేయని ఆయనతో ఒక కమర్షియల్ సినిమా (‘సీతయ్య’) అనౌన్స్ చేయడం రిస్క్. ఆ సినిమా కమిట్ అయిన తర్వాత హీరోయిన్స్ ఎవర్ని అనుకుంటున్నావు అని అడిగారు. సిమ్రాన్, సౌంద్రర్య అని చెప్పాను. ఆయన షాక్ అయ్యారేమో కానీ కనబడనివ్వలేదు. రామారావుగారి అబ్బాయి, సీయం కొడుకుగా ఆయన చాలా సరదా మనిషి. ‘సీతయ్య’ సినిమాను 175 ప్రింట్స్‌తో రిలీజ్ చేశాం. అలా రిలీజ్ చేయడం చాలా తక్కువ మంది హీరోలకు జరిగేది ఆ రోజుల్లో. సుమారు 8 కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తే మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. చివరిగా ఆయన్ను మార్చి 2న కలిశాను. బర్త్‌డే సందర్భంగా వచ్చే నెల 2న కలుద్దామనుకున్నాను. ఈలోపు ఇలా జరగకూడనిది జరిగింది. హరికృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అన్నారు. -
'మా 'సినిమావాళ్ళవి' అద్దాలమేడ జీవితాలు'
డ్రగ్స్ కేసు విషయంలో సినిమా వాళ్లపై వస్తున్న విమర్శలు, మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారికి కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని, వారికి కుటుంబాలు ఉంటాయని అర్ధం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు వైవియస్ చౌదరి తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నారు. 'మేము అడుక్కున్నా అతిశయమే, అడుక్కోకున్నా అతిశయమే, మేము కొంచెం చేసినా 'అతి'శయమే, కొంచెమే చేసినా 'అతి'శయమే, అస్సలు మేమేంచేసినా, చేయకున్నా ప్రతివాడి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే/స్పందిస్తూనే ఉంటాం. ప్రతీ శుక్రవారం మా జీవనరేఖలు, జీవనసూత్రాలు, మా జీవితగమ్యాలు మారుతూనే ఉంటాయి. అలా ప్రతీ సంవత్సరంలో 52 సార్లు మార్పులకు, చేర్పులకు, కూర్పులకు అలవాటుపడ్డవాళ్ళం. ధైర్యసాహసాలను, కుట్రలూకుతంత్రాలను రచించగల/ప్రదర్శించగల కధానాయకులం, ప్రతినాయకులం. దానధర్మాలు, త్యాగాలు చేయగల మానవతావాదులం. మంచీ-చెడులు, గెలుపూ-ఓటమిలు, పొగడ్తలూ-ప్రశంసలు, నిందాపనిందలు మమ్మల్నెప్పుడూ వెంటాడే 'నీడ'లాంటి నేస్తాలు. మేము అందరికీ కావాల్సినవాళ్ళం, మా అవసరాలకి మాత్రం అందరికీ కానివాళ్ళం. ఏ మాధ్యమాలకైనా, ఏ విషయానికైనా మేమే అవసరం, మేమే ప్రథములం. మేము 'అల'లాంటి వాళ్ళం. 'అల'లాగా నిశ్చింతగా నిశ్చళంగా బతకడం చేతకానివాళ్ళం. కానీ, 'అల'లాగా పడినా లేవగల సత్తా ఉన్నవాళ్ళం. మేము దేనినైనా స్వీకరించగలం, దేనినైనా భరించగలం. దేనికైనా వెనకాడని దమ్ముగలవాళ్ళం. ఎంత మంది ఎన్ని అన్నా, అనకున్నా 'కళ' పట్ల, 'కళాకారుల' పట్ల వ్యామోహాన్ని ఆపలేరు, 'కళాకారులు' లోని తృష్ణని తగ్గించలేరు. ప్రపంచం ఎప్పుడూ వర్తమానంలోనే బ్రతుకుతుంది తప్ప, గతాన్ని గుర్తుకు తెచ్చుకునే ఓపికా ఉండదు, భవిష్యత్తు గురించి బెంగపడే తీరికా ఉండదు. కాలప్రవాహంలో ఇప్పడు సంచరిస్తున్న వార్తలన్నీ రేపటికి సద్దికూడు. ఎల్లుండికి విసిరేసిన విస్తరాకు. క్లుప్తంగా.. ఈ వర్తమానమంతా రేపటికి ఇంగువ కలిపిన కమ్మని పులిహోర (Exaggerated News), ఎల్లుండికి అందరూ వదిలించుకుందామనే అశుద్ధం. PS: ఇప్పుడు తెలుగు 'వెండితెర'పై కమ్మిన కారుమబ్బుల గురించి, నా ఈ గోడు మీ అందరికీ అర్ధమయ్యుంటుందని ఆశిస్తూ.. మీ.. వై వి ఎస్ చౌదరి.' అంటూ ప్రకటనను విడుదల చేశారు. -
అప్పన్న సన్నిధిలో వైవీఎస్ చౌదరి
సింహాచలం :సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి మంగళవా రం సింహాచలం శ్రీవరాహలక్ష్మీనసింహస్వామిని దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాల యం లో అషో్టత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన చేశా రు. స్వామి ప్రసాదాన్ని స్వీకరించారు. . -
తొలి గురువుకు సాయి ధరమ్ తేజ్ విషెస్
తాము ఎంత ఎదిగినా... గతాన్ని గుర్తు చేసుకుంటుంటారు. ఇక గురు-శిష్యుల అనుబంధానికి వస్తే... తొలి గురువును అంత తేలికగా మార్చిపోలేం. హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన తొలి గురువును స్మరించుకున్నాడు. 'ఫస్ట్ టీచర్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్' అంటూ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. వైవీఎస్ చౌదరి బర్త్‌డే (సోమవారం) సందర్భంగా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో వైవీఎస్ చౌదరి ద్వారా ఎంతో నేర్చుకున్నానంటూ... సాయి ధరమ్ తేజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ఫోటోను ట్విట్ చేశాడు. సాయి ధరమ్ తేజ తొలి చిత్రం 'రేయ్'ని బొమ్మరిల్లు పతాకంపై వైవీయస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన విషయం తెలిసిందే. The first teacher is always special he knows you in & out.Wishing my first teacher YVS Garu a very happy birthday. pic.twitter.com/Qv0MG6BK17 — Sai Dharam Tej (@IamSaiDharamTej) 23 May 2016 -
అంతా కొత్త వాళ్లతో సినిమా!
హిందీ ‘దేవదాసు’ గురించి చర్చలు ‘‘సినిమా అంటే నాకు చాలా ప్యాషన్. కథ తయారు చేయడం మొదలుపెట్టినప్పట్నుంచీ సినిమా పూర్తయ్యేవరకూ నాకు వేరే ఆలోచనే ఉండదు’’ అని దర్శకుడు వైవీయస్ చౌదరి అన్నారు. ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్‌గా దూసుకెళుతున్న రామ్‌లో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడనీ, ఆల్రెడీ ఒక దర్శకుడు రిజెక్ట్ చేసిన ఇలియానాలో మంచి హీరోయిన్ మెటీరియల్ ఉందని నమ్మి, ఇద్దర్నీ ‘దేవదాసు’ చిత్రం ద్వారా నాయకా నాయికలుగా పరిచయం చేశారాయన. అలాగే, నందమూరి హరికృష్ణ హీరోగా చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఆయన టైటిల్ రోల్లో ‘సీతయ్య’ తీశారు వైవీయస్. అంతకుముందు భారీ తారాగణంతో తీసిన ‘లాహిరి లాహిరి’ చిత్రంలో హరికృష్ణతో ప్రధాన పాత్ర చేయించడంతో పాటు, ఆయన, నాగార్జున కాంబినేషన్లో ‘సీతారామరాజు’ తీశారు. సుప్రీమ్ హీరోగా మాస్లో మంచి పేరు తెచ్చుకున్న సాయిధరమ్ తేజ్‌ను గుర్తించింది కూడా వైవీయస్సే. ‘‘ఓ దర్శకుడిగా ఎదుటి వ్యక్తి బాడీ లాంగ్వేజ్, ప్రవర్తనను బట్టి వాళ్లు ఆర్టిస్టులుగా పనికొస్తారా? లేదా? అని ఆలోచించుకుంటాను. పనికొస్తారనిపిస్తే పరిచయం చేస్తాను. ఇప్పుడు కూడా కొత్తవాళ్లతో సినిమా ప్లాన్ చేస్తున్నాను’’ అని వైవీయస్ అన్నారు. బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీయస్ సంగీత ప్రధానంగా సాగే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీశారు. నేడు ఆయన బర్త్‌డే. భవిష్యత్ ప్రణాళికల గురించి వైవీయస్ చెబుతూ - ‘‘కొత్తవాళ్లతో తీయబోతున్న చిత్రానికి కథ- స్క్రీన్‌ప్లే సమకూర్చి, దర్శకత్వం వహించడంతో పాటు నేనే నిర్మిస్తా. ‘దేవదాసు’ చిత్రం హిందీ రీమేక్ హక్కులను ఓ ప్రముఖ నిర్మాత అడిగారు. నన్నే దర్శకత్వం వహించమన్నారు. నాకు హిందీ చిత్రాలంటే ఇష్టం ఉన్నప్పటికీ తెలుగు చిత్రం ప్లాన్‌లో ఉండటంతో హిందీ రీమేక్‌కి ఇంకా మాటివ్వలేదు’’ అన్నారు. -
దేవదాసు పాతాళభైరవి లాంటి ప్రేమకథ
కారులో వాళ్లిద్దరే ఉన్నారు. హైదరాబాద్ నుంచి గుడివాడ వెళ్తున్నారు. వైవీయస్ చౌదరి డ్రైవ్ చేస్తున్నాడు. సడన్‌గా ఓ చోట వేరే రూట్‌కి తిప్పాడు. ‘‘ఇటెందుకు? ఇదంతా గతుకుల రోడ్డు. కొంచెం లాంగ్ కూడా’’ అన్నాడు కొమ్మినేని వెంకటేశ్వరరావు. ‘‘ఏం పర్లేదు. ఈ రూట్లో జర్నీ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ట్రాఫిక్ కూడా తక్కువ’’ చెప్పాడు చౌదరి. మాట్లాడలేదు కొమ్మినేని. అతనికి తెలుసు... చౌదరి ఒకసారి ఫిక్స్ అయితే తన మాట తనే వినడని! హరికృష్ణను హీరోగా పెట్టి ఆమధ్యే ‘సీతయ్య’ తీశాడు. దానికి క్యాప్షన్ ‘ఎవరి మాటా వినడు’! ఆ మాట చౌదరికి హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్. ‘సీతయ్య’కు బాగా పేరొచ్చింది. చౌదరి తర్వాత ఏం చేస్తాడు? కొమ్మినేని క్యూరియాసిటీతో అడిగాడు. ‘‘ఈసారేంటి?’’ చౌదరి డ్రైవ్‌ను ఆస్వాదిస్తూ సమా ధానం చెప్పలేదు. దారిలో ఓచోట ‘పాతాళభైరవి’ పోస్టర్ కనిపించింది. దానివైపు చూపిస్తూ ‘‘అలాంటి ప్రేమకథ చేద్దాం. అందరూ కొత్తవాళ్లతో’’ అన్నాడు చౌదరి. ఆ టైమ్‌లో చౌదరితో సినిమా చేయడానికి పెద్ద హీరోలు కూడా రెడీగా ఉన్నారు. కానీ ఇతగాడేమో కొత్తవాళ్లతో సినిమా అంటాడేంటి? ఈ జర్నీ ఎటు వెళ్తుందో!! అబ్బాయి పక్కా మాస్. అమ్మాయి ఫుల్ క్లాస్. ఇద్దరి మధ్యనా ప్యూర్ లవ్. పెద్దవాళ్లు ఒప్పుకోరు. అది కామన్. ఆ అమ్మాయి ప్రేమ కోసం అమెరికా వెళ్తాడు అబ్బాయి. ఇట్స్ ఎ న్యూ థాట్! రాకుమారిని మాంత్రికుడు ఎత్తుకెళ్లిపోతే తోటరాముడు వెళ్లలేదూ... ఇదీ అంతే. టైటిల్ ‘బాలరాజు’. ఫుల్ స్క్రిప్ట్ రెడీ. హైదరాబాద్‌లో ‘బొమ్మరిల్లు’ ఆఫీసులో కూర్చున్నారు చౌదరి, కొమ్మినేని. అది చౌదరి సొంత బ్యానర్. బాధ్యతంతా కొమ్మినేనిది. చౌదరికి అతనే బ్యాక్‌బోన్! ఈ ‘బాలరాజు’కి హీరోగా ఎవరిని తీసుకుందాం? ఏదైనా కాంటెస్ట్ రన్ చేద్దామా?... ఇలా ఏవేవో డిస్కషన్స్.‘‘అల్లు అర్జున్ ఈ స్టోరీకి కరెక్ట్ అనిపిస్తోంది’’ అన్నాడు కొమ్మినేని. ‘‘గుడ్ ఐడియా. ‘గంగోత్రి’ తర్వాత ఏ సినిమా కమిట్ అయినట్టు లేడు. అల్లు అరవింద్ గారిని కలిసొస్తా’’... చౌదరిలో హుషారు. కట్ చేస్తే - గీతా ఆర్ట్స్ ఆఫీసులో ఉన్నాడు చౌదరి. అరవింద్ కథ విని, ‘‘మావాడికి బావుంటుంది. కానీ ‘ఆర్య’ సినిమా చేస్తున్నాడు. అదయ్యాక డెసిషన్ తీసుకుందాం’’ అని చెప్పారు. బన్నీకి కూడా ఇంట్రస్ట్ ఉంది. కానీ చౌదరికి కన్ఫ్యూజన్. ‘ఆర్య’ పూర్తయ్యాక ఒకవేళ కాదంటే? అందుకే ఎవరైనా కొత్త హీరోతో వెళ్లిపోతే బెటర్. సీనియర్ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ రమ్మంటే వెళ్లాడు చౌదరి. ‘‘తిరుమలై అనే తమిళ సినిమా హక్కులు కొన్నా. నీ డెరైక్షన్‌లో రీమేక్ చేద్దామనుకుంటున్నా. ఏమంటావ్?’’ అడిగారు రవికిశోర్. ‘‘ఆల్రెడీ నేనో ప్రాజెక్టు ప్లానింగ్‌లో ఉన్నా. కొత్త హీరో హీరోయిన్లు కావాలి. ఎవరైనా ఉంటే చెప్పండి’’ అడిగాడు చౌదరి. రవికిశోర్ తన మొబైల్ ఫోన్లో ఓ వీడియో చూపించారు. ‘‘ఈ కుర్రాడు చాలా బావున్నాడు. డీటైల్స్ చెప్పండి. నేనే హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తా’’ అన్నాడు చౌదరి. ‘‘మా తమ్ముడు మురళి చిన్నకొడుకు.. రామ్. నేను, సురేశ్‌బాబు కలిసి ‘ఫర్ ది పీపుల్’ అనే మలయాళ సినిమాను ‘యువసేన’గా రీమేక్ చేయాలనుకుంటున్నాం. నలుగురు కుర్రాళ్లలో ఒకరిగా రామ్‌ను ఇంట్రడ్యూస్ చేద్దామనుకుంటున్నాం’’ చెప్పారాయన. ‘‘కుర్రాణ్ణి నాకొదిలేయండి. భారీ లెవెల్లో ఈ సినిమా చేస్తా’’ అన్నాడు చౌదరి. రవికిశోర్‌కి కూడా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. కానీ ఇంకో ట్విస్ట్ ఉంది. ప్రసిద్ధ దర్శకుడు శంకర్ నిర్మాత అవతారమెత్తి, బాలాజీ శక్తివేల్ డెరైక్షన్‌లో ‘కాదల్’ అనే ఫిల్మ్ ప్లాన్ చేశాడు. హీరోగా రామ్ ఆల్మోస్ట్ ఓకే. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఇప్పుడు చౌదరి సినిమా చేయాలంటే, రామ్ రెండు సినిమాలు మానేయాలి. కానీ రామ్‌కు ఏది బెస్ట్ ఫ్యూచర్నిస్తుందో రవికి శోర్ బాగా జడ్జ్ చేయగలరు. చౌదరికే ఆయన ఓటు. హమ్మయ్య, చౌదరికి హీరో దొరికాడు. ఇక హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టాలి. చౌదరి ఆ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న టైమ్‌లో అరవింద్ నుంచి పిలుపు. బన్నీ డేట్స్ ఇవ్వడానికి రెడీ. అప్పటికే ‘ఆర్య’ సూపర్ హిట్. బన్నీతో సినిమాలు చేయడానికి చాలామంది క్యూలో ఉన్నారు. కానీ చౌదరికే ఫస్ట్ చాన్స్. అయితే రామ్‌కి మాటిచ్చేశాడు చౌదరి. అరవింద్‌తో ఆ విషయం చెప్పి వచ్చేశాడు. ముంబైలో ఫేమస్ మోడల్ కో-ఆర్డినేటర్ సుష్మా కౌల్ ఆఫీస్. హీరోయిన్లు కావాలనుకునే అమ్మాయిలందరికీ ఆమె ఆఫీసే పెద్ద అడ్డా. అక్కడ ఇలియానా ఫొటో చూడగానే చౌదరి ఫ్లాట్. లవ్లీగా ఉంది. కానీ ఆల్రెడీ తేజ సెలెక్ట్ చేసేశాడు... ‘ధైర్యం’ మూవీ కోసం. పాపం చౌదరి! మళ్లీ వెతుకులాట మొదలు! ఇలియానా హైదరాబాద్‌లో, ‘ధైర్యం’ షూటింగ్లో ఉంది. నిజానికి ఆ క్యారెక్టర్‌కి ఫాస్ట్ లుక్ ఉన్న అమ్మాయి కావాలి. ఇలియానా ఏమో సాఫ్ట్ లుక్. అప్పటికే కొంత షూట్ చేశారు. తనను తీసేయలేరు. అలాగని ఉంచనూ లేరు. అదే టైమ్‌లో చౌదరికి ఇలియానా నచ్చిందన్న విషయం జర్నలిస్ట్ అన్నే రవి ద్వారా తేజకు తెలిసింది. ‘‘వాళ్లకంతగా నచ్చితే ఇచ్చేద్దాం. అయితే ఇలియానా హర్ట్ కాకూడదు’’ చెప్పాడు తేజ. అంతా స్మూత్‌గా జరిగిపోయింది. తేజ క్యాంప్‌లో నుంచి చౌదరి క్యాంప్‌లోకి వచ్చిపడింది ఇలియానా. హీరోయిన్ ఫాదర్‌గా ప్రకాశ్‌రాజ్ లాంటి స్టేచర్ ఉన్నవాడు కావాలి. కానీ ప్రకాశ్‌రాజ్ అన్ని డేట్స్ ఇవ్వలేడు. దాంతో శాయాజీ షిండేను తీసుకున్నారు. మ్యూజిక్ కీరవాణి చేయాలి. లాస్ట్ మినిట్‌లో చక్రి చేరాడు.హీరో హీరోయిన్లు కొత్తవాళ్లు కాబట్టి ప్రమోషన్ హై లెవెల్లో ఉండాలి. టైటిల్ నుంచే డిస్కషన్ స్టార్ట్ కావాలి. ‘బాలరాజు’ కన్నా ‘దేవదాసు’ బాగుంటుంది. ఓపెనింగ్ ఇన్విటేషనే అదిరిపోయింది. 36 పేజీలు. ఆల్బమ్‌లా ఉంది. అందరి లుక్కూ ‘దేవదాసు’పైనే. 2004 సెప్టెంబర్ 24. ‘దేవదాసు’ గ్రాండ్ ఓపెనింగ్. ఇండియాతో పాటు బ్యాంకాక్‌లో 17 రోజులు, యూఎస్‌లో 45 రోజులు తీశారు. యూఎస్‌లోని గ్రాండ్ కాన్యన్, హాలీవుడ్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, అమెరికన్ కాంగ్రెస్ బిల్డింగ్ లాంటి చోట్ల షూట్ చేశారు. పాతిక మంది యూనిట్‌తో ఇన్ని లొకేషన్స్‌లో తీయడం మాటలు కాదు. ఫిల్మ్ అక్కడే కొని, అక్కడే డెవెలప్ చేశారు. టిక్కెటింగ్‌తో కలిపి యూఎస్, బ్యాంకాక్ ఎపిసోడ్ల షూటింగంతా 90 లక్షల్లోపే పూర్తి చేసేశారు. అంత తక్కువలో ఎలా చేయగలిగారని చాలామంది ఆశ్చర్యపోయారు. చౌదరి కూడా అమరశిల్పి జక్కన్నే. సినిమా కంప్లీట్ కావడానికి 192 రోజులు పట్టింది. 6 కోట్లతో ‘దేవదాసు’ రెడీ. సంక్రాంతికి రిలీజ్. పోటీలో వెంకటేశ్ ‘లక్ష్మీ’, లారెన్స్ ‘స్టైల్’, సిద్ధార్థ్ ‘చుక్కల్లో చంద్రుడు’ ఉన్నాయి. అందరూ స్టార్సే. ఇదొక్కటే నాన్‌స్టార్ మూవీ. 2006 జనవరి 11న ‘దేవదాసు’ రిలీజైంది. ఫస్ట్ ఫోర్ వీక్స్ డివెడైడ్ టాక్. ఆరోవారం నుంచీ ‘దేవదాసు’కి అందరూ దాసోహం. హైదరాబాద్‌లోని ఓడియన్‌లో ఏకంగా 200 రోజులు ప్రదర్శితమైంది. రామ్‌కి ఫస్ట్ మూవీతోనే స్టార్ స్టేటస్. ఇలియానాకు కూడా ఒకప్పుడు దివ్యభారతికొచ్చినంత క్రేజ్. ‘పాతాళభైరవి’ చూస్తున్నాడు చౌదరి. పక్కనే కొమ్మినేని. ‘సాహసం సాయరా డింభకా’ అనే డైలాగ్ దగ్గర పాజ్ చేశాడు. ఈ డైలాగ్ నా కోసమే చెప్పారా ఏంటి? అనుకున్నాడు. ‘దేవదాసు’ 200 రోజుల షీల్డ్ అతని వైపే విజయగర్వంతో చూస్తోంది. వెరీ ఇంట్రస్టింగ్ ఒక సామాన్యుడు, ఓ కోటీశ్వరుడి కూతుర్ని ప్రేమించి, ఆ ప్రేమ కోసం ఫారిన్ వెళ్లడమనే కాన్సెప్ట్‌తో తారకరత్న ‘భద్రాద్రిరాముడు’, శివాజీ ‘ఎర్రబాబు’ చేశారు. ఈ రెండూ కూడా ‘దేవదాసు’ కన్నా ముందే రిలీజయ్యాయి. ‘దేవదాసు’ టైమ్‌లోనే నితిన్ హీరోగా ‘ఎడిటర్’ శంకర్ డెరైక్షన్‌లో ఇదే కాన్సెప్ట్‌తో సినిమా మొదలుపెట్టి ఆపేశారు. దర్శకుడు సూర్యకిరణ్ మలయాళంలో అదే పేరుతో డబ్ చేశారు. హిందీలో ‘సబ్సే బడా దిల్వాలా’ పేరుతో అనువాదమైంది. బెంగాలీలో ‘పగ్లూ’ పేరుతో రీమేక్ అయ్యింది. -
రాజ్ తరుణ్ రిస్క్ చేస్తున్నాడా..?
'ఉయ్యాలా జంపాల', 'సినిమా చూపిస్తా మామ' లాంటి వరుస సూపర్ హిట్స్‌తో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజ్ తరుణ్. షార్ట్ ఫిలింస్ చేసిన అనుభవంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి అనుకోకుండా నటుడు అయిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే తన జనరేషన్లో కాంపిటేషన్ ఎక్కువగా ఉందని ఫీల్ అవుతున్నాడేమో, రిస్కీ ప్రాజెక్ట్స్‌ను అంగీకరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ నిర్మాతగా తెరకెక్కిస్తున్న 'కుమారి 21ఎఫ్' సినిమాను పూర్తి చేసిన రాజ్‌తరుణ్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ సినిమాలు పూర్తి కాగానే రామ్ గోపాల్‌వర్మ దర్శకత్వంలో మూకీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలో వర్మ దర్శకత్వంలో నటించటమే రిస్క్ ...అలాంటిది మూకీ సినిమా చేయటం అంటే సాహసమే. 'రేయ్' సినిమాతో భారీ పరాజయాన్ని చవిచూసిన వైవియస్ చౌదరి దర్శకత్వంలోనూ రాజ్‌తరుణ్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ యిచ్చాడు. చాలా కాలంగా కెరీర్లో సరైన హిట్ లేక కష్టాల్లో ఉన్న చౌదరి 'రేయ్' సినిమా తరువాత ఇండస్ట్రీలో ఎవరికి కనిపించటం లేదు. ఈ గ్యాప్ లో ఓ యూత్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి రాజ్ తరుణ్‌తో ఓకె చేసుకున్నాడు. ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలనుకుంటున్న చౌదరికి రాజ్‌తరుణ్ ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి. -
ఎన్టీఆర్ జయంతి ప్రతి ఒక్కరికి పండగ రోజు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ జయంతి ప్రతి ఒక్కరికి పండగ రోజు అని ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి అన్నారు. ఎన్టీఆర్ 92వ జయంతి సందర్భంగా గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద దివంగత నటుడికి వైవీఎస్ చౌదరి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైవీఎస్ మాట్లాడుతూ... రిక్షావాడి నుంచి రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, విదేశీ శాస్త్రవేత్తల వరకు అందరికీ ఎన్టీఆర్ జీవితం ఆదర్శమన్నారు. హైందవ సంప్రదాయంలో భాగమైన రామాయణ, మహాభారతం, భాగవతంలోని వివిధ పాత్రలకు జీవం పోసిన మహానటుడు ఎన్టీఆర్ అని ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా తెలుగు ప్రజలందరూ కేంద్రాన్ని కోరాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు వివిధ పార్టీల నేతలు కృషి చేయాలని వైవీఎస్ ఈ సందర్భంగా కోరారు.