టాలీవుడ్ హీరో రామ్‌పై నిర్మాత వైవీఎస్ చౌదరి సంచలన కామెంట్స్ చేశారు. రామ్‌కు ఇండస్ట్రీలో పెద్దగా మార్కెట్ ఉండేది కాదని అన్నారు. అతనితో కలిసి నిర్మించిన దేవదాసు చిత్రానికి నాలుగు వారాల పాటు ప్రేక్షకులే రాలేదని వెల్లడించారు. సినిమాను ప్రొడ్యూస్ చేయటం అంత ఈజీ కాదని.. రామ్‌పై ఒక్క రూపాయి కూడా స్కేలబిలీటీ ఉండదని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో వైవీఎస్ చౌదరి మాట్లాడారు.
వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ..'దేవదాసు సినిమా రిలీజ్ రోజునే రూ.10 కోట్లు పోయాయి అన్నారు. నా ఆస్తులన్నీ స్టేక్‌లో ఉన్నాయి. నాలుగు వారాల వరకు జనాలు లేరు. కానీ నేను బ్రహ్మండగా జనాలు ఉన్నారని మైకుల్లో మాట్లాడా. ఇదే నిజం. నేను శాటిలైట్స్ తక్కువ రేట్‌కే అమ్మాను. నా విజయాలు అంత ఈజీగా రాలేదు. జనవరి 11న దేవదాసు రిలీజైంది. ఆ తర్వాత 12వ తేదీనే స్టైల్ సినిమా రిలీజైంది. చిరంజీవి, లారెన్స్ ఆ దెబ్బకు నా సినిమా కుదేలైంది.' అన్నారు
సంక్రాంతి సీజన్‌లో లవ్ స్టోరీలు సినిమాలు చూడరు. ఆ వైపు అస్సలు వెళ్లరు. 13న చుక్కల్లో చంద్రుడు, లక్ష్మి సినిమాలు రిలీజ్. నా సినిమాకు థియేటర్ల వద్ద జనాలే లేరు. ఇక 14వ తేదీకల్లా జీ టీవీకి ముందు అనుకున్న దానికంటే తక్కువ ధరకే శాటిలైట్ రైట్స్ అమ్ముకున్నా. డబ్బులు పెట్టుకుని తిరిగితే నాలుగు వారాల తర్వాత నా సినిమాకు సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత 17 సెంటర్లలో 175 డేస్ ఆడింది. ఇక్కడ రామ్‌ను నేను తక్కువ చేయడం లేదు.' అని అన్నారు. ప్రస్తుతం వైవీఎస్ చౌదరి నందమూరి జానకి రామ్ కుమారుడిని హీరోగా పరిచయం చేయనున్నారు.
కాగా.. రామ్ పోతినేని ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను పూరి జగన్నాధ్ తెరకెక్కించనున్నారు. 2006లో రామ్, వైవీఎస్ చౌదరి కాంబోలో వచ్చిన దేవదాసు చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఇలియానా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment