మోస్ట్ పవర్‌ఫుల్ చిత్రం ‘రేయ్’
‘‘‘రేయ్’ టైటిల్‌లో ఓ ఫోర్స్ ఉంది. ఓ పవర్ ఉంది. ఈ సినిమా కథతో పాటు హీరో పాత్ర చిత్రణ కూడా అంతే ఫోర్స్‌గా, మోస్ట్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది’’ అంటున్నారు వైవీఎస్ చౌదరి. బొమ్మరిల్లు వారి పతాకంపై ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రేయ్’. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా పరిచయమవుతున్నారు.
సయామిఖేర్, శ్రద్ధాదాస్ ఇందులో హీరోయిన్లు. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వైవీయస్ చౌదరి మాట్లాడుతూ -‘‘అక్టోబర్ 11న దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం.ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది.
అయితే... మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా మూడు సినిమాలు విడుదల కాబోతుండటంతో, మేం దసరాకు విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ‘దేవదాసు’ తరహాలోనే చక్రి, నేను, చంద్రబోస్ కలిసి పనిచేసిన ‘రేయ్’ పాటలు కూడా అంతకు మించి సంచలనం సృష్టిస్తాయని నమ్ముతున్నాం. త్వరలోనే మెగా బ్రదర్స్ సమక్షంలో ఈ పాటలను విడుదల చేస్తాం. సాయిధరమ్‌తేజ్‌ని కచ్చితంగా స్టార్‌హీరోల్లో ఒకరిగా తనను నిలబెట్టే సినిమా ఇది’’ అన్నారు.