REY
-
చక్రి లేకపోవడం బాధగా ఉంది : వైవీయస్ చౌదరి
‘‘రేయ్ చిత్రం మాస్‌ని బాగా ఆకట్టుకుంటోంది. పరీక్షల సమయం కావడం వల్ల యూత్ తక్కువగా వస్తున్నారు. వాళ్లు కూడా బాగా వస్తే, వసూళ్లు ఇంకా బాగుంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తే, గతంలో వైవీయస్ చౌదరి తీసిన ‘దేవదాసు’ స్థాయి విజయం సాధిస్తుంది’’ అని దర్శక, నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. సాయిధరమ్ తేజ్, శ్రద్ధాదాస్‌లతో స్వీయ దర్శకత్వంలో వైవీయస్ రూపొందించిన ‘రేయ్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. చక్రి స్వరాలందించిన ఈ చిత్రం ఆడియో ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుక చక్రిగారిదనీ, ఆయన లేని లోటు స్పష్టంగా తెలుస్తోందనీ సాయిధరమ్ తేజ్ అన్నారు. వైవీయస్ మాట్లాడుతూ, ‘‘చక్రి మన మధ్య లేకపోవడం బాధగా ఉంది. చిత్రవిజయానికి పాటలెంతో దోహదపడ్డాయి. ‘పవనిజం’ పాటను ఈ శుక్రవారం గుడ్ ఫ్రైడే నుండి జత చేస్తున్నాం. అప్పట్లో ‘దేవదాసు’ స్లోగా పికప్ అయ్యి, మంచి విజయం సాధించింది. ‘రేయ్’ కూడా అంతే’’ అన్నారు. దర్శకుడు సాగర్, రచయిత శ్రీధర్ సీపాన తదితరులు పాల్గొన్నారు. -
‘రేయ్’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్
-
‘దేవదాసు’ రోజులు గుర్తొచ్చాయి...
‘‘ ‘రేయ్’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నా ‘దేవదాసు’ సినిమా రోజులు గుర్తొచ్చాయి. మా క ష్టాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ‘పవనిజం’ సాంగ్‌ను సెన్సార్ చేసి త్వరలోనే సినిమాకు జత చేస్తాం’’ అని వైవీయస్ చౌదరి తెలిపారు. సాయిధరమ్‌తేజ్, సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ ముఖ్యతారలుగా బొమ్మరిల్లువారి పతాకంపై వైవీయస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రేయ్’ ఇటీవల విడుద లైంది. ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీనికి కారణం వైవియస్ చౌదరిగారు. ఆయన కృషి, పట్టుదల కారణంగానే సినిమా ఇంత ఘన విజయం సాధించింది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత చంద్రబోస్, నోయెల్, జానీ మాస్టర్, శ్రీధర్ సీపాన, మణికిరణ్, హరీష్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
గౌను తెచ్చిన ఇబ్బంది!
‘‘ ‘రేయ్’లో నేను చేసిన పాప్ స్టార్ పాత్ర నా కెరీర్‌కి మంచి బ్రేక్‌నిస్తుంది’’ అని శ్రద్ధాదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. సాయిధరమ్ తేజ్ హీరోగా స్వీయదర్శకత్వంలో వైవీయస్ చౌదరి రూపొందించిన ‘రేయ్’ ఈ నెల 27న విడుదల కానుంది. ఇందులో ప్రతినాయిక పాత్ర చేసిన శ్రద్ధాదాస్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో చేసిన మెక్సికన్ అమెరికా పాప్‌స్టార్ పాత్ర కోసం బరువు తగ్గాను. జెన్నిఫర్ లోపెజ్, బ్రిట్నీ స్పియర్స్ వంటి హాలీవుడ్ తారల వీడియోలను వైవీయస్గారు చూపించారు. వాళ్ల స్టయిల్ని చూసి, నాదైన శైలిలో ఈ పాత్ర చేశాను. ఈ సినిమా కోసం 250 నుంచి 300 కాస్ట్యూమ్స్ వాడాను. రెక్కలున్న ఓ గౌను అయితే నన్ను చాలా ఇబ్బందిపెట్టేసింది. అది వేసుకున్న తర్వాత కూర్చోవడానికి కుదిరేది కాదు. ఆ గౌనుకి సంధించిన షూటింగ్ చేసినన్నాళ్లు నిలబడే ఉండేదాన్ని. వైవీయస్గారి టేకింగ్ బ్రహ్మాండం. ‘నరసింహా’లో రమ్యకృష్ణ చేసిన తర్వాత ఆ స్థాయి ఉన్న పాత్ర ఇదే అవుతుందనీ, బాగా నటించావనీ రష్ చూసినవాళ్లు చెబుతున్నారు. అందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. -
పవన్ కల్యాణ్‌ని చూసి ఆశ్చర్యపోయాను!
తెలుగు తెరపైకి రానున్న మరో ఉత్తరాది భామ ‘సయామీ ఖేర్’. ఈ బ్యూటీది సాదాసీదా నేపథ్యం కాదు. ప్రసిద్ధ హిందీ నటి షబానా ఆజ్మీకి స్వయానా మేనకోడలు. వైవీయస్ చౌదరి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘రేయ్’ ద్వారా తెలుగు తెరకు పరిచయం కానున్న సయామీ చెప్పిన కబుర్లు... నేను పుట్టి, పెరిగింది ముంబయ్‌లోనే. మా నానమ్మ ఉషా ఖేర్ హిందీ, మరాఠీ భాషల్లో దాదాపు 50 చిత్రాల్లో నటించారు. మా అమ్మా, నాన్నలకు కూడా గ్లామర్ ప్రపంచంతో అనుబంధం ఉంది. మా అత్తయ్య షబానా ఆజ్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే నా బ్లడ్‌లోనే నటన ఉందనుకుంటున్నా. ముందు మోడల్‌గా పలు ఉత్పత్తులకు చేశాను. కింగ్‌ఫిషర్ క్యాలెండర్ చూసి, వైవీయస్ చౌదరిగారు ‘రేయ్’ కోసం అడిగారు. అప్పుడు మా అత్తయ్య నాతో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ‘ఒకవేళ నువ్వు కథానాయికగా చేయాలనుకుంటే ముందు దక్షిణాది చిత్రాలతో మొదలుపెట్టు’ అని. అందుకే చౌదరిగారికి వెంటనే ఓకే చెప్పేశా. ‘రేయ్’ అంటే అర్థం తెలుసు. కోపంగానూ ఆ మాట అనొచ్చు.. ఆత్మీయంగానూ అనొచ్చు. కానీ, నా మటుకు నాకు ఈ పదంలో ఏదో ఆత్మీయత ఉందనిపిస్తుంది. ‘షౌట్ ఫర్ సక్సెస్’ అని ఉపశీర్షిక పెట్టారు. మేం కచ్చితంగా సక్సెస్ కొడతాం. అందులో డౌటే లేదు. ఈ చిత్రంలో నాది పది నిమిషాలు అలా వచ్చి, ఇలా వెళ్లిపోయే పాత్ర కాదు. చాలా శక్తిమంతమైన పాత్ర. ఈ చిత్రాన్ని చౌదరిగారు తెరకెక్కించిన విధానం సూపర్బ్. పాటలైతే ఎంత బాగా తీశారంటే.. కదలకుండా చూసేస్తారు. నేనీ సినిమా ఒప్పుకున్నప్పుడు సాయిధరమ్ తేజ్ ఎవరో తెలియదు. ఆ తర్వాత చిరంజీవిగారి మేనల్లుడని తెలిసి, భయపడ్డాను. పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు.. ఎలా ఉంటాడో అనుకున్నాను. కానీ, తను చాలా నిరాడంబరంగా ఉంటాడు. ఆ మాటకొస్తే, సాయిధరమ్ ఇంకో బాబాయ్ (పవన్ కల్యాణ్)ని చూసి ఆశ్చర్యపోయాను. అంత పెద్ద స్టార్ అయ్యుండి ఎంతో డౌన్ టు ఎర్త్లా ఉంటారు. రామ్‌చరణ్, బన్నీ (అల్లు అర్జున్) అందరూ కూడా అంతే. తన మేనమామల్లానే సాయి కూడా ఉంటాడు. అందర్నీ ఒకచోట చూసినప్పుడు వాళ్ల హావభావాలు దాదాపు ఒకే విధంగా ఉండటం చూసి, భలే అనిపించింది. పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, బన్నీ నటించిన చిత్రాలు చూశాను. నాకైతే తెలుగు హీరోలందరితో నటించాలని ఉంది. గ్లామర్, డీ-గ్లామర్ రెండు రకాల పాత్రలూ చేయాలనుకుంటున్నా. కథానుగుణంగా పెదవి ముద్దు సన్నివేశాలు చేయడానికి వెనకాడను. ప్రస్తుతం హిందీలో రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో ‘మీర్జా సాహిబా’ అనే చిత్రంలో నటిస్తున్నా. -
విమర్శలా నాకేం తెలియదు: సాయి ధరంతేజ్
తిరుమల : సినీనటుడు సాయి ధరంతేజ్ శుక్రవారం తిరుమల విచ్చేశాడు. ఈరోజు తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శనంలో అతను వెంకన్న దర్శనం చేసుకున్నాడు. దర్శనం అనంతరం సాయి ధరంతేజ మీడియాతో మాట్లాడుతూ త్వరలో దిల్ రాజు బ్యానర్లో హరీష్ శంకర్ దర్శకత్వం వస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పాడు. అలాగే 'రేయ్' చిత్రంపై ఆ చిత్ర నిర్మాత వైవీఎస్ చౌదరే స్వయంగా ప్రకటన చేస్తారని తెలిపాడు. కాగా 'మేము సైతం' కార్యక్రమంపై దర్శక, నిర్మాత తమ్మారెడ్డి వ్యాఖ్యలపై తనకేమీ తెలియదని...విలేకర్లు అడిగిన ప్రశ్నకు సాయి ధరంతేజ్ సమాధానమిచ్చాడు. మంచి విషయం కోసం ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని...అయితే విమర్శలు గురించి తనకు తెలియదని, వాటిని పట్టించుకోనని తెలిపాడు. తాను కూడా మేము సైతం కార్యక్రమంలో డాన్స్ ఫెర్మామెన్స్ ఇచ్చినట్లు చెప్పాడు. ఈ సందర్భంగా సాయి ధరంతేజ్తో ఫోటోలు దిగేందుకు, షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు పలువురు పోటీ పడ్డారు. సాయి ధరంతేజ్ హీరోగా నటించిన 'పిల్ల నువ్వేలేని జీవితం' సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. -
టాలీవుడ్ దర్శకుడిపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి!
ఓ టాలీవుడ్ దర్శకుడుపై నటుడు పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ఫిలింనగర్ లో ఓ వార్తా వెలుగులోకి వచ్చింది. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో 'రేయ్' చిత్రాన్ని మూడేళ్ల క్రితం ప్రారంభించి.. ఇంకా పూర్తికాకుండా నాన్చుతున్న దర్శకుడి తీరు పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి కారణమైంది. గతంలో ఆర్ధిక సమస్యల్లో చిక్కుకున్న 'రేయ్' చిత్రానికి పవన్ ఆర్ధిక సహాయాన్ని కూడా అందించి పూర్తి చేసేందుకు సహకరించారనే వార్తలు గతంలో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయినా దర్శకుడు 'రేయ్' చిత్ర షూటింగ్ ను పూర్తి చేయడంలో దర్శకుడు విఫలం కావడం పవన్ నచ్చడం లేదట. 'రేయ్' చిత్రాన్ని పూర్తి చేసి విడుదలకు సిద్దం చేయాలని దర్శకుడికి మెగా ఫ్యామిలీ ఇటీవల సూచించారని ఫిలింనగర్ సమాచారం. ఏదిఏమైనా మూడేళ్ల క్రితం ప్రారంభించిన 'రేయ్' చిత్రంపై మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. చిత్ర షూటింగ్ పూర్తి చేసుకోవడానికి, విడుదల కావడం అడ్డుపడిన సమస్యల్ని అధిగమించి ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం! -
రెండు ఖండాల్లో ప్రేమకథ
‘‘ప్రతిష్ఠాత్మకంగా నేను చేసిన ‘ఒక్క మగాడు’, ‘సలీం’ సినిమాలు అపజయం పాలైనపుడు నా బాధ వర్ణనాతీతం. మా నాన్న, అన్నయ్య చనిపోయినప్పుడు కూడా నేనంత బాధ పడలేదు’’ అని గతాన్ని నెమరువేసుకున్నారు దర్శక - నిర్మాత వైవీఎస్ చౌదరి. సాయిధరమ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ వైవీఎస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రేయ్’. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వైవీఎస్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించిన సినిమా ‘రేయ్’ అని, కానీ.. కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచీ ఈ సినిమాకు అవాంతరాలేనని, విడుదలకు కూడా అలాంటి అవాంతరాలే తలెత్తుతున్నాయని, మొక్కవోని ధైర్యంతో ముందుకెళుతున్నానని వైవీఎస్ చెప్పారు. ‘రేయ్’ గురించి ఇంకా చెబుతూ -‘‘రెండు ఖండాల నేపథ్యంలో సాగే కథ ఇది. అందుకే అమెరికా, వెస్టిండీసుల్లో భారీ షెడ్యూల్ చేశాం. ఎఫ్డీసీ నిబంధనల మేరకు కొన్ని సన్నివేశాలు ఇక్కడే తీయాల్సి వచ్చింది. అందుకే అక్కడి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ... ఇక్కడే కొన్ని సన్నివేశాలు తీశాను. దానికి అదనంగా భారీ ఖర్చయింది. అరుంధతి, మగధీర చిత్రాల తర్వాత ఆ స్థాయి గ్రాఫిక్స్‌తో తెరకెక్కిన సినిమా ఇది. మెగా కుటుంబం నాపై పెట్టిన నమ్మకాన్ని వందకు వంద శాతం నిలబెడుతుందీ సినిమా’’ అని విశ్వాసం వెలిబుచ్చారు వైవీఎస్. -
రేయ్ ఆడియో వేడుక హైలెట్స్
-
పవన్ కళ్యాణ్ 'సిఫారసు' రూమర్లపై వైవీఎస్ ఖండన
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విజ్ఞప్తి మేరకే ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు 'రేయ్' చిత్రంలో అవకాశం కల్పించినట్టు వస్తున్న రూమర్లను ఆ చిత్ర దర్శకుడు వైవీఎస్ చౌదరీ ఖండించారు. సాయి ధరమ్ తేజ్ తో చిత్రాన్ని నిర్మించేందుకు పవన్ కళ్యాణ్ అనుమతి తీసుకున్న మాట వాస్తవమే అని వైవీఎస్ తెలిపారు. అయితే తన అనుమతి అవసరం లేదు. మీరు సాయిని అప్రోచ్ అవ్వవచ్చు అని పవన్ కళ్యాణ్ తెలిపారని వైవీఎస్ అన్నారు. సాయి కోసం పవన్ కళ్యాణ్ ఎన్నడూ సిఫారసు చేయలేదు అని చౌదరీ స్పష్టం చేశారు. సలహా తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ ను సాయి సంప్రదించగా, వెంటనే యాక్టింగ్ స్కూల్ లో చేరమని చెప్పారని.. అంతేకాకుండా గుర్తింపు కోసం మెగా కుటుంబం పేరును ఉపయోగించుకోవద్దని సలహా ఇచ్చారని వైవీఎస్ తెలిపారు. సినీ పరిశ్రమ ఏ ఒక్క కుటుంబానికి చెందినవారిది కాదని.. ఎవరైనా పరిశ్రమలో రాణించవచ్చు అని ఇటీవల రేయ్ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
‘రేయ్’ ఆడియో వేడుక
-
సినిమా పరిశ్రమ ఏ ఒక్క కుటుంబానికో చెందినది కాదు
- ‘రేయ్’ ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ ‘‘ఈ సినిమా కోసం నేను చేసిందేమీ లేదు. చౌదరి, తేజ్ ఓ పట్టుదలతో చేస్తున్నారు కాబట్టి, మానసిక స్థయిర్యం ఇచ్చా. మాట సహాయం చేశా. తేజ్ నా అక్క కొడుకు. తను ఏంబీఎ చేస్తున్నప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తానంటూ సలహా అడిగాడు. సలహాలిచ్చే స్థాయిలో లేనన్నాను. కాకపోతే, నాకు తెలిసిన యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి పంపించాను. ఓ నటుడు ఏదైనా సాధించాలంటే అతని పట్టుదల, కృషి మీదే ఆధారపడి ఉంటుంది. వారసత్వం, కుటుంబంవల్లా సాధించలేరు. అదే తేజ్‌తో చెప్పాను’’ అన్నారు పవన్ కళ్యాణ్. సాయిధరమ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ యలమంచిలి గీత సమ ర్పణలో బొమ్మరిల్లువారి పతాకంపై స్వీయదర్శకత్వంలో వైవీయస్ చౌదరి నిర్మించిన చిత్రం ‘రేయ్’. చక్రి స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ముఖ్యఅతిథిగా పాల్గొన్న పవన్‌కళ్యాణ్ ఆవిష్కరించి, వైవీయస్ తనయ యుక్తాకి అందించారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ - ‘‘సినిమా పరిశ్రమ ఏ ఒక్క కుటుంబానికో చెందినది కాదు. మా కుటుంబానిది కూడా కాదు. అందుకే, మా కుటుంబం నుంచి వస్తున్న హీరో అనడానికి నేను ఇష్టపడటంలేదు. ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న కొత్త హీరోకి శుభాకాంక్షలు చెబుతున్నాను. ఈ సినిమాకి రకరకాల కష్టాలొచ్చాయి. మామూలుగా ఎవరైనా నీరసపడిపోతారు. కానీ, వైవీయస్ చౌదరి ఎంతో పట్టుదలతో ఈ సినిమాని పూర్తి చేశారు. ఆయనలో నాకు నచ్చింది ఆయన బలమే. చక్రి పాటలంటే నాకు చాలా ఇష్టం. మంచి ఊపుగా ఉంటాయి. ఈ పాటలు విన్నాను. బాగున్నాయి’’ అన్నారు. వైవీయస్ చౌదరి మాట్లాడుతూ -‘‘స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి ఆదర్శంతో సినిమాల్లోకొచ్చి, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నేనూ మీలానే పవన్‌కళ్యాణ్‌గారి అభిమానిని. నిజాయితీగా నడుచుకోవడం, నిస్వార్థంగా సహాయం చేయడం, ఎంత పెద్దదైనా సాధించగలమనే స్థయిర్యం పవన్‌కళ్యాణ్ లక్షణాలు. అదే హ్యుమనిజం,.. అదే పవనిజమ్. చాలామంది హీరోల్లా ఆయనకు అభద్రతాభావం లేదు. అలా అభద్రాతాభావం లేకుండా సరైన సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగేవారే నిజమైన హీరో. నేను ఆయన్ను కలిసి, మీ మేనల్లుడితో సినిమా చేస్తానన్నాను. పదిహేను, ఇరవై నిమిషాల కథ విని నమ్మకంతో ఈ సినిమా ఒప్పుకున్నారు’’ అన్నారు. ‘‘చిరంజీవిగారి పట్టుదల, కృషిని, నాగబాబుగారి నిదానాన్ని, నవ్వులను, కళ్యాణ్‌గారి క్రమశిక్షణ, నిబద్ధతను నేర్చుకున్నాను. వీళ్ల చేతుల మీద పెరిగాను. నేను మిమ్మల్ని నిరాశపరచను. ‘రేయ్.. షౌట్ ఫర్ సక్సెస్’ అంటూ మా కళ్యాణ్ మామయ్య నన్ను ప్రోత్సహించారు. ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన చౌదరిగారికి ఎన్నిసారు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు ’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. ‘‘నా మనవడికి నా పోలిక అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. తనకు పెద్ద మేనమామ చిరంజీవి పోలిక వచ్చింది’’ అని అంజనా దేవి అన్నారు. ఈ వేడుకలో రమేష్‌ప్రసాద్, జెమినికిరణ్, సుజనా చౌదరి, కొమ్మినేని వెంకటేశ్వరరావు, నరేష్, చక్రి, చంద్రబోస్, శ్రద్ధాదాస్, సయామీ ఖేర్ తదితరులు పాల్గొన్నారు. -
రేయ్ ట్రయల్స్ విడుదల
చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సయామీఖేర్, శ్రద్ధాదాస్ కాంబినేషన్లో బొమ్మరిల్లు పతాకంపై వైవీయస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘రేయ్’ సినిమా థియేటర్ ట్రయల్ విడుదలైంది. ఈ సినిమాలో సయామీ ఖేర్, శ్రద్ధా దాస్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ఎ టు జెడ్ లుక్‌ని హైదరాబాద్‌లో అల్లు అర్జున్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ -‘‘రామ్‌చరణ్ కోసం సిద్ధం చేసుకున్న కథ ఇది. అయితే సాయిధరమ్‌తేజ్‌లో పాత చిరంజీవిగారి లుక్ కనిపించేసరికి ‘రేయ్’ని తనతోనే చేయాలని ఫిక్స్ అయ్యాను’’ అని తెలిపారు. కుదిరితే వైవీఎస్‌తో మరో సినిమా చేయాలని ఉందని సాయిధరమ్‌తేజ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సయామీఖేర్, శ్రద్ధాదాస్, కొమ్మినేని వెంకటేశ్వరరావు, శ్రీధర్ సీపాన, గుణశేఖరన్ తదితరులు మాట్లాడారు. -
సాయిని హీరో చేద్దామని చరణ్‌తో చెప్పాను - అల్లు అర్జున్
‘‘సాయిధరమ్‌తేజ్‌కి చిన్నప్పట్నుంచీ సినిమాల పిచ్చి. తను ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడని తెలుసుకుని... హీరోని చేద్దామని రామ్‌చరణ్‌తో అంటే... ‘‘సాయి బుద్ధిగా చదువుకుంటున్నాడు. అనవసరంగా వాణ్ణి డిస్టర్బ్ చేయకు’’ అన్నాడు. కట్ చేస్తే... వైవీఎస్ చౌదరితో సాయి సినిమా అని తెలిసింది. నాకు శిరీష్ ఎంతో, సాయి కూడా అంతే’’ అని అల్లు అర్జున్ చెప్పారు. సాయిధరమ్‌తేజ్, సయామీఖేర్, శ్రద్ధాదాస్ కాంబినేషన్లో బొమ్మరిల్లు పతాకంపై వైవీయస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘రేయ్’ సినిమా ఎ టు జెడ్ లుక్‌ని హైదరాబాద్‌లో బన్నీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ -‘‘రామ్‌చరణ్ కోసం సిద్ధం చేసుకున్న కథ ఇది. అయితే సాయిధరమ్‌తేజ్‌లో పాత చిరంజీవిగారి లుక్ కనిపించేసరికి ‘రేయ్’ని తనతోనే చేయాలని ఫిక్స్ అయ్యాను’’ అని తెలిపారు. కుదిరితే వైవీఎస్‌తో మరో సినిమా చేయాలని ఉందని సాయిధరమ్‌తేజ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సయామీఖేర్, శ్రద్ధాదాస్, కొమ్మినేని వెంకటేశ్వరరావు, శ్రీధర్ సీపాన, గుణశేఖరన్ తదితరులు మాట్లాడారు. -
'రేయ్' ఆడియోకు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్
మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పరిచయం అవుతున్న 'రేయ్' చిత్ర ఆడియో కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరవ్వనున్నారు. ఈ కార్యక్రమం ఈనెల 5 తేదిన శిల్పకళావేదికలో ఆడియో రిలీజ్ కార్యక్రమం జరుగనుంది. బొమ్మరిల్లు బ్యానర్ పై నిర్మిస్తున్న 'రేయ్' చిత్రానికి వైవియస్ చౌదరీ దర్శకత్వం వహిస్తుండగా, చక్రి సంగీతాన్ని అందిస్తున్నారు. సయామీ ఖేర్, శ్రద్దా దాస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిరంజీవి నటించిన దొంగ చిత్రంలోని 'గోలిమార్.. మార్.. మార్..' అనే పాటను ఈ చిత్రం కోసం రీమిక్స్ చేశారు. -
చిరంజీవిగారితో పనిచేస్తున్న ఫీలింగ్ కలిగింది
‘‘ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా... ఓర్పుతో ఈ చిత్రాన్ని పూర్తి చేయగలిగానంటే కారణం ఇద్దరు. వారిలో ఒకరు మహానటుడు ఎన్టీఆర్ అయితే, రెండో వ్యక్తి పవన్‌కల్యాణ్’’ అని వైవీఎస్ చౌదరి అన్నారు. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రేయ్’. ఈ చిత్రం ప్రచార చిత్రాలను సోమవారం హైదరాబాద్‌లో నాగబాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వైవీఎస్ మాట్లాడుతూ -‘‘నమ్మిన సిద్ధాంతం కోసం, అంకితభావంతో మడమ తిప్పకుండా ముందుకెళ్లడం ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నాను. అలాగే, ఈ సినిమా నిర్మాణం విషయంలో ఆటుపోటులు ఎదురవుతున్నప్పుడు ‘ఏం చేయను’ అని పవన్‌కల్యాణ్‌గారిని అడిగితే ‘కమిట్మెంట్ని, కాండక్ట్‌ని నేను నమ్ముతాను. ఆ రెండూ నీలో ఉన్నాయి. నువ్వు ఈ సినిమాను పూర్తి చేయగలవ్’ అని నాలో ఆత్మసై్థర్యాన్ని నింపారు. ఈరోజు సినిమాను ఇంత గ్రాండ్‌గా పూర్తి చేయగలిగానంటే కారణం వారిద్దరే. ఇక సాయిధరమ్‌తేజ్‌తో పనిచేస్తుంటే చిరంజీవిగారితో పనిచేస్తున్న ఫీలింగ్ కలిగింది. ఫైట్లు, డాన్సులు అద్భుతంగా చేశాడు. ఇందులో శ్రద్ధ్దాదాస్ లేడీ విలన్‌గా నటించింది. యూత్‌కి మంచి కిక్ ఇచ్చే ప్రేమకథ తీయాలనుకున్నాను... తీశాను. పబ్లిసిటీ విషయంలో కొత్తగా ప్లాన్ చేశాం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఫిబ్రవరి 5న సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘చరిత్ర సృష్టించే ముందు కష్టాలు ఎదురవ్వడం సహజం. వైవీఎస్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతాడు. తన సినిమా ద్వారా మా మేనల్లుడు తెరకు పరిచయం అవ్వడం ఆనందంగా ఉంది. తనంటే నాకు, అన్నయ్యకు, తమ్ముడుకీ చాలా ఇష్టం. రషెస్ చూశాను. తన డాన్సులు, ఫైట్లు.. ముఖ్యంగా నటన ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’’ అని నాగబాబు చెప్పారు. కొత్త హీరోను పరిచయం చేస్తూ.. ఇంత భారీగా తీయాలంటే దమ్ము, ధైర్యం ఉండాలని, ఆ రెండు వైవీఎస్కు ఉన్నాయని సాయిధరమ్‌తేజ్ అన్నారు. తన మావయ్య నాగబాబు చేతులపై ప్రమోషన్ మొదలవ్వడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా శ్రద్ధాదాస్, చంద్రబోస్, చక్రి, కొమ్మినేని వెంకటేశ్వరరావు,శ్రీధర్ సీపన, గౌతంరాజు, శరత్‌మరార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గెలుపు కోసం పిలుపు
‘రేయ్..’ ఇలా అమ్మాయి పిలిచిందనుకోండీ.. రొమాంటిగ్గా ఉంటుంది. ఫ్రెండ్ పిలిస్తే.. జోష్‌గా ఉంటుంది. అదే... సినిమాల్లో విలన్ని హీరో పిలిస్తే.. ఇక థియేటర్లో ఈలలు, గోలలే. ఒక్క పిలుపులో ఎన్ని డెమైన్షన్సో కదా. అందుకే... తన సినిమాకు వైవీఎస్ చౌదరి ‘రేయ్’ అని నామకరణం చేసి ఉంటారు. ఉపశీర్షిక ‘షాట్ ఫర్ సక్సెస్’ అని పెట్టారు. కొత్తవాళ్లను వైవీఎస్ చౌదరి పరిచయం చేస్తే... ఆ సినిమా హిట్టే. ‘సీతారాములకల్యాణం చూతము రారండి’ నుంచి ఒక్కసారి ఆయన కెరీర్‌ని పరిశీలిస్తే అది నిజమని ఎవరైనా ఒప్పుకుంటారు. ఆ రకంగా ఆలోచిస్తే ‘రేయ్’ విజయం తథ్యం అనిపిస్తోంది. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. మెగా అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని సాయిధరమ్‌తేజ్ పాత్రను అత్యంత శక్తిమంతంగా వైవీఎస్ తీర్చిదిద్దారని తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి తెలిపారు. నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలైలోనే విడుదల చేయాలనుకున్నాం. కానీ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చాం. రామ్‌చరణ్ నటించిన ‘ఎవడు’ ఈ నెలలో విడుదల అనగానే... ‘రేయ్’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాం. అయితే... ‘ఎవడు’ అనుకోకుండా సంక్రాంతికి వాయిదా వేశారు. దాంతో ‘రేయ్’ చిత్రాన్ని ఫిబ్రవరి 5న విడుదల చేయడానికి ఫైనల్‌గా నిర్ణయించుకున్నాం. ఈ సినిమా ప్రారంభించినప్పట్నుంచీ ఎన్నో అవాంతరాలు. వాటన్నింటినీ అధిగమించి చిత్రాన్ని పూర్తి చేశాం’’అని వైవీఎస్ చెప్పారు. సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ ఈ చిత్ర నాయికలు. -
ఫుల్ ఎనర్జీతో...
వైవీఎస్ చౌదరి ‘రేయ్’ సినిమా తుది అంకానికి చేరుకుంది. పాటల వేడుకను భారీ ఎత్తున చేయడానికి చౌదరి ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఈ చిత్రం ద్వారా చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ల మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని సాయిధరమ్‌తేజ్ పాత్రను ఫుల్ ఎనర్జీతో చౌదరి తీర్చిదిద్దారు. ముఖ్యంగా పాటల విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చౌదరి పాటలు బాగా తీస్తారని, ఆయనకు మంచి మ్యూజిక్ సెన్స్ ఉందని ప్రతీతి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మ్యూజిక్ ఉంటుందంటున్నారు చౌదరి. ఆయన మరిన్ని వివరాలు చెబుతూ- ‘‘నా తొలి సినిమా ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండీ’ నుంచి ఇప్పటివరకూ నా సినిమాల్లో పాటలకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ‘రేయ్’ పాటలు కూడా ఫుల్ ఎనర్జీతో ఉంటాయి. ఆడియో హక్కుల్ని ఓ పెద్ద కంపెనీ తీసుకోనుంది. డిసెంబర్ మొదటివారంలో పాటల వేడుకను విభిన్నంగా చేయబోతున్నాం. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఈ వేడుకలో పాల్గొంటారు’’ అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ‘రేయ్’ సంక్రాంతికి విడుదల కానుంది. సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ నాయికలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, సాహిత్యం: చంద్రబోస్. -
దేవదాసు, దేశముదురు తరహాలో...
పోలికలు చూస్తే... పెద్ద మేనమామ చిరంజీవివి. స్టిల్స్‌లో కనిపిస్తున్న ఫైర్ చూస్తే.. చిన్న మేనమామ పవన్‌కల్యాణ్‌ది. ఓవరాల్‌గా స్టార్ హీరోకి కావాల్సినంత సరంజామానంతా మూటకట్టుకొని తెరమీదకొచ్చేస్తున్న మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ఆయన్ను హీరోగా పరిచయం చేస్తూ బొమ్మరిల్లువారి పతాకంపై వైవీయస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రేయ్’. చిత్రీకరణ పూర్తి చేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయనున్నారు. వైవీయస్ చౌదరి మాట్లాడుతూ -‘‘ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్ మరియు ఫాస్ట్ ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. చక్కగా ఆకట్టుకుంటున్నాయి కూడా. కానీ ‘దేవదాసు’, ‘దేశముదురు’ తరహాలో భారీస్థాయి మాస్ యూత్ లవ్‌స్టోరీలు రావడం లేదు. ఆ లోటుని తీర్చే విధంగా, అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ‘రేయ్’ ఉంటుంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్ధం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలోనూ, ద్వితీయార్ధం అమెరికా సంస్కృతి నేపథ్యంలోనూ ఉంటుంది. ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండీస్‌లలో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం చిత్రీకరణ జరిపాం. మొదటి సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడన్న నమ్మకం నాకుంది. అలాగే సయ్యామి ఖేర్ తన బ్యూటిఫుల్ ప్రెజెన్స్‌తో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందనడంలో నాకెటువంటి సందేహం లేదు. వాళ్లతోపాటు నరేష్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, తనికెళ్ళ భరణి, వేణుమాధవ్, రఘుబాబు, హేమలాంటి హేమాహేమీలంతా పోటా పోటీగా నవ్వులు పండించారు. ఇక పాటలైతే సందర్భోచితంగా నాదైన గ్రాండియర్ శైలిలో ఆకట్టుకుంటాయి’’ అని తెలిపారు. -
మోస్ట్ పవర్ఫుల్ చిత్రం ‘రేయ్’
‘‘‘రేయ్’ టైటిల్లో ఓ ఫోర్స్ ఉంది. ఓ పవర్ ఉంది. ఈ సినిమా కథతో పాటు హీరో పాత్ర చిత్రణ కూడా అంతే ఫోర్స్‌గా, మోస్ట్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది’’ అంటున్నారు వైవీఎస్ చౌదరి. బొమ్మరిల్లు వారి పతాకంపై ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రేయ్’. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా పరిచయమవుతున్నారు. సయామిఖేర్, శ్రద్ధాదాస్ ఇందులో హీరోయిన్లు. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వైవీయస్ చౌదరి మాట్లాడుతూ -‘‘అక్టోబర్ 11న దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం.ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. అయితే... మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా మూడు సినిమాలు విడుదల కాబోతుండటంతో, మేం దసరాకు విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ‘దేవదాసు’ తరహాలోనే చక్రి, నేను, చంద్రబోస్ కలిసి పనిచేసిన ‘రేయ్’ పాటలు కూడా అంతకు మించి సంచలనం సృష్టిస్తాయని నమ్ముతున్నాం. త్వరలోనే మెగా బ్రదర్స్ సమక్షంలో ఈ పాటలను విడుదల చేస్తాం. సాయిధరమ్‌తేజ్‌ని కచ్చితంగా స్టార్‌హీరోల్లో ఒకరిగా తనను నిలబెట్టే సినిమా ఇది’’ అన్నారు.