విమర్శలా నాకేం తెలియదు: సాయి ధరంతేజ్ | Hero sai dharamtej visits Tirumala | Sakshi
Sakshi News home page

విమర్శలా నాకేం తెలియదు: సాయి ధరంతేజ్

Published Fri, Dec 5 2014 9:53 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM

విమర్శలా నాకేం తెలియదు: సాయి ధరంతేజ్

విమర్శలా నాకేం తెలియదు: సాయి ధరంతేజ్

తిరుమల : సినీనటుడు సాయి ధరంతేజ్ శుక్రవారం తిరుమల విచ్చేశాడు. ఈరోజు తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శనంలో అతను వెంకన్న దర్శనం చేసుకున్నాడు. దర్శనం అనంతరం సాయి ధరంతేజ మీడియాతో మాట్లాడుతూ త్వరలో దిల్ రాజు బ్యానర్లో హరీష్ శంకర్ దర్శకత్వం వస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పాడు. అలాగే 'రేయ్' చిత్రంపై ఆ చిత్ర నిర్మాత వైవీఎస్ చౌదరే స్వయంగా ప్రకటన చేస్తారని తెలిపాడు.

కాగా 'మేము సైతం' కార్యక్రమంపై దర్శక, నిర్మాత తమ్మారెడ్డి వ్యాఖ్యలపై తనకేమీ తెలియదని...విలేకర్లు అడిగిన ప్రశ్నకు సాయి ధరంతేజ్ సమాధానమిచ్చాడు. మంచి విషయం కోసం ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని...అయితే విమర్శలు గురించి తనకు తెలియదని, వాటిని పట్టించుకోనని తెలిపాడు. తాను కూడా మేము సైతం కార్యక్రమంలో డాన్స్ ఫెర్మామెన్స్ ఇచ్చినట్లు చెప్పాడు. ఈ సందర్భంగా సాయి ధరంతేజ్తో ఫోటోలు దిగేందుకు, షేక్హ్యాండ్ ఇచ్చేందుకు పలువురు పోటీ పడ్డారు. సాయి ధరంతేజ్  హీరోగా నటించిన 'పిల్ల నువ్వేలేని జీవితం' సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement