Memu Saitham
-
సీఎం జగన్ బస్సుయాత్ర హైలైట్స్
-
బుల్లితెరకు విశాల్!
పెద్ద పెద్ద హీరోలంతా... చిన్న తెరలపై కనిపించేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, కమల్ హాసన్, మోహన్ లాల్, సూర్య లాంటి హీరోలు బుల్లితెరపై కనిపించి అభిమానులను సంతోషపరిచారు. మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్‌బాస్ లాంటి షోలతో పెద్ద హీరోలు బుల్లితెరపై హంగామా చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి విశాల్ కూడా జాయిన్ అవ్వబోతున్నాడు. నడిగర్ సంఘం కార్యదర్శిగా, నిర్మాతగా, నటుడిగా బిజీగా ఉన్న విశాల్.. తాజాగా ఓ షోతో బుల్లితెరను పలకరించబోతున్నారు. తెలుగులో పాపులర్ అయిన ‘మేము సైతం’ కార్యక్రమంలాంటి షోను తమిళ్లో విశాల్ హోస్ట్ చేయబోతోన్నాడు. సెలబ్రెటీలు సామాన్యులుగా మారి సంపాదించే డబ్బును చారిటీలకు ఇచ్చేలా షోను డిజైన్ చేయబోతున్నారు నిర్వాహకులు. సన్ టీవీలో ప్రసారం కానున్న ఈ షో త్వరలోనే ప్రారంభంకానుంది. A unique show hosted by @VishalKOfficial. Coming soon on @SunTV ! pic.twitter.com/uWb1djXVoM — Sun TV (@SunTV) 18 September 2018 -
మజ్జిగ అమ్ముతున్న ‘చిట్టిబాబు’..?
సాక్షి, హైదరాబాద్ : గ్లాసు మజ్జిగ మహా అయితే ఎంత ఉంటుంది రూ.10 లేదా రూ.20 మరీ ఏ స్టార్ హోటల్లోనే అయితే ఓ వంద రూపాయలు ఉంటుంది. అంతే కానీ ఓ గ్లాసు మజ్జిగ కోసం వేల రూపాయలు ఖర్చుపెట్టే వారిని ఎక్కడా చూసి ఉండకపోవచ్చు. ఒక్క మజ్జిగనే కాదు ఐస్‌క్రీమ్, సోడా ఖరీదు కూడా దాదాపు ఇంతే. అయినా జనాలు ఎగబడి మరి కొన్నారు. ఏంటాబ్బ వాటి ప్రత్యేకత అని ఆలోచిస్తున్నారా...! ఇక్కడ మజ్జిగ, సోడా వీటికి పెద్ద ప్రత్యేకత ఏమి లేదు కాని వాటిని అమ్మే వ్యక్తి మాత్రం చాలా ప్రత్యేకం. ఆయనే మెగా ‘పవర్ స్టార్ రామ్ చరణ్’. రామ్ చరణ్ మజ్జిగ అమ్ముతున్నాడంటే అదేదో షూటింగ్ కోసం అనుకుంటే పొరబడినట్లే. ఓ 60 మంది చిన్నారులను ఆదుకోవడానికి రామ్ చరణ్ ఇలా మజ్జిగ అమ్మే వ్యక్తిగా మారారు. ఇదంతా కూడా ఓ ప్రముఖ తెలుగు టీవీ చానల్లో ప్రసారమవుతున్న లక్ష్మీ మంచు ‘మేము సైతం’ కార్యక్రమం కోసం. లక్ష్మీ మంచు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం ద్వారా నిస్సహాయులకు చేయుతనివ్వడం కోసం టాలీవుడ్ తారలు మేముసైతం అంటూ ముందుకు వస్తున్నారు. ఆపన్నులను ఆదుకోవడం కోసం సామాన్యులుగా మారి ఓ రోజంతా కష్టపడి పని చేసి వారి కోసం డబ్బు సంపాదిస్తున్నారు. మేము సైతం మొదటి సీజన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో రెండో సీజన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం మొదటి సీజన్లో డా. మోహన్ బాబు, అలీ, రానా, రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ఇంకా అనేక మంది తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రసారమవుతున్న రెండో సీజన్లో ఇప్పటి వరకూ జయప్రద, నివేదా థామస్, కీర్తి సురేష్‌లు పాల్గొన్నారు. ప్రస్తుతం వీరి లిస్టులోకి రామ్ చరణ్ కూడా చేరారు. 60 మంది చిన్నారులకు ఆశ్రయం ఇస్తున్న ఓ శరణాలయాన్ని ఆదుకోవడానికి ‘చిట్టిబాబు’ ఇలా మజ్జిగ అమ్మే వ్యక్తి అవతారం ఎత్తారు. ఈ విషయం గురించి లక్ష్మీ మంచు ‘నా ప్రియ స్నేహితుడు రామ్‌చరణ్‌కు కృతజ్ఞతలు. 60మంది చిన్నారులను ఆదుకోవడానికి ‘మేము సైతం’ కార్యక్రమానికి వచ్చింనందుకు ధన్యవాదాలు. ఈ సీజన్లో ఇది బెస్ట్ ఎపిసోడ్ అవుతుంది. దీన్ని వీక్షించేందుకు ప్రేక్షకులతో పాటు నేను చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నాం.’ అంటూ తన ట్విటర్లో పోస్టు చేశారు. -
కూలీగా మారిన టాలీవుడ్ హీరో
హైదరాబాద్ : టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పోర్టర్ అవతారం ఎత్తాడు. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో మూటలు మోశాడు. హీరో ఏంటి కూలీగా పని చేయటమేంటనుకున్నారా? అసలు విషయానికి వస్తే తన సోదరి మంచు లక్ష్మీప్రసన్న నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమం కోసం అతడు కూలీగా మారాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం మంచు మనోజ్ బరువులు మోశాడు. ఈ సందర్భంగా సంపాదించిన డబ్బులను మేము సైతం కార్యక్రమానికి విరాళంగా ఇచ్చాడు. మరోవైపు మంచు మనోజ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అతడితో సెల్పీలు దిగేందుకు పోటీలు పడ్డారు. కాగా ఇప్పటికే పలువురు సినీ నటీనటులు మేము సైతం కార్యక్రమం కోసం కూరగాయలు అమ్మడం మొదలు పానీపూరి, కారు సర్వీసింగ్, బేకరీలో పని చేసిన విషయం తెలిసిందే. -
పానీపూరీ అమ్మిన హీరో..
-
పానీపూరీ అమ్మిన హీరో మంచు విష్ణు
హైదరాబాద్ : హీరో మంచు విష్ణు శుక్రవారం కూకట్‌పల్లిలో పానీపూరీ అమ్మాడు. విష్ణు ఏంటీ పానీపూరీ అమ్మడం ఏంటానుకుంటున్నారా?. అసలు విషయానికి వస్తే విష్ణు సోదరి లక్ష్మి ప్రసన్న నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమం కోసం విష్ణు పానీపూరీ అమ్మాల్సి వచ్చింది. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులను ‘మేము సైతం’ ద్వారా నిర్వహించనున్న సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. కాగా గతంలో ‘మేము సైతం’ కార్యక్రమానికి సహాయం నిమిత్తం సినీ నటులు శ్రియ, రకుల్ ప్రీతి సింగ్, రెజీనా, దగ్గుబాటి రానా, మోహన్ బాబు, అఖిల్ అక్కినేని, నానీ, రవితేజ, యాంకర్ సుమ తదితరులు తమ వంతు సాయం చేసిన విషయం తెలిసిందే. -
మంచు లక్ష్మి 'మేముసైతం'
-
ఇడ్లీలమ్మిన మోహన్ బాబు
టాలీవుడ్లో మోనార్క్‌గా పేరున్న మోహన్ బాబు.. రోడ్డు పక్కన ఇడ్లీలమ్ముతూ కనిపించారు. 500 పైగా సినిమాల్లో నటించిన స్టార్, భారీ వ్యాపారసంస్థలు, విద్యాసంస్థలు ఉన్న మోహన్ బాబు ఇడ్లీలమ్మటం ఏంటి అనుకుంటున్నారా..? తన కూతురు మంచు లక్ష్మీప్రసన్న నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమం కోసం ఈ పని చేశారు కలెక్షన్ కింగ్. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఎదురుగా రోడ్డుమీద ఇడ్లీలు అమ్మి, అలా వచ్చిన సొమ్మును మంచు లక్ష్మి నిర్వహిస్తున్న కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఓ ప్రైవేట్ ఛానల్లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే చాలామంది స్టార్స్ తమవంతు సాయం అందించారు. రకుల్ ప్రీత్ సింగ్ మార్కెట్లో కూరగాయలు అమ్మగా, రానా కూలీ అవతారం ఎత్తాడు. అక్కినేని నటవారసుడు అఖిల్ ఆటో నడిపాడు. సీనియర్ హీరోయిన్ శ్రియ సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్‌గా పనిచేసింది. తాజాగా మోహన్ బాబు ఇడ్లీలు అమ్మి తన కూతురికి సాయం చేశారు. భవిష్యత్తులో మరింత మంది స్టార్స్‌తో ఈ తరహా పనులు చేయించాలని భావిస్తున్నారు కార్యక్రమ నిర్వాహకులు. "MEEMU SAITHAM" by Dr.M.Mohan Babu started. Boney by Vidyanikethan Faculty Mr.&Mrs.Damodaram pic.twitter.com/8gag9RqbcP — Sree Vidyanikethan (@IVidyanikethan) March 24, 2016 -
టమాటే.. ఆలూయే.. గోబీయె!
కూరగాయలు అమ్మడం చిన్న విషయం కాదు. టమాటే.. ఆలూయే.. గోబీయె.. అంటూ కొనుగోలుదారుల దృష్టిని ఆకట్టుకోవడం కోసం పెట్టే కేకలకు చాలా ఎనర్జీ ఉండాలి. ఇది అలవాటు లేని పనే అయినా రకుల్ ప్రీత్‌సింగ్ చాలా ఓపికగా, ఎనర్జిటిక్‌గా కూరగాయలు అమ్మేశారు. దీనికో కారణం ఉంది. ఓ ప్రముఖ టీవీ చానల్ ‘మేము సైతం’ పేరుతో ఓ షో చేయనుంది. దీనికి మంచు లక్ష్మీప్రసన్న హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ షోలో భాగంగా హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ మాల్ ఎదురుగా రకుల్ ప్రీత్ కూరగాయలు అమ్మారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘‘లక్ష్మీ మంచు షో కోసం కూరగాయలు అమ్మబోతున్నా. అందరూ వచ్చి కూరలు కొనుక్కోవచ్చు’’ అని ముందుగానే రకుల్ ప్రకటించారు. ఈ బ్యూటీ కూరగాయలు అమ్మడాన్ని కొంతమంది విచిత్రంగా చూస్తే, కుర్రకారు మాత్రం మురిపెంగా చూశారు. -
అన్నింటా ఆమె
మేము సైతం అంటూ నారీలోకం నడుం బిగిస్తోంది. కొలువు ఏదైనా సరే తాము ఎవరికీ తీసిపోమంటూ అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్వయంకృషి.. పట్టుదలతో విజయ పథంలో పయనిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం అన్న సినీకవి మాటలను నిజం చేసి చూపిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో తమకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని పురోగమిస్తున్నారు. విద్యావనంలో..వికసించిన వాసంతి వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో వికసించిన విద్యాకుసుమం ఆచార్య టి. వాసంతి. కడప నగరానికి చెందిన ఈమె వైవీయూ మొట్టమొదటి మహిళా ప్రిన్సిపాల్‌గా పనిచేయడంతో పాటు మొట్టమొదటి మహిళా రిజిస్ట్రార్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నగరంలోని సీఎస్ఐ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్య, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, ప్రభుత్వ పురుషుల కళాశాలలో డిగ్రీ పూర్తిచేసిన ఈమె అన్నింటా అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చారు. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాయలంలో పీజీ గణితం పూర్తిచేసిన ఈమె 1990లోనే పీహెచ్డీ పట్టాను పొందారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సైతం బోధనా సేవలందించిన ఈమె వైవీయూలో గణితశాస్త్ర విభాగాధిపతిగాను, సీడీసీ డీన్‌తో పాటు పలు కమిటీలకు అధ్యక్షత వహించారు. దీంతో పాట 2010లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే మెరిటోరియస్ టీచర్ అవార్డు పొందారు. సమాన అవకాశాలు కల్పించాలి.. సమాజంలో మహిళా సాధికారత అవసరం. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. మహిళా కూలీలో సైతం ఉన్న వివక్ష వీడాలి. మహిళలు పట్టుదలతో కృషిచేసి అనుకున్న గమ్యస్థానాన్ని చేరుకోవాలి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. - ఆచార్య టి. వాసంతి, రిజిస్ట్రార్, యోగివేమన విశ్వవిద్యాలయం అమ్మలా ఆదరిస్తూ.... ఆదర్శం ఐఈఆర్టీ యశోద సేవలు వేంపల్లె : వేంపల్లె భవిత సెంటర్ (ప్రత్యేక అవసరాల గల కేం ద్రం)లో బుద్ధిమాంద్యం గల పిల్లలను వారి తల్లిదండ్రులు వదిలేసి వెళతారు. అలాంటి వారికి ఈ సెంట ర్లో ఐఈఆర్టీ(ఇన్‌ప్యూటివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్)గా పనిచేస్తున్న యశోద సేవలందిస్తోంది. భర్త సహకారంతోనే సేవలు ఐఈఆర్టీగా పనిచేస్తున్న యశోదకు 5 ఏళ్ల వయస్సులోనే పోలియో వచ్చింది. వేంపల్లె భవిత సెంటర్‌కు వారు ఉన్న నివాస ప్రాంతానికి దాదాపు ఒకటిన్నర్ర కిలోమీటరు దూరం ఉంది. ప్రతిరోజు ఆమె భర్త రమేష్ మోటారు బైకుపై ఎక్కించుకొని వదిలిపెట్టడం జరుగుతోంది. భర్త రమేష్ సహకారంతోనే ప్రత్యేక అవసరాల గల పిల్లలకు సేవలు చేస్తున్నానని ఆమె తెలిపారు. వివిధ రకాల బొమ్మలతో పిల్లలకు అవగాహన కల్పించడం.. నెంబరింగ్, రైమ్స్, రంగులు వేయడం.. వివిధ రకాల బొమ్మలతో ఆటలు ఆడిపించడం.. మధ్యాహ్న భోజన సమయంలోఅక్కడే ఉండి పిల్లలకు తినిపించడం.. విద్యార్థులు శుభ్రంగా ఉండటానికి తాము పడే పాట్లు అన్నీ ఇన్నీ కావని యశోద అంటోంది. ఈమె సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. -
విమర్శలా నాకేం తెలియదు: సాయి ధరంతేజ్
తిరుమల : సినీనటుడు సాయి ధరంతేజ్ శుక్రవారం తిరుమల విచ్చేశాడు. ఈరోజు తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శనంలో అతను వెంకన్న దర్శనం చేసుకున్నాడు. దర్శనం అనంతరం సాయి ధరంతేజ మీడియాతో మాట్లాడుతూ త్వరలో దిల్ రాజు బ్యానర్లో హరీష్ శంకర్ దర్శకత్వం వస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పాడు. అలాగే 'రేయ్' చిత్రంపై ఆ చిత్ర నిర్మాత వైవీఎస్ చౌదరే స్వయంగా ప్రకటన చేస్తారని తెలిపాడు. కాగా 'మేము సైతం' కార్యక్రమంపై దర్శక, నిర్మాత తమ్మారెడ్డి వ్యాఖ్యలపై తనకేమీ తెలియదని...విలేకర్లు అడిగిన ప్రశ్నకు సాయి ధరంతేజ్ సమాధానమిచ్చాడు. మంచి విషయం కోసం ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని...అయితే విమర్శలు గురించి తనకు తెలియదని, వాటిని పట్టించుకోనని తెలిపాడు. తాను కూడా మేము సైతం కార్యక్రమంలో డాన్స్ ఫెర్మామెన్స్ ఇచ్చినట్లు చెప్పాడు. ఈ సందర్భంగా సాయి ధరంతేజ్తో ఫోటోలు దిగేందుకు, షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు పలువురు పోటీ పడ్డారు. సాయి ధరంతేజ్ హీరోగా నటించిన 'పిల్ల నువ్వేలేని జీవితం' సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. -
పన్నెండు గంటలకు... 11 కోట్లేనా?
‘‘హుద్‌హుద్ బాధితులను ఆదుకోవడం కోసం గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కేవలం రెండు గంటల పాటు చిత్తూరులో ఓ కార్యక్రమం చేస్తే... కోటి రూపాయలు సమకూరాయి. అలాంటిది... యావత్ చిత్ర పరిశ్రమ ఒకటిగా నిలిచి పన్నెండు గంటల పాటు ఓ కార్యక్రమం చేస్తే ఎంత పోగవ్వాలి? కానీ, కేవలం 11 కోట్లు మాత్రమే సమకూరింది. ఇందుకు కారణం ముందస్తు ప్రణాళిక, కట్టడి లేకపోవడమే’’ అని సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడి భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. గత ఆదివారం జరిగిన ‘మేము సైతం’ కార్యక్రమంలో డాన్స్ ఈవెంట్స్ అన్నీ తమ్మారెడ్డి భరద్వాజ్ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఈ కార్యక్రమంలో చెన్నయ్ డాన్సర్లతో నిమిత్తం లేకుండా కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి కారకులైన స్థానిక కొరియో గ్రాఫర్లనూ, డాన్సర్లను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘‘స్టార్ హీరోలు హాజరైన ‘మేము సైతం’ కార్యక్రమానికి అరాకొరా సినిమాలు చేసే చిన్న హీరోలు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని భరద్వాజ్ ఆవేదన వెలిబుచ్చారు. హీరోయిన్లయితే.. విందు వినోదాలుంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలకు హాజరవ్వరనీ, ఆ మాట స్వయంగా వారే అన్న సందర్భాలూ ఉన్నాయనీ భరద్వాజ్ గుర్తు చేసుకున్నారు. -
తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'గతంలో మన హీరోలు మగాళ్లు కారు.. హీరోలకు దమ్ములేదంటూ' వ్యాఖ్యానించిన ఆయన తాజాగా... ఫిలింపేర్ కోసం ఎగేసుకుని వెళ్లే ఆర్టిస్టులు ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల కార్యక్రమాలకు మాత్రం రావటం లేదని అన్నారు. చిత్తూరులో గాయకుడు బాలసుబ్రమణ్యం ఒక్కరే గంట ప్రోగ్రామ్ చేస్తే రూ.కోటి వచ్చిందని...ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కలిసి 'మేము సైతం' కార్యక్రమం చేసినా రూ.8 కోట్లు కూడా రాలేదని తమ్మారెడ్డి భరద్వాజ వాపోయారు. ఇటువంటి కార్యక్రమాలకు హీరోలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి... కానీ బతిమిలాడుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం చిత్ర పరిశ్రమ పెద్దలు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలిశారని.. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని తమ్మారెడ్డి పేర్కొన్నారు. -
బాలయ్య, నాగ్ల మధ్య ఏం జరిగింది?
'మేము సైతం' కార్యక్రమంలో నటుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తెలుగు చిత్రసీమలో అగ్ర నటులుగా ఉన్న బాలకృష్ణ, నాగార్జునలు... ఒకరినొకరు పలకరించుకోవటానికి కూడా ఇష్టపడటం లేదట. హుద్ హుద్ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు చలన చిత్ర పరిశ్రమ మేము సైతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏదైనా కార్యక్రమం కానీ, వేడుకలో ఎదురైనప్పుడు ఇద్దరు వ్యక్తులు పలకరించుకోవటం కనీస సంప్రదాయం. అయితే బాలయ్య, నాగ్ మాత్రం పలకరించుకోవటం కాదు కదా... కనీసం ఒకరినొకరు చూసుకోవటం కూడా జరగలేదు. చిత్రసీమ మొత్తం కలిసి మెలిసి పలు కార్యక్రమాలు నిర్వహించినా వారిద్దరూ మాత్రం ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు. గత ఏడాదిగా వీరిద్దరి మధ్య సైలెంట్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా,అక్కినేని నాగేశ్వరరావు నట రజితోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఘన సన్మాన సభకు బాలయ్యకు ఆహ్వానం అందలేదు. అక్కినేనితో కలిసి నటించిన అలనాటి హీరోయిన్లతో పాటు మొత్తం సినీ పరిశ్రమ ఆ సభకు తరలి వచ్చింది. అయితే ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఆ వేదికపై కనపడలేదు.ఆ తర్వాత రోజే నాగార్జున ...బాలయ్య ఇంటికి వెళ్లి జరిగిన పొరపాటును సరిచేసేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు అంతిమయాత్రకు కూడా బాలయ్య హాజరు కాలేదు. అప్పట్లో ఆ విషయం హాట్ టాఫిక్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందనేది వారిద్దరికే తెలియాలి మరి... -
పన్నెండు గంటలు...సందడే సందడి..
-
'చాలా ఏళ్ల తర్వాత మనసారా నవ్వుకున్నా'
హైదరాబాద్: మేము సైతం కార్యక్రమం ద్వారా సేకరించిన ప్రతి పైసా హుద్ హుద్ తుపాను బాధితులకు వినియోగిస్తామని సినీ నటుడు చిరంజీవి చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయపడేందుకు తమ బాధ్యతగా ముందుకు వచ్చామని అన్నారు. ప్రజలకు ఇలాంటి కష్టాలు రాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆదివారం రాత్రి 'మేము సైతం' ముగింపు కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడారు. తెలుగు సినీపరిశ్రమ మరిచిపోలేని రోజు ఇదని పేర్కొన్నారు. 'మేము సైతం' యజ్ఞంలా నిర్వహించారని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తెర వెనుక, తెర ముందు ఎంతో మంది అలుపెరగకుండా అహర్నిశలు కృషి చేశారని వెల్లడించారు. చిత్రపరిశ్రమకు చెందిన వారంతా ఒకచోటికి చేరి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం ఆషామాషీ విషయం కాదన్నారు. 'మేము సైతం' కార్యక్రమాన్ని ఎంతో ఆస్వాదించామన్నారు. చాలా సంవత్సరాల తర్వాత మనసారా నవ్వుకున్న సందర్భమిది అని చిరంజీవి వ్యాఖ్యానించారు. సినిమా పరిశ్రమలోని ప్రతిఒక్కరూ స్పందించి ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించారని ప్రశంసించారు. ఇందులో పాలుపంచుకున్న వారిని, తమకు మద్దతు తెలిపిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
పన్నెండు గంటలు...సందడే సందడి..
ఉత్తరాంధ్రను వణికించిన హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ చేపట్టిన ‘మేము సైతం’ కార్యక్రమం ఆదివారం నాడు పన్నెండు గంటల పాటు జరిగింది. * ఉదయం 10 గంటలు దాటిన తరువాత అన్నపూర్ణా స్టూడియోలో కేవలం ప్రత్యేక ఆహ్వానితుల మధ్య ప్రారంభమైన ‘మేము సైతం’ కార్యక్రమం రాత్రి 10 గంటల వరకు సాగింది. కోటి స్వరాలు కూర్చగా, అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించిన ప్రత్యేక గీతం ‘మేము సైతం ఓ విశాఖ వాసులారా... ’ ఆలాపనతో కార్యక్రమం మొదలైంది. సీనియర్ సినీ నేపథ్య గాయని పి. సుశీల, తదితరులు కలసి ఈ గీతాన్ని ఆలపించారు. దర్శకుడు దాసరి నారాయణరావు, నటుడు మోహన్‌బాబు, బాలకృష్ణ మాట్లాడారు. ‘‘సినిమా వాళ్ళందరూ కలసి 10 కోట్ల దాకా ఇచ్చేయవచ్చు కదా అని అనవచ్చు. కానీ, బాధితులకు అండగా నిలిచి, ప్రతి ఒక్కరూ తమకు చేతనైన ఆర్థిక సాయం అందించాలన్న స్ఫూర్తి ప్రజల్లో కలిగించడా నికే ఈ కార్యక్రమం’’ అని దాసరి అన్నారు. * ‘వందేమాతర’ గీతానికీ, ‘మనం’ చిత్రంలోని ‘చిన్ని చిన్ని ఆశలు నాలో..’ పాటకు శ్రీయ డాన్స్ ఆకట్టుకుంది. * నందమూరి బాలకృష్ణ ఎవరూ ఊహించని విధంగా ఈ కార్యక్రమంలో గాయకుడిగా అవతారమెత్తారు. గాయని కౌసల్యతో కలిసి ఆయన ‘చలాకీ చూపులతో...’ పాట పాడారు. ఆ తర్వాత కొంతసేపటికి మళ్లీ వేదికపైకి వచ్చి మాళవికతో కలిసి ‘నీ కంటి చూపుల్లోన...’ పాట పాడారు. ఈ పాటలు పాడుతున్నప్పుడు బాలకృష్ణ మైక్‌ని సునాయసంగా గాల్లోకి ఎగరేసి, స్టయిల్‌కి పట్టుకోవడం, చిన్ని చిన్ని స్టెప్స్ వేయడం వీక్షకులను అలరించింది. ఈ రెండు పాటలే కాక, ఆ తర్వాత ఓ స్కిట్ కూడా చేసి, కార్యక్రమానికి నిండుదనం తీసుకు వచ్చారు. * బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్ అడపా దడపా తమదైన శైలిలో నవ్వించారు. * గాయకుడు బాబా సెహగల్ ‘గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్..’ పాట పాడి అందరిలో జోష్ నింపారు. ఈ పాట ముగింపులో పలువురు దర్శక, నిర్మాతలు వేదికపైకి వచ్చి డాన్స్ చేయడం విశేషం. స్టెప్పులేసినవాళ్లల్లో రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, డి. సురేష్‌బాబు, ఎన్వీ ప్రసాద్, కేయల్ నారాయణ తదితరులు ఉన్నారు. * మణిశర్మ, కోటి, వందేమాతరం శ్రీనివాస్, మనో, రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్, అనూప్ రూబెన్స్, సునీత, శ్రీలేఖ తదితర సంగీతదర్శకులు, గాయనీ గాయకులు పాడిన పాటలు ఓ రిలాక్సేషన్. * డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్‌తో కలిసి ఇషా చావ్లా చేసిన డాన్స్ హృదయాన్ని హత్తుకుంది. పాట చివర్లో ‘ఈసారి సాయం మాకు కాదు.. హుద్‌హుద్ బాధితులకు చేయండి’ అని వారిలోని ఒక బాలుడు అనడం ఆహూతులను కదిలించింది. * ‘మేము సైతం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు.. దక్షిణాదికి చెందిన ఇతర భాషల సినీ ప్రముఖులు కూడా విచ్చేస్తారని పేర్కొన్నారు. కానీ, వారెవరూ రాకపోవడం గమనార్హం. * మీడియాకు సైతం ప్రవేశం లేకుండా కేవలం టికెట్ కొన్నవారికే పరిమితం కావడంతో పత్రికలవారికి సమాచార సేకరణ ఇబ్బందిగా మారింది. పత్రికలకు ఫొటోలు, సమాచారం అందించే విషయంలో నిర్దుష్టమైన ప్రణాళిక, వ్యవస్థ కొరవడ్డాయి. దాదాపు 12 గంటల పాటు టీవీలో లైవ్ టెలికాస్ట్ అని ప్రకటించినప్పటికీ, ముందుగానే రికార్డు చేసిన కార్యక్రమాలను వేదిక వద్ద ప్రదర్శిస్తూ, వాటినే ‘ప్రత్యక్ష ప్రసారం’గా టీవీలో చూపారు. * మధ్యాహ్నం దాటాక కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియమ్ వేదికగా తారల మధ్య సరదా ఆటల పోటీలు జరిగాయి. మంచు విష్ణు, మనోజ్‌లు రెండు కబడ్డీ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఈ పోటీలో బ్రహ్మానందం పాల్గొనడం ఓ ఆకర్షణ. ఈ పోటీలో మంచు మనోజ్ జట్టు విజేతగా నిలిచింది. * ఇక ఎన్టీఆర్, నాగార్జున కెప్లెన్లుగా రెండు జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో నాగార్జున జట్టు గెలిచింది. ఈ మ్యాచ్‌లో నాగశౌర్య వరుసగా మూడు సిక్సర్లు కొట్టి, స్టేడియమ్లో సందడి రేపారు. * అలాగే, వెంకటేశ్, రామ్‌చరణ్ కెప్టెన్లుగా జరిగిన మ్యాచ్‌లో వెంకీ టీమ్ గెలిచింది. రామ్‌చరణ్ మూడు క్యాచ్‌లు పట్టారు. * నాకౌట్ దశలో విజయం సాధించిన రెండు జట్లతో ఫైనల్ మ్యాచ్ జరిగింది. వెంకటేశ్, నాగార్జున జట్లు పోటాపోటీగా ఆడిన నేపథ్యంలో గెలుపు నాగ్ టీమ్‌దే అయ్యింది. * ఆరు ఓవర్లకే పరిమితమైన ఈ మ్యాచ్‌లను టెన్నిస్ బంతితో ఆడారు. * మరోపక్క సాయంత్రం వేళ మళ్ళీ అన్నపూర్ణా స్టూడియోలో తారల సందడి సాగింది. ‘బాహుబలి’ బృందం వంటకం చేయడాన్ని రికార్డు చేసి, ప్రదర్శించారు. * హుద్ హుద్ తుఫాను సమయంలో కొంతమంది ప్రాణాలను కాపాడిన, సమాచార వ్యవస్థను సరి చేయడానికి పాటుపడిన కొంతమంది వ్యక్తులను ‘రియల్ హీరోస్’ పేరుతో నాగార్జున పరిచయం చేశారు. * తుషాను బాధితుల కోసం ప్రత్యేకంగా తయారు చేయించి, ఆ పాటలో అక్కినేని కుటుంబ సభ్యులు మొత్తం నటించడం విశేషం. * సాయంత్రం వేళ సందడిలో చక్రి, దేవిశ్రీ ప్రసాద్, తమన్‌లు పాటలతో అలరించారు. తమన్ ఆధ్వర్యంలో జరిగిన మ్యూజికల్ షోలో రవితేజ కొన్ని పాటలు పాడి, నర్తించారు. దేవిశ్రీ ప్రసాద్ ‘శంకర్‌దాదా జిందాబాద్...’ గీతానికి చిరంజీవి చాలా హుషారుగా స్టెప్పులు వేయడం ప్రత్యేక ఆకర్షణ అయింది. గాయకుడు మనో సారథ్యంలో సినీ నటులు పాల్గొన్న ‘అంత్యాక్షరి’ ఉత్సాహంగా సాగింది. ముఖ్యంగా చిరంజీవి, వెంకటేశ్, రాజశేఖర్, అలీ, జయప్రద తదితరులు చాలా హుషారుగా పాటలు పాడారు. * ఈ కార్యక్రమంలో మరో హైలైట్ హీరో మహేష్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను హీరోయిన్ సమంత ఇంటర్వ్యూ చేయడం. అసలు ఇద్దరు స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్‌బాబులతో మీకెలా స్నేహం కుదిరింది? అని త్రివిక్రమ్‌ని సమంత అడిగితే - ‘‘ఇద్దరికీ ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఇద్దరూ నిరాడంబరంగా ఉంటారు. మహేశ్ వార్డ్ రోబ్‌లో రెండు ప్యాంట్లు, రెండు చొక్కాలు మినహా ఉండవు. ఎంత పెద్ద కారు, ఎంత ఖరీదు గల కారులో వెళ్లాలా అని ఆలోచించడు. ఉండటానికి చిన్న ఇల్లు, చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు ఉండే చాలని మహేశ్ అనుకుంటాడు. పవన్ కల్యాణ్ కూడా చాలా సింపుల్‌గా ఉంటారు. తన దగ్గరా రెండు ప్యాంట్లు, రెండు చొక్కాలే ఉంటాయి. ఖరీదు గల కారుల్లో తిరగాలని ఆయన అనుకోరు. చుట్టూ చెట్లు, చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు ఉంటే చాలని కోరుకునే వ్యక్తి. ఇలా ఇద్దరి మనస్తత్వాలు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టే, ఇద్దరితోనూ నాకు మంచి స్నేహం కుదిరింది’’ అని చెప్పారు. -
ఫైనల్లో నాగార్జున టీం విజయం
హైదరాబాద్:'మేము సైతం'కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్ర కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరిగిన ఫైనల్లో నాగార్జున టీం(అఖిల్ టీం) విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నాగార్జున టీం నిర్ణీత రెండు ఓవర్లలో 26 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన వెంకటేష్ టీం 23 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. నాగార్జున టీం విసిరిన లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన వెంకటేష్ టీం చివరి వరకూ పోరాడినా విజయం సాధించడంలో చతికిలబడింది. హుద్‌హుద్ తుపాను బాధితులకు చేయూతనిచ్చేందుకు తెలుగు చలన చిత్రసీమ కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు. ఇందులో భాగంగానే ఆదివారం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. -
రాంచరణ్ జట్టుపై వెంకటేశ్ టీం ఘనవిజయం
హైదరాబాద్: 'మేము సైతం' కార్యక్రమంలో భాగంగా సినీ తారల మధ్య ఆదివారం కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన రెండో క్రికెట్ మ్యాచ్ లో రాంచరణ్ టీంపై వెంకటేశ్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెంకటేశ్ టీం 69 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన రాం చరణ్ టీం ఆదిలో బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ చివర్లో తడబడి ఓటమి పాలైంది. చివరి మూడు బంతుల్లో గెలుపుకు 14 పరుగులు చేయాల్సిన తరుణంలో రాం చరణ్ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. నిర్ణీత ఆరు ఓవర్లలో 54 పరుగులకే పరిమితమైన రాం చరణ్ ఓటమి పాలైంది. హుద్‌హుద్ తుపాను బాధితులకు చేయూతనిచ్చేందుకు తెలుగు చలన చిత్రసీమ ముందుకొచ్చి పలు కార్యక్రమాలు చేపట్టింది. అంతకుముందు జరిగిన క్రికెట్ మ్యాచ్ లో జూ.ఎన్టీఆర్ టీంపై అఖిల్ టీం 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం ఈ రెండు జట్లు ఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నాయి. -
ఎన్టీఆర్ క్రికెట్ జట్టుపై అఖిల్ టీం గెలుపు
హైదరాబాద్: తెలుగు సినీ తారల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఆకట్టుకుంది. ' మేము సైతం' కార్యక్రమంలో భాగంగా ఆదివారం కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో జూ.ఎన్టీఆర్ టీంపై అఖిల్ టీం 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఖిల్ టీం ఆరు ఓవర్లలో 74 పరుగులు చేసింది. అఖిల్ టీం లో అందరూ స్థాయికి తగ్గట్టుగా రాణించి జట్టు చక్కటి స్కోరు చేయడంలో తోడ్పడ్డారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎన్టీఆర్ టీం 64 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. హుద్‌హుద్ తుపాను బాధితులకు చేయూతనిచ్చేందుకు తెలుగు చలన చిత్రసీమ ముందుకొచ్చి పలు కార్యక్రమాలు చేపట్టింది. అంతకముందు జరిగిన కబడ్డీ పోటీలో మంచు విష్ణు టీంపై మంచు మనోజ్ టీం విజయం సాధించింది. -
మేముసైతంలో కడుపుబ్బ నవ్వించిన బ్రహ్మీ
-
మేముసైతం చారిటీ షో కోసం నటీనటుల రిహార్సల్స్
-
ఆకట్టుకున్న నటిశ్రేయ నృత్యప్రదర్శన
-
‘క్రికెట్ విత్ స్టార్స్’ తారల ఎంపిక
-
30న సినీ తారల ‘మేము సైతం’
తుపాన్ బాధితులకు బాసటగా సినీ తారల క్రికెట్ మ్యాచ్ ఆదివారం హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో.. హైదరాబాద్, న్యూస్‌లైన్: హుద్ హుద్ తుపాన్ విలయంతో తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తరాంధ్రను ఆదుకునేందుకు తెలుగు సినిమా తారలంతా కలసి నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం ఈ నెల 30న హైదరాబాద్‌లో ఆటపాటలతో సందడిగా సాగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో హోరెత్తనుంది. ఆ రోజు హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ‘క్రికెట్ విత్ స్టార్స్’ కార్యక్రమంలో నటీనటులంతా కలసి క్రికెట్ ఆడనున్నారు. టోర్నమెంట్లో ఆడే నాలుగు జట్లకు నాగార్జున, వెంకటేశ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ‘డ్రా’ పద్ధతి ద్వారా ఆయా టీముల్లో ఆడే తారలను గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపిక చేశారు. అనివార్య కారణాలతో నాగార్జున, ఎన్టీఆర్ రాలేకపోవడంతో... నాగార్జున టీమ్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని అఖిల్, ఎన్టీఆర్ టీమ్‌కి వైస్ కెప్టెన్ అయిన శ్రీకాంత్ వారి స్థానంలో హాజరయ్యారు. సినీ ప్రముఖులు కె.రాఘవేంద్రరావు, కేఎల్ నారాయణ, డి.సురేశ్‌బాబు, ఎమ్మెల్ కుమార్ చౌదరి పాల్గొన్నారు. నాగార్జున టీమ్: అక్కినేని అఖిల్, కల్యాణ్‌రామ్, శర్వానంద్, నిఖిల్, నాగశౌర్య, సచిన్ జోషి, శివాజీరాజా, రాజీవ్ కనకాల, అల్లరి నరేశ్, సాయికుమార్. హీరోయిన్లు రకుల్ ప్రీత్‌సింగ్, ప్రణీత, మధుశాలిని, సోనియా, డిషా పాండేలు ఈ టీమ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. వెంకటేశ్ టీమ్: మంచు విష్ణు, మంచు మనోజ్, నితిన్, నారా రోహిత్, సుశాంత్, నవీన్‌చంద్ర, డా.రాజశేఖర్, దాసరి అరుణ్‌కుమార్, మాదాల రవి, ఆదర్శ్. హీరోయిన్లు సమంత, లక్ష్మీ మంచు, సంజన, ప్రియా బెనర్జీ, తేజస్వినిలు ఈ టీమ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నారు. ఎన్టీఆర్ టీమ్: శ్రీకాంత్, గోపీచంద్, నాని, సందీప్‌కిషన్, సాయిధర్మతేజ, తనీష్, ప్రిన్స్, తరుణ్, సమీర్, రఘు, తమన్. కథానాయికలు అనుష్క, దీక్షాసేథ్, నిఖిత, శుభ్ర అయ్యప్ప, అస్మితాసూద్లు ఈ టీమ్‌కి గ్లామర్ తేనున్నారు. చరణ్ టీమ్: రవితేజ, సుధీర్‌బాబు, సుమంత్, తారకరత్న, వరుణ్‌సందేశ్, వడ్డే నవీన్, ఖయ్యూం, అజయ్. కథానాయికలు కాజల్ అగర్వాల్, చార్మి, అర్చన, పూనమ్‌కౌర్, రీతూ వర్మలు ఈ టీమ్‌లో అలరించనున్నారు. -
త్రివిక్రమ్ స్కిట్లో మహేశ్, సమంత!
-
‘మేము సైతం’ అంటున్న చిత్ర పరిశ్రమ
-
విభేదాలు లేవు!కలిసే చేస్తున్నాం : దాసరి
‘‘యావత్ తెలుగు చలన చిత్రపరిశ్రమ ఒక్కతాటిపై నిలబడి చేస్తున్న బృహత్తర కార్యక్రమం ఇది. మా ముందు తరం, మా తరం, మా తర్వాతి తరం.. ఇలా తరాలు మారుతుంటాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు మారుతుంటారు. కానీ, సినిమాకీ, ప్రేక్షకుడికి మధ్య ఉండే ఈ అవినాభావ సంబంధం శాశ్వతమైనది’’ అని డా. దాసరి నారాయణరావు అన్నారు. వైజాగ్ తుపాను బాధితుల సహాయార్థం ఈ నెల 30న ‘మేము సైతం’ పేరుతో చిత్రపరిశ్రమ భారీ కార్యక్రమం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దాసరి మాట్లాడుతూ -‘‘నాటి రాయలసీమ కరువు, దివిసీమ ఉప్పెన.. ఇలా ఏ విపత్తు జరిగినా చిత్రసీమ ముందుండి సహాయం చేసింది. ఇప్పుడు కూడా అంతే. గత ప్రెస్‌మీట్‌కి దాసరి రాలేదనీ, మరో ప్రెస్మీట్లో వేరేవాళ్లు రాలేదనీ, విభేదాలున్నందువల్లే ఇలా జరుగుతోందని కొంతమంది అంటున్నారు. ఎవరి వీలునుబట్టి వాళ్లు పాల్గొంటారు. అంతేకానీ, మా మధ్య మాకెలాంటి విభేదాలూ లేవు. అవి వేరేవాళ్లు సృష్టిస్తున్నారు. గతంలో ఇలాంటి భారీ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు సన్నాహాల కోసం ముందు కూడా షూటింగ్స్‌కి సెలవు ప్రకటించేవాళ్లం. అయితే, సాంకేతికాభివృద్ధి కారణంగా... సెలవుల్లేకుండానే పకడ్బందీ ప్రణాళికలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేసుకొనే వీలవుతోంది’’ అని చెప్పారు. మోహన్‌బాబు మాట్లాడుతూ- ‘‘విపత్తుల బాధితులకు సహాయం చేయాలనే సంప్రదాయం మొదలుపెట్టింది అన్న (ఎన్టీఆర్) గారే. మేమీ స్థాయిలో ఉండటానికి కారకులైన ప్రజలకు సహాయం చేయడానికి మేమున్నామంటూ అందరం ముందుకొచ్చాం. మాలో మాకెలాంటి భేదాభిప్రాయాల్లేవు’’ అన్నారు. ప్రజలకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటామని కృష్ణంరాజు చెప్పారు. 30న జరగబోయే కార్యక్రమాలను డి. సురేష్‌బాబు వివరించారు. కేయస్ రామారావు, ఎన్వీ ప్రసాద్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, అశోక్‌కుమార్, కొడాలి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, లక్ష్మీప్రసన్న, నాని, సందీప్ కిషన్, కమల్ కామ రాజు, శశాంక్, నిఖిల్, నవదీప్, మనోజ్ నందం, ఉత్తేజ్, కాదంబరి కిరణ్, ఖయ్యూమ్ తదితరులు పాల్గొన్నారు. -
మేము సైతం