ఎన్టీఆర్ క్రికెట్ జట్టుపై అఖిల్ టీం గెలుపు | akhil team wins against ntr team | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ క్రికెట్ జట్టుపై అఖిల్ టీం గెలుపు

Published Sun, Nov 30 2014 5:34 PM | Last Updated on Sun, Jul 14 2019 3:48 PM

akhil team wins against ntr team

హైదరాబాద్: తెలుగు సినీ తారల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఆకట్టుకుంది. ' మేము సైతం' కార్యక్రమంలో భాగంగా ఆదివారం కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో జూ.ఎన్టీఆర్ టీంపై అఖిల్ టీం 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఖిల్ టీం ఆరు ఓవర్లలో 74  పరుగులు చేసింది. అఖిల్ టీం లో అందరూ స్థాయికి తగ్గట్టుగా రాణించి జట్టు చక్కటి స్కోరు చేయడంలో తోడ్పడ్డారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎన్టీఆర్ టీం  64 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.

 

హుద్‌హుద్ తుపాను బాధితులకు చేయూతనిచ్చేందుకు తెలుగు చలన చిత్రసీమ ముందుకొచ్చి పలు కార్యక్రమాలు చేపట్టింది. అంతకముందు జరిగిన కబడ్డీ పోటీలో మంచు విష్ణు టీంపై మంచు మనోజ్ టీం విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement