
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో చేస్తున్న సంగతి తెలిసిందే. జెమిని టీవీలో ప్రసారమయ్యే ఈ షో నిన్నటి ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్‌లో పాల్గొన్న అభిరాం అనే కంటెస్టంట్‌కు క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా తనకు క్రికెట్ ఆట అంటే చాలా ఇష్టమని ఎన్టీఆర్ చెప్పాడు. కానీ క్రికెట్ చూడాలనే ఆసక్తి పోయేలా తన తండ్రి హరికృష్ణ చేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: అమెజాన్ ప్రైంలోకి ‘పాగల్’ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
‘నాకు క్రికెట్ ఆడటమంటే చాలా ఇష్టం. కానీ క్రికెట్‌ను టీవీలో చూడటమంటే అసలు ఇష్టం లేదు. దానికి కారణం మా నాన్న. ఎందుకంటే చిన్నప్పుడు ఉదయం టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్‌ను వీసీఆర్‌లో రికార్డు చేయమని చెప్పేవారు. అది ఎలా చేయాలో కూడా ఆయనే నేర్పించారు. దీంతో ఆ మ్యాచ్‌ను నేను పూర్తిగా చూడాల్సి వచ్చేది. ఆ తర్వాత సాయంత్రం నాన్నతో కలిసి మళ్లీ అదే మ్యాచ్‌ను చూసేవాడిని. అలా చూసి చూసి చివరకు క్రికెట్ అంటేనే బోర్ కొట్టింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment