
Ram Charan Reveales Mister C Story : మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ని చాలామంది చరణ్, చెర్రీ అని పిలుస్తుంటారు. కానీ ఆయన భార్య ఉపాసన మాత్రం 'మిస్టర్ సి' అని పిలుస్తుంటారు.రామ్‌చరణ్‌కి సంబంధించి ఉపాసన పెట్టే సోషల్‌మీడియా పోస్టుల్లోనూ ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా తెరకెక్కుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’ రియాల్టీ షోలో పాల్గొన్న రామ్‌చరణ్ 'మిస్టర్ సి' వెనకాల ఉన్న కారణాన్ని రివీల్ చేశారు.
ఓసారి లాస్ ఏంజెల్స్‌కి ట్రిప్‌కి వెళ్లినప్పుడు అక్కడ 'మిస్టర్ సి' అనే హోటల్ ఉండేది. అక్కడ చాలా మంచి డిన్నర్ చేశాం. ఈ క్రమంలో అక్కడి చెఫ్‌తో సరదా చిట్‌చాట్ జరిగింది. హోటల్ బాగా నచ్చడంతో అప్పటినుంచి ఉపాసన నన్ను నాకు మిస్టర్ సీ అనే పేరు పెట్టింది. అప్పటినుంచి అలానే పిలుస్తుంది అని చరణ్ పేర్కొన్నాడు. సో ఇదన్నమాట 'మిస్టర్ సి' వెనుకున్న అసలు కథ.
కాగా ఈ షోలో రెండు లైఫ్ లైన్లు వాడుకుని రామ్‌చరణ్ రూ.25లక్షల రూపాయలను గెలుచుకున్నారు. ఈ మొత్తాన్ని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కి విరాళంగా ఇచ్చాడు చరణ్. ఇక సినిమాల విషయానికి వస్తే చరణ్, ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా పప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియాభట్, ఒలివీయా మోర్రీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
చదవండి : వైరల్ : చిరంజీవి ఇంట్లో గ్రాండ్‌గా రాఖీ సెలబ్రేషన్స్
అభిషేక్‌కు గాయాలు.. హాస్పిటల్‌కు రాని ఐశ్వర్యరాయ్?
Comments
Please login to add a commentAdd a comment