టీఆర్‌పీ రేటింగ్‌లో దూసుకుపోతున్న యంగ్‌ టైగర్‌ షో | Jr NTR Evaru Meelo Koteeswarulu Second Week Got High TRP Rating | Sakshi
Sakshi News home page

Evaru Meelo Kotiswarulu: టీఆర్‌పీ రేటింగ్‌లో ముందంజలో

Published Fri, Sep 10 2021 8:10 PM | Last Updated on Fri, Sep 10 2021 8:17 PM

Jr NTR Evaru Meelo Koteeswarulu Second Week Got High TRP Rating - Sakshi

బిగ్‌బాస్‌తో పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించే మరో రియాలిటీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. గత సీజన్‌లు స్టార్‌ మాలో ప్రసారమవుగా దీనికి హోస్ట్‌గా కింగ్‌ నాగార్జున, చిరంజీవిలు వ్యవహరించారు. అయితే ఈ సారి ఈ రియాలిటీ షో సరికొత్తగా ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో జెమిని టీవీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.  దీనికి హోస్ట్‌గా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే బిగ్‌బాస్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్‌ తనదైన మ్యానరిజం, చమత్కారంతో షోను ఆసక్తిగా మలుస్తున్నాడు. సోమవారం నుంచి బుధవారం వరకు ప్రతి రోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటలకు ప్రసారమయ్యే ఈ షో ఎన్నడూ లేని విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందట.

చదవండి: ఈ నటుడిని గుర్తుపట్టారా? హీరోగా రెండు సినిమాల్లో నవ్వించాడు!

దీంతో ఈ షో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌ను రాబడుతూ మిగతా షోల కంటే ముందంజలో దూసుకుపోతుందట. కాగా ప్రిమియర్‌ ఎపిసోడ్‌కు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు 11.40 టీఆర్‌పీ రేటింగ్‌ రాగా, ఫస్ట్‌వీక్‌ 5.62 వచ్చిందట. ఇక రెండో వారం 6.48గా టీఆర్‌పీ రేటింగ్‌ వచ్చినట్లు షో నిర్వహకులు తెలిపారు. దీంతో గత సీజన్లతో పోలిస్తే ఈ సిజన్‌కు వచ్చిన టీఆర్‌పీ రేటింగ్‌ అత్యధికమట. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇదే హావాతో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ దూసుకుపోనుందని విశ్లేషకుల అంచన. కాగా ఎన్టీఆర్‌ తాజా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ షూటింగ్‌ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులతో పాటు పలు సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీ చిత్రీకరణ జరుపుకుంటోంది. 

చదవండి: నా తల్లి పేరు కూడా అదే, అందుకే నామినేట్‌ చేయలేదు: షణ్నూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement