SS Rajamouli and Koratala Siva in Jr NTR Evaru Meelo Koteeswarulu Promo Out - Sakshi
Sakshi News home page

Evaru Meelo Kotiswarulu: కొరటాల, జక్కన్నలను ఓ ఆటాడుకున్న తారక్‌..

Published Fri, Sep 17 2021 5:45 PM | Last Updated on Fri, Sep 17 2021 8:00 PM

SS Rajamouli And Koratala Siva In Evaru Meelo Koteeswarulu Promo Out - Sakshi

Evaru Meelo koteeswarulu Promo: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బుల్లితెర షో ‘ఎవరు మీలో కోటీశ్వరు’లు. తన వాక్చతుర్యంతో కంటెస్టెంట్లను, ప్రేక్షకులను అలరిస్తున్నాడు తారక్‌. ఈ షో ద్వారా మరింత వినోదం పంచేందుకు ప్రముఖు దర్శక దిగ్గజాలు సందడి చేయాడికి వస్తున్నారు. సోమవారం జరిగే ఎపిసోడ్‌లో ముఖ్యఅతిథులుగా దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, కొరటాల శివ రాబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా జెమిని టీవీ విడుదల చేసింది. ఈ ప్రోమోలో హాట్‌సీట్‌లో కూర్చున్న  జగ్గన్న, కొరటాల శివలు రోల్‌ కెమెరా, యాక్షన్‌ అంటూ హంగామా చేశారు.

చదవండి: సమంతే నా ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ లవర్‌.. రీట్వీట్‌ చేసిన సామ్‌

ఈ క్రమంలో వారికి ఎన్టీఆర్‌ ఓ ప్రశ్న ఇవ్వగా దాని గురించి దర్శకులు ఇద్దరూ చర్చించుకుంటున్నారు. దీంతో ఎన్టీఆర్‌ ఎంతసేపూ మీలో మీరే మాట్లాడుకుంటే మాకు ఏం వినిపిస్తుందని అంటాడు. ఆ తర్వాత ఇలా చేసినందుకు వీరికి ఆప్షన్లు ఇవ్వకుండా తీసేయొచ్చా గురువు గారు(కంప్యూటర్‌) అని తారక్‌ అనగానే.. తప్పండి అలా చేయకూడదు అంటూ దర్శకులు విన్నవించుకుంటారు. ఆ తర్వాత మరి మరోసారి.. అంటూ ఎన్టీఆర్‌ ఆగిపోయి వెంటనే ఇక్కడ లోకేషన్‌ నాది, డైరెక్షన్‌ నాది... ఇక్కడ నేనే బాస్‌’ అంటూ వారిని ఓ ఆటాడుకున్నాడు. మీరు కూడా ఈ ప్రొమో చూసి ఎంజాయ్‌ చేయండి.

చదవండి: జోరు పెంచిన ఎన్టీఆర్‌.. ఇక వరుస సినిమాలతో సందడి

కాగా రాజమౌళి తెరకెక్కిస్తున్నా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ షూటింగ్‌ ఇటీవల పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో పాటు మిగిలిపోయిన చివరి షూటింగ్‌ను జరపుకుంటోంది. ఇదిలా ఉంచితే కొరటాల శివతో ఎన్టీఆర్‌ ఓ మూవీ చేస్తున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కొరటాల ఈ షోకు అతిథిగా రావడం చూస్తుంటే కొరటాల-ఎన్టీఆర్‌ల ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్‌పైకి రానుందేమో అంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement