హైదరాబాద్: 'మేము సైతం' కార్యక్రమంలో భాగంగా సినీ తారల మధ్య ఆదివారం కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన రెండో క్రికెట్ మ్యాచ్ లో రాంచరణ్ టీంపై వెంకటేశ్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెంకటేశ్ టీం 69 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన రాం చరణ్ టీం ఆదిలో బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ చివర్లో తడబడి ఓటమి పాలైంది. చివరి మూడు బంతుల్లో గెలుపుకు 14 పరుగులు చేయాల్సిన తరుణంలో రాం చరణ్ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. నిర్ణీత ఆరు ఓవర్లలో 54 పరుగులకే పరిమితమైన రాం చరణ్ ఓటమి పాలైంది.
హుద్‌హుద్ తుపాను బాధితులకు చేయూతనిచ్చేందుకు తెలుగు చలన చిత్రసీమ ముందుకొచ్చి పలు కార్యక్రమాలు చేపట్టింది. అంతకుముందు జరిగిన క్రికెట్ మ్యాచ్ లో జూ.ఎన్టీఆర్ టీంపై అఖిల్ టీం 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం ఈ రెండు జట్లు ఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నాయి.