హైదరాబాద్:'మేము సైతం'కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్ర కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరిగిన ఫైనల్లో నాగార్జున టీం(అఖిల్ టీం) విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నాగార్జున టీం నిర్ణీత రెండు ఓవర్లలో 26 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన వెంకటేష్ టీం 23 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. నాగార్జున టీం విసిరిన లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన వెంకటేష్ టీం చివరి వరకూ పోరాడినా విజయం సాధించడంలో చతికిలబడింది.
హుద్‌హుద్ తుపాను బాధితులకు చేయూతనిచ్చేందుకు తెలుగు చలన చిత్రసీమ కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు. ఇందులో భాగంగానే ఆదివారం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఫైనల్లో నాగార్జున టీం విజయం
Published Sun, Nov 30 2014 7:09 PM | Last Updated on Sun, Jul 14 2019 3:48 PM
Advertisement
Advertisement