కూలీగా మారిన టాలీవుడ్ హీరో | Manchu Manoj babu working as a porter for Memu Saitham prog at Mgbs bus station | Sakshi
Sakshi News home page

కూలీగా మారిన టాలీవుడ్ హీరో

Published Mon, Jul 11 2016 11:38 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

కూలీగా మారిన టాలీవుడ్ హీరో

కూలీగా మారిన టాలీవుడ్ హీరో

హైదరాబాద్ : టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పోర్టర్ అవతారం ఎత్తాడు. హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో మూటలు మోశాడు. హీరో ఏంటి కూలీగా పని చేయటమేంటనుకున్నారా? అసలు విషయానికి వస్తే తన సోదరి మంచు లక్ష్మీప్రసన్న నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమం కోసం అతడు కూలీగా మారాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం మంచు మనోజ్ బరువులు మోశాడు.

ఈ సందర్భంగా సంపాదించిన డబ్బులను మేము సైతం కార్యక్రమానికి విరాళంగా ఇచ్చాడు. మరోవైపు మంచు మనోజ్ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అతడితో సెల్పీలు దిగేందుకు పోటీలు పడ్డారు. కాగా ఇప్పటికే పలువురు సినీ నటీనటులు మేము సైతం కార్యక్రమం కోసం కూరగాయలు అమ్మడం మొదలు పానీపూరి, కారు సర్వీసింగ్, బేకరీలో పని చేసిన విషయం తెలిసిందే.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement