Porter
-
ఆ రైల్వే కూలీకి ఇద్దరు బాడీగార్డులెందుకు? పాక్స్తాన్ ఎందుకు బెదిరిస్తోంది?
అతని పేరు ధర్మనాథ్ యాదవ్.. బీహార్‌లోని పట్నా రైల్వే జంక్షన్లో కూలీ. సాయుధులైన ఇద్దరు పోలీసు బాడీగార్డుల నడుమ థర్మనాథ్ కనిపిస్తుంటాడు. వారిలో ఒకరు బీహార్ పోలీస్ కాగా మరొకరు జీఆర్పీ జవాను. వీరిద్దరూ అతని పక్కన నడుస్తుండగా, అతను ప్రయాణికుల బ్యాగులను మోసే పనిచేస్తుంటాడు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పొద్దుపోయేవారకూ అతను ఈ బాడీగార్డుల మధ్యనే ఉంటూ, తన విధులు నిర్వహిస్తుంటాడు. అది అక్టోబరు 27, 2013.. ఉదయం 9.30 గంటలు. బాంబుల మోతతో పట్నా జంక్షన్ దద్దరిల్లిపోయింది. నలువైపులా పొగలు కమ్ముకున్నాయి. వీటి మధ్య ఒక ఎర్రటి టవల్ మెడలో వేసుకున్న ఒక వ్యక్తి.. టాయిలెట్ నుంచి రక్తంతో తడిసి ముద్దయిన ఒక యువకుడిని భుజాన వేసుకుని బయటకు తీసుకువచ్చాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు 1989 నుంచి ఇదే స్టేషన్లో పనిచేస్తున్న కూలీ ధర్మనాథ్. ఆయన టాయిలెట్ నుంచి బయటకు తీసుకు వచ్చిన యువకుడు ఉగ్రవాది ఇమ్తెయాజ్. ఒకవేళ ఆ రోజు ధర్మనాథ్ ఉగ్రవాది ఇమ్తెయాజ్ను బయటకు తీసుకురాకుండా ఉంటే ఆ మరుక్షణంలో గాంధీ మైదాన్, బోధ్‌గయలో జరగబోయే బాంబు పేలుళ్లు ఆగేవికాదు. గాంధీమైదాన్‌లో నరేంద్ర మోదీ ర్యాలీలో బాంబు పేలుళ్లు జరగనున్నాయని ఇమ్తియాజ్ స్వయంగా పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు గాంధీ మైదాన్, బోధ్‌గయ ప్రాంతాల్లో జరగబోయే బాంబు పేలుళ్లను నిలువరించగలిగారు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి థర్మనాథ్కు పాకిస్తాన్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ధర్మనాథ్ తనకు తగిన రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపధ్యంలో కోర్టు అతనికి రక్షణగా ఒక బాడీగార్డును ఏర్పాటు చేసింది. అయితే ఈ బాడీగార్డు అతనికి పోలీస్ స్టేషన్లో మాత్రమే రక్షణ కల్పించేందుకు అవకాశం ఉంది. దీంతో ధర్మనాథ్ తాను బయటకు వెళ్లినప్పుడు కూడా రక్షణ కల్పించాలని కోర్డును వేడుకున్నాడు. దీంతో కోర్టు 2023లో ధర్మనాథ్‌కు మరొక పోలీసు కానిస్టేబుల్ ద్వారా రక్షణ కల్పించింది. ఈ సందర్భంగా కూలీ ధర్మనాథ్ మాట్లాడుతూ తనకు ఉండేందుకు ఇల్లు కూడా లేదని, స్టేషన్‌లోని కూలీల విశ్రాంతి గదిలోనే ఉంటున్నానని తెలిపాడు. రాత్రి వేళలో ఇద్దరు బాడీగార్డులు కూడా వారి ఇళ్లకు వెళ్లిపోతారని, తనకు ఇల్లు ఉంటే వారు తనతో పాటు రాత్రి కూడా ఉంటారని చెబుతున్నాడు. అందుకే తనకు ఇల్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఇది కూడా చదవండి: భార్య ప్రేమను అర్థం చేసుకుని.. ప్రియునితో పంపించాడు! -
పోర్టర్‌కు 5,000 ఈ–కార్గో వాహనాలు
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న ఒమెగా సీకి మొబిలిటీ భారీ ఆర్డర్‌ను అందుకుంది. ఇందులో భాగంగా సరుకు రవాణా రంగంలో ఉన్న పోర్టర్‌కు 5,000 ఎలక్ట్రిక్ కార్గో త్రిచక్ర వాహనాలను సరఫరా చేయనుంది. వచ్చే ఏడాది చివరినాటికి ఈ వెహికిల్స్‌ను డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పోర్టర్ వద్ద 1,000 ఎలక్ట్రిక్ త్రీవీలర్లు ఉన్నాయి. ఈ–కామర్స్ కంపెనీల నుంచే కాకుండా ఎఫ్ఎంసీజీ, డెయిరీ, నిర్మాణ, వాహన విడిభాగాల వంటి రంగాల నుండి కూడా డిమాండ్ రావడంతో ట్రక్కుల అవసరం పెరిగిందని ఒమెగా సీకి మొబిలిటీ ఫౌండర్, చైర్మన్ ఉదయ్ నారంగ్ తెలిపారు. ‘2023లో ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగంలో 200 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. పోర్టర్‌తో భాగస్వామ్యం గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఇటువంటి డీల్స్ మరిన్ని కుదుర్చుకోనున్నాం. వచ్చే 2–3 ఏళ్లలో డీల్స్‌లో భాగంగా భాగస్వామ్య కంపెనీలకు 50,000 వెహికిల్స్ సరఫరా చేసే అవకాశం ఉంది’ అని వివరించారు. ఈ–కామర్స్ కంపెనీలు పండగల నెలలో రూ.96,170 కోట్ల విలువైన వ్యాపారం నమోదు చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. -
‘మొదటి మహిళ’కు సత్కారం
న్యూఢిల్లీ: ‘నా బరువు 30 కిలోలు. నేను మోయాల్సిన లగేజీ కూడా దాదాపు 30 కిలోలే. అయితే, భర్త చనిపోవటంతో నా ముగ్గురు పిల్లలను బతికించుకునే భారం నాదే. అందుకే పోర్టర్గానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నా’ అని రాజస్తాన్‌కు చెందిన మొట్టమొదటి మహిళా రైల్వే కూలీ మంజు చెప్పిన మాటలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కదిలించాయి. శనివారం రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన 90 మంది మొదటి మహిళల్లో జైపూర్‌కు చెందిన మంజు ఒకరు. రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన వారిలో వివిధ రంగాల్లో మొట్టమొదటి వారిగా ప్రసిద్ధులైన ఐశ్వర్యరాయ్, నికోల్ ఫారియా, బచేంద్రిపాల్, టెస్సీ థామస్, రజనీ పండిట్ తదితరులతోపాటు మొదటి మహిళా ఫైర్‌ఫైటర్, మహిళా బస్ డ్రైవర్, మహిళా మర్చంట్ నేవీ కెప్టెన్ తదితరులున్నారు. వీరందరినీ రాష్ట్రపతి సత్కరించారు. సందర్భంగా మంజు మాట్లాడుతూ..‘పోర్టర్ ఉద్యోగంలో అడుగడుగునా అవాంతరాలే. అక్షర జ్ఞానం లేకపోవటంతో ప్లాట్‌ఫాంలు, కోచ్‌లు, సీట్ల నంబర్లను గుర్తు పెట్టుకోవటం కష్టమైపోయింది. రైల్వే అధికారుల సాయంతో ఆరునెలల్లో అంకెలను, అక్షరాలను నేర్చుకున్నా’అని తెలిపింది. వాయవ్య రైల్వే రీజియన్‌లో తొలి మహిళా కూలీగా రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. రాష్ట్రపతిని కలసిన వారిలో దివ్యాంగురాలయినప్పటికీ ఐఏఎస్‌కు ఎంపికైన ఇరా సింఘాల్ కూడా ఉన్నారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వివిధ రంగాలకు చెందిన 112 మందిని ‘మొదటి మహిళలు’గా ప్రకటించింది. -
కూలీగా మారిన టాలీవుడ్ హీరో
హైదరాబాద్ : టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పోర్టర్ అవతారం ఎత్తాడు. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో మూటలు మోశాడు. హీరో ఏంటి కూలీగా పని చేయటమేంటనుకున్నారా? అసలు విషయానికి వస్తే తన సోదరి మంచు లక్ష్మీప్రసన్న నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమం కోసం అతడు కూలీగా మారాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం మంచు మనోజ్ బరువులు మోశాడు. ఈ సందర్భంగా సంపాదించిన డబ్బులను మేము సైతం కార్యక్రమానికి విరాళంగా ఇచ్చాడు. మరోవైపు మంచు మనోజ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అతడితో సెల్పీలు దిగేందుకు పోటీలు పడ్డారు. కాగా ఇప్పటికే పలువురు సినీ నటీనటులు మేము సైతం కార్యక్రమం కోసం కూరగాయలు అమ్మడం మొదలు పానీపూరి, కారు సర్వీసింగ్, బేకరీలో పని చేసిన విషయం తెలిసిందే. -
హమాలీ పోస్టులకు 984 మంది గ్రాడ్యుయేట్లు!
ముంబై: మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఎమ్ పీఎస్సీ) తాజా విడుదల చేసిన హమాలీ పోస్టులకు 984 మంది గ్రాడ్యుయేట్లు, ఐదుగురు ఎంఫిల్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసినట్లు సోమవారం ఓ అధికారి తెలిపారు. మొత్తం ఐదు హమాలీ పోస్టులకు గత ఏడాది డిసెంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. అభ్యర్థుల కనీస విద్యార్హత నాల్గవ తరగతిగా పేర్కొన్నట్లు వివరించారు. మొత్తం 2,424 మంది అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వీరిలో 5 గురు ఎం.ఫిల్ డిగ్రీ, 253మంది పీజీ, 109 మంది డిప్లొమా, 9 మంది పీజీ డిప్లొమా, 984 మంది డిగ్రీ, 605 మంది ఇంటర్, 282 మంది టెన్త్, 177 మంది టెన్త్ కు దిగువ తరగతులను తమ విద్యార్హతగా పేర్కొన్నట్లు తెలిపారు. వీరందరికి వచ్చే ఆగష్టులో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షలో అభ్యర్థులకు భాషపై పట్టు, బేసిక్ మ్యాథమెటిక్ స్కిల్ పై ప్రశ్నలుంటాయని తెలిపారు.