MGBS bus station
-
భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
-
రూ.15 వేలకు కొని.. యువతిని రూ.25 వేలకు అమ్మకం
హసన్‌పర్తి: రూ.15 వేలకు కొని.. రూ.25 వేలకు అమ్మింది. ఇదేదో సంతలోని పశువునో.. ఏదైనా వస్తువో అనుకుంటే పొరపాటు. ఒంటరిగా ఉన్న యువతికి మాయమాటలు చెప్పిన ఇద్దరు మైనర్లు, వారి తల్లినుంచి ఓ మధ్యవర్తి కొన్న రేటు రూ.15 వేలు అయితే.. ఆమె తిరిగి వ్యభిచార గృహ నిర్వాహకులకు అమ్మింది రూ.25 వేలకు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌లోని ఓ ప్రాంతంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంనుంచి ఓ యువతి తప్పించుకుంది. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లుగా పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ యువతి టెలీ కాలర్ జాబ్ నిమిత్తం ఈనెల 10వ తేదీన హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్‌లో దిగింది. ఒంటరిగా ఉండడం గమనించిన ఇద్దరు మైనర్ బాలికలు ఆమెకు మాయమాటలు చెప్పి హైదరాబాద్‌లోని తమ ఇంటికి తీసుకెళ్లారు. యువతి విషయాన్ని తల్లి మమతకు చెప్పారు. వారి మాయమాటలు నమ్మిన ఆ యువతి రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉంది. ఇక్కడ రూ.25 వేలకు అమ్మకం హైదరాబాద్‌లో రూ.15 వేలుకు కొనుగోలు చేసిన శివమ్మ వంగపహాడ్లో శ్యామ్‌రావు కావ్యకు రూ.25 వేలకు విక్రయించింది. రెండు రోజులపాటు వ్యభిచారం చేయాలని బలవంతం చేసింది. అందుకు ఆ యువతి అంగీకరించలేదు. ఈనెల 14న బాధితురాలు వ్యభిచార గృహం నుంచి తప్పించుకుంది. ఓఆర్ఆర్ వద్ద భూక్యా రాజు అనే యువకుడిని మోటార్‌సైకిల్‌పై లిఫ్ట్ తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చందన, మమత, ఇద్దరు మైనర్ బాలికలతో పాటు కావ్య, శివమ్మలను అరెస్ట్ చేసినట్లు ఎస్సై సురేష్ తెలిపారు. రూ.15 వేలకు విక్రయం ఆ యువతిని బ్రోకర్‌గా వ్యవహరిస్తున్న గీసుకొండకు చెందిన పాకనటి శివమ్మకు రూ.15 వేలకు విక్రయించారు. మొదట శివమ్మతో వెళ్లడానికి ఆ యువతి అంగీకరించలేదు. దీంతో మమత, ఆమె సోదరి చందనలు ఆ యువతిని నిర్బంధించారు. తాడుతో చేతులు కట్టి, సెల్‌ఫోన్, బ్యాగ్‌తో పాటు అందులో ఉన్న రూ.2 వేలు లాక్కున్నారు. అనంతరం పాకనటి శివమ్మకు అప్పగించారు. ఆమె ఈ నెల 12న యువతిని కారులో ఎక్కించుకుని వంగపహాడ్‌కు చేరుకుంది. -
మెట్రోపై ‘మహాలక్ష్మి’ఎఫెక్ట్!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైళ్లపైన ‘మహాలక్ష్మి’ ఎఫెక్ట్ పడింది. ప్రతిరోజు కిక్కిరిసి పరుగులు తీసే మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత మధ్యతరగతి మహిళలు, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు, విద్యారి్థనులు కొంతమేరకు సిటీ బస్సుల్లోకి మారారు. దీంతో గతేడాది 5.10 లక్షలు దాటిన మెట్రో ప్రయాణికులు ప్రస్తుతం 4.8 లక్షల నుంచి 4.9 లక్షల మధ్య నమోదవుతున్నట్లు ఎల్అండ్టీ అధికావర్గాలు పేర్కొన్నాయి. ఏటేటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా మహాలక్ష్మి పథకం కారణంగా ఈ ఏడాది మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు పేర్కొన్నాయి. నగరంలోని మూడు ప్రధాన కారిడార్లలో మెట్రో రైళ్లు ప్రతి రోజు 1034 ట్రిప్పులు తిరుగుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్న నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో అందుబాటులో ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ రూట్లో మాత్రం ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉండడంతో ఈ రూట్లో ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పున రైళ్లు నడుస్తున్నాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి వచి్చన తరువాత మహిళా ప్రయాణికులు తగ్గారు. ఈ ఏడాదిలో ఆరున్నర లక్షలు దాటవచ్చునని అధికారులు అంచనా వేయగా, అందుకు భిన్నంగా మహాలక్ష్మి కారణంగా సుమారు 5 నుంచి 10 శాతం ప్రయాణికులు తగ్గడం గమనార్హం. గతేడాది రికార్డు స్థాయిలో రద్దీ... గత సంవత్సరం జూలై మొదటి వారంలో రికార్డుస్థాయిలో 5.10 లక్షల మంది మెట్రోల్లో ప్రయాణం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు చరిత్రలో మొట్టమొదటిసారి ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటింది. రహదారులపైన వాహనాల రద్దీ, కాలుష్యం తదితర కారణాల దృష్ట్యా నగరవాసులు మెట్రోకు ప్రాధాన్యతనిస్తున్నారు. మరోవైపు వేగంగా, ఎలాంటి ఆటంకాలు లేనివిధంగా పూర్తి ఏసీ సదుపాయంతో ప్రయాణాన్ని అందజేయడంతో కూడా ఇందుకు మరో కారణం. నగరవాసులే కాకుండా పర్యాటకులు, వివిధ పనులపైన హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లు సైత మెట్రోల్లోనే ఎక్కువగా పయనిస్తున్నారు. గతేడాది లెక్కల ప్రకారం మియాపూర్–ఎల్బీనగర్ కారిడార్‌లో ప్రతిరోజు 2.60 లక్షల మంది పయనించగా, నాగోల్–రాయదుర్గం కారిడార్‌లో 2.25 లక్షల మంది రాకపోకలు సాగించారు. జూబ్లీస్ బస్‌స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ వరకు రోజుకు 25,000 మంది ప్రయాణం చేశారు. కానీ మహాలక్ష్మి పథకం కారణంగా ఈ మూడు కారిడార్లలో కలిపి 30 వేల మందికి పైగా మహిళలు సిటీబస్సుల్లోకి మారినట్లు అంచనా. ప్రత్యేకంగా ఈ రెండు నెలల్లోనే ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అని ఎల్అండ్టీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మహాలక్ష్మి పథకంతో పాటు మరికొన్ని అంశాలు కూడా కారణం కావచ్చునన్నారు. మరోవైపు మెట్రోస్టేషన్లలో రాయదుర్గం, ఎల్బీనగర్, అమీర్‌పేట్, మియాపూర్ స్టేషన్ల నుంచి అత్యధిక మంది రాకపోకలు సాగిస్తున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ కూడా... నగరంలో మెట్రో రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే సాఫ్ట్వేర్ ఉద్యోగులు మెట్రో సేవలను గణనీయంగా వినియోగించుకున్నారు. క్రమంగా విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు మెట్రో శాశ్వత ప్రయాణికులుగా మారారు. ప్రస్తుతం ప్రతి రోజు 1.40 లక్షల మంది సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. కానీ కొన్ని సంస్థలు ఇంకా ‘వర్క్‌ప్రమ్ హోమ్’ను కొనసాగిస్తున్నాయి. దీంతో చాలా మంది ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. ఈ కారణంగా మెట్రోల్లో ప్రయాణం చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి సుమారు మెట్రో ప్రయాణికుల సంఖ్య 6.7 లక్షలకు చేరుకోవచ్చునని అంచనాలు వేయగా వివిధ కారణాల వల్ల అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. -
ఓటేసేందుకు ఊరి బాట..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో ఓటేసేందుకు చాలామంది హైదరాబాద్ వాసులు సొంతూళ్ల బాట పట్టారు. పోలింగ్ రోజు గురువారం(నవంబర్30)న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో సొంతూళ్లలో ఓట్లున్నవారు స్వస్థలాలకు పయనమయ్యారు. ఒక్కసారిగా నగర వాసులు సొంతూళ్లకు బయలుదేరడంతో నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్లు రద్దీగా మారాయి. పండగల ముందురోజుల్లో ఉన్నట్లుగా కిక్కిరిసిపోయాయి. బస్సులన్నీ నిండిపోవడంతో సీట్ల కోసం జనం ఎగబడుతున్నారు. ఎలాగైనా ఊరెళ్లి ఓటెయ్యాలన్న ఉద్దేశంతో సీట్లు దొరకకపోయిన బస్సుల్లో నిల్చొని ప్రయాణించేందుకూ సిద్ధమవుతున్నారు. ఓటేసేందుకు స్వచ్ఛంధంగా ఊళ్లకు వెళ్లే వారు కొందరైతే పార్టీల పోల్ మేనేజ్మెంట్ ఎఫెక్ట్‌తో ఊరి బాట పట్టేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఊళ్లలోని ప్రధాన పార్టీల స్థానిక నాయకులు ఫోన్లు చేసి మరీ హైదరాబాద్‌లో ఉంటున్న ఆయా ఊళ్లకు సంబంధించిన వారిని ఓటేసేందుకు రమ్మని పిలుస్తున్నట్లు సమాచారం. దీంతో సొంత నియోజకవర్గాల్లో తమ అభిమాన పార్టీని, నాయకుడిని గెలిపించుకునేందుకు నగరవాసులు స్వస్థలాలకు బయలుదేరారు. హైదరాబాద్‌కు ఉద్యోగ,వ్యాపార రీత్యా, ఇతరకారణాలతో వచ్చి నివసిస్తున్న వారిలో చాలా మందికి నగరంలో ఓటు హక్కు లేదన్న విషయం తెలిసిందే. వీరంతా తమ ఓటును సొంతూళ్లలోనే నమోదు చేయించుకున్నారు. పోలింగ్ రోజు ఓటేయ్యకుండా హైదరాబాద్‌లో ఉండటానికి వీరు సాధారణంగా ఆసక్తి చూపరు. ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లో తమ స్వస్థలాల్లో వినియోగించుకోవాలని చాలా మంది ఊరి బాట పట్టారు. ఇదీచదవండి..తెలంగాణ పోలింగ్‌కు వరుణగండం? -
TSRTC: దసరా పండుగ వేళ ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు TSRTC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని సంస్థ కల్పించింది. అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మ, 23న మహార్ణవమి, 24 దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో.. ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. హైదరాబాద్‌లో ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించనుంది. పండుగ రోజుల్లో ఎంజీబీఎస్-ఉప్పల్, ఎంజీబీఎస్-జేబీఎస్, ఎంజీబీఎస్-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులో ఉంచనుంది. అక్టోబర్ 21 నుంచి 23 వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెగ్యూలర్, స్పెషల్ సర్వీసులను ఎంబీజీఎస్ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నడపాలని సంస్థ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపునకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి బయలుదేరుతాయి. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వేళ్లేవి జేబీఎస్, పికెట్ నుంచి వెళ్తాయి. వరంగల్, హన్మకొండ, జనగామ, పరకాల, నర్సంపేట, మహబుబాబాద్, తొర్రూరు, యాదగిరిగుట్ట బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్ నుంచి నడుస్తాయి. విజయవాడ, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం బస్సులు ఎల్బీనగర్ నుంచి బయలుదేరుతాయి. మిగతా సర్వీసులు యథావిధిగా ఎంజీబీఎస్ నుంచే నడుస్తాయి. సజ్జనార్ ట్వీట్.. ‘బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం 5265 ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక సర్వీసులన్ని నడుస్తాయి. గత దసరాకు 4280 ప్రత్యేక నడపగా.. అందులో 239 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ కల్పించాం. గత దసరా కన్నా ఈ సారి దాదాపు 1000 (20 శాతం) బస్సులను అదనంగా నడుపుతున్నాం. ముందస్తు రిజర్వేషన్ సర్వీసులను కూడా 535కి పెంచాం. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. రెగ్యూలర్ సర్వీసుల మాదిరిగానే ప్రత్యేక బస్సులకు సాధారణ చార్జీలనే సంస్థ వసూలు చేస్తుంది. స్పెషల్ సర్వీసులకు ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయడం లేదు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంది. ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకుని క్షేమంగా, సురక్షితంగా ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రభుత్వ రంగ సంస్థైన టీఎస్ఆర్టీసీ కోరుతోంది. దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు #TSRTC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) October 1, 2023 -
పల్లెబాట పట్టిన నగరవాసులు
-
హమ్మయ్యా, నవీన్ దొరికాడు.. కానీ ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడకు ఎలా వెళ్లాడు?
సాక్షి,అఫ్జల్‌గంజ్(హైదరాబాద్): మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో అపహరణకు గురైన మూడేళ్ల నవీన్ ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరుకున్నాడు. ఈ నెల 9న తన తండ్రి లక్ష్మణ్‌తో కలిసి అన్నమయ్య జిల్లాలోని సొంతూరికి వెళ్లేందుకు ఎంజీబీఎస్‌కు వచ్చాడు. తండ్రి మూత్రశాలకు వెళ్లొచ్చే సరికి గుర్తుతెలియని వ్యక్తి అతడిని అపహరించి అక్కడి నుండి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అగంతకుడు బాలుడి చేయి పట్టుకొని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు బాలుడి కోసం గాలింపు చేపట్టారు. అయితే సదరు బాలుడు మిర్యాలగూడకు చెందిన ఆర్టీసీ బస్సులో తిరిగి మంగళవారం అర్థరాత్రి ఎంజీబీఎస్‌కు చేరుకున్నాడు. ఎంజీబీఎస్‌కు చేరుకున్న బస్సులోని ఓ సీటులో నిద్రిస్తున్న బాలుడిని గుర్తించిన కండక్టర్ పోలీసులకు సమాచారం అందించాడు. ఆ బాలుడిని చేరదీసిన అఫ్జల్‌గంజ్ పోలీసులు అదే రాత్రి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి కోసం గాలింపు ముమ్మరం చేశామని, ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడకు ఎలా వెళ్లాడనే కోణంలో సైతం దర్యాప్తు చేస్తున్నట్లు అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. చదవండి: బ్యాంక్‌కు షాకిచ్చిన క్యాషియర్.. ఐపీఎల్ బెట్టింగ్‌లో.. ∙ -
సంకాంత్రి.. భారీగా సొంతుళ్ల బాట పట్టిన సీటీ వాసులు
-
జనారే.. సజ్జనారే!.. పండగ రద్దీ
అఫ్జల్‌గంజ్: విధి నిర్వహణలో ఆయనదో విలక్షణ ముద్ర. పోలీస్ అధికారిగా ఆయనది సంచలన చరిత్ర. ఏ శాఖలో పనిచేసినా తనదైన శైలిలో దూసుకువెళ్లే ప్రత్యేకత. ఆయనే ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే ఆర్టీసీలో ఎన్నో సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. సంస్థ అభివృద్ధికి, ప్రయాణికుల అభిమానాన్ని చూరగొనేందుకు ఇతోధికమైన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మహాత్మా గాంధీ బస్‌స్టేషన్‌లో ఆయన పర్యటించారు. బస్సులోకి వెళ్లి డ్రైవర్లను ఆప్యాయంగా పలకరించారు. ప్రయాణికులకు నమస్కరించారు. వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. బస్సులో ఓ తల్లి ఒడిలో ఉన్న చిన్నారిని ఎత్తుకుని అలరించారు. ఆర్టీసీ ప్రచార కళాకారులతో కలిసి ఫొటో దిగారు. సంక్రాంతి వేళ భారీ రద్దీ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటించి గమ్యస్థానాలకు సురక్షితంగా వెళ్లాలని ప్రయాణికులకు ఆయన సూచించారు. ఎంతైనా సజ్జనార్.. సజ్జనారే! పండగ రద్దీ సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ కోసం సిటీ నుంచి జనం బుధవారం కూడా భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఏపీ, టీఎస్ ఆర్టీసీలతోపాటు ప్రైవేట్ బస్సులు కిక్కిరిసిపోయాయి. విజయవాడ, విశాఖపట్టణం, రాజమండ్రి, అమలాపురం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ నిండిపోయాయి. పండగ రద్దీతో ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, కూకట్పల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. -
TSRTC: జేబీఎస్‌లోనూ యూపీఐ సేవలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో యూపీఐ, క్యూఆర్ కోడ్ ఆధారంగా టిక్కెట్ బుకింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ఆర్టీసీ తాజాగా జూబ్లీ బస్‌స్టేషన్ (జేబీఎస్)లోనూ అదే తరహా విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు యూపీఐ లేదా క్యూఆర్ కోడ్‌ను వినియోగించి రిజర్వేషన్ టికెట్లు తీసుకోవడంతో పాటు పార్శిల్, కార్గో సేవలను కూడా పొందవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. క్యూఆర్ సేవలపై ఎంజీబీఎస్‌లో ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో ప్రస్తుతం జేబీఎస్లో కూడా ఆ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. చదవండి: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. ఆర్టీసీలో ‘పెళ్లి సందడి’ టీఎస్ఆర్టీసీ మరో ముందడుగు.. ప్రయాణికులకు సజ్జనార్ గుడ్‌న్యూస్ -
టీఎస్ఆర్టీసీ మరో ముందడుగు.. ప్రయాణికులకు సజ్జనార్ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. బస్టాండుల్లో చిల్లర కష్టాలకు చెక్ పెడుతూ.. ప్రయాణికులకు టీఆఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ అందించింది. టికెట్ కొనే సమయంలో ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్‌గా మహత్మాగాంధీ బస్టాప్‌లో (ఎంజీబీఎస్) టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్సిల్ కార్గో సేవల దగ్గర, రేతిఫైల్ బస్టాండ్‌లోని బస్‌పాస్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులు ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. పరిస్థితి పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఆన్లైన్ పేమెంట్ సదుపాయాన్ని అమలు చేస్తామని సజ్జనార్ తెలిపారు. Good news to TSRTC Passengers! We have under taken a new pilot project to accept payments via @UPI_NPCI #QRcode in #MGBS & #rathifile bus stands for Ticket booking & cargo/parcel services from 19th Oct 2021. We Request all the #citizens to utilize this service & make it success pic.twitter.com/6wqKizbN1A — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 19, 2021 -
జేబీఎస్, ఎంజీబీఎస్: బండి పెడితే బాదుడే..
‘బోయిన్‌పల్లికి చెందిన ప్రవీణ్ సిద్ధిపేట సమీపంలోని కొండపాకలో పని చేస్తాడు. ప్రతి రోజు ఉదయం జేబీఎస్ నుంచి బస్సులో వెళ్లి తిరిగి సాయంత్రం నగరానికి చేరుకుంటాడు. అప్పటి వరకు అతని బైక్ జేబీఎస్ పార్కింగ్‌లో ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్కింగ్ చేసినందుకు ప్రతి రోజు రూ.40 వరకు పార్కింగ్ ఫీజు చెల్లించవలసి వస్తుంది. బండి పెట్టాలంటేనే భయమేస్తుంది. ఒక్క నిమిషం తేడా ఉన్నా రూ.10 అదనంగా తీసుకుంటారు. ఇదేమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు..’ అంటూ అతను ఆవేదన వ్యక్తం చేశాడు. సాక్షి, హైదరాబాద్: ఒక్క ప్రవీణ్ మాత్రమే కాదు. జూబ్లీబస్‌స్టేషన్, మహాత్మాగాంధీ బస్స్టేషన్లలో బండి పార్క్ చేస్తే చాలు ప్రయాణికుల జేబులకు చిల్లులు పడాల్సిందే. పార్కింగ్ నిర్వాహకులు అడిగినంతా ఇవ్వలేకపోతే దౌర్జన్యానికి దిగుతున్నారు. పార్కింగ్ ఫీజుల్లో పారదర్శకత కోసం టిమ్స్ యంత్రాలను ప్రవేశపెట్టినప్పటికీ అవి అమలుకు నోచుకోవడం లేదు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ప్రతి నిత్యం దోపిడీకి గురవుతున్నారు. జూబ్లీబస్‌స్టేషన్‌లో ఇటీవల పార్కింగ్ దోపిడీకి గురైన ప్రయాణికుడు ఒకరు సామాజిక మాధ్యమాల్లో సైతం ఆందోళన వ్యక్తం చేశారు. లెక్కల్లో చిక్కులు.. బస్స్టేషన్లలో పార్కింగ్ నిర్వహణ పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. అయితే పార్కింగ్ ఫీజులను మాత్రం ఆర్టీసీ నిర్ణయిస్తుంది. కానీ అమలుపై ఆ సంస్థ నియంత్రణ కోల్పోతోంది. ద్విచక్ర వాహనాలకు 3 గంటలకు రూ.10 చొప్పున, 15 గంటలకు రూ.30 చొప్పున పార్కింగ్ ఫీజుగా వసూలు చేయాలి. ఒక రోజంతా బండిని పార్క్ చేస్తే రూ.50 చెల్లించాలి. కారు పార్కింగ్‌కు మూడు గంటలకు రూ.20, 15 గంటలకు రూ.50, ఒక రోజంతా కారు పార్క్ చేస్తే రూ.75 మాత్రమే తీసుకోవాలి. అయితే ఈ పార్కింగ్ ఫీజులు వాహనదారులకు స్పష్టంగా కనిపించకుండా బోర్డులను పార్కింగ్ స్థలాలకు దూరంగా ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ఏదో హడావిడిలో ఉండే ప్రయాణికులు పెద్దగా పట్టించుకోకుండానే అడిగినంతా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ పార్కింగ్ ఫీజుల గురించి స్పష్టమైన అవగాహనతో నిలదీస్తే మాత్రం బెదిరింపులకు గురి కావలసి వస్తుంది. మరోవైపు పార్కింగ్ గంటల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. మూడు గంటలపైన ఒక నిమిషం గడిచినా అదనంగా రూ.10 చెల్లించాల్సిందే..ప్రయాణికుడు 15 గంటల పాటు బండి నిలిపినప్పుడు మాత్రమే రూ.30 చెల్లించవలసి ఉండగా, ప్రతి మూడు గంటల చొప్పున లెక్కలు వేసి కనీసం రూ.50 వరకు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అలాగే 24 గంటల వ్యవధిలోనూ మార్పులు చేసి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. చర్యలు శూన్యం... బస్స్టేషన్లలో విక్రయించే తినుబండారాలు, వాటర్ బాటిళ్లు, స్నాక్స్, టిఫిన్స్‌తో సహా అన్నింటిపైన అధిక ధరలు వసూలు చేసినా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పార్కింగ్ నిర్వాహకుల దోపిడీపై కూడా చర్యలు శూన్యం. ప్రయాణికులు ఫిర్యాదు చేసిన సందర్భాల్లో మాత్రం నామమాత్రపు జరిమానాలు విధించి వదిలేస్తున్నారు. రేట్లు కనిపించకుండా పెట్టారు జేబీఎస్ లో బండి పార్క్ చేయాలంటే ఆలోచించాల్సి వస్తుంది. రేట్లు కనిపించకుండా ఎక్కడో పైన పెట్టేస్తారు. ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే అదంతే అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతారు. వాళ్లతో గొడవ ఎందుకని అడిగినంతా ఇచ్చి రావాల్సి వస్తోంది. చదవండి: జూబ్లీహిల్స్: లైసెన్స్డ్ గన్‌కు పని చెప్పమంటావా..? బల్దియా చరిత్రలోనే మొదటిసారి.. ప్రతిపక్షాల విమర్శలు -
ప్రాణం తీసిన గుంత.. పాతబస్తీ యువకుల దుర్మరణం
-
దారుణం: రోడ్డుపై గుంతను తప్పించబోయి..
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంజీబీఎస్ బస్సు స్టేషన్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఫసీఖాన్ (19), మోసిన్ (23)లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై ఓ ఫంక్షన్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి ఒక్కసారిగా కింద పడ్డారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఓ లారీ వారిపై నుంచి దూసుకెళ్లింది. దాంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరు యువకులు చాదర్‌ఘాట్ ముసానగర్ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాల మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. చదవండి: వివాహేతర సంబంధం: యువకుడి హత్య! -
24 గంటల్లోనే కిడ్నాప్ కథ సుఖాంతం
సాక్షి, యాదాద్రి భువనగిరి: భర్తను వెతుక్కుంటూ వెళ్లిన ఓ మహిళకు మాయమాటలు చెప్పిన దుండగులు ఆమె మూడేళ్ల కుమార్తెను కిడ్నాప్ చేశారు. భువనగిరి పట్టణంలో సోమవారం ఈ ఘటన జరిగింది. వివరాలు.. మహబూబ్ నగర్ జిల్లా దక్కూరు మండలం గార్లపాడుకు చెందిన ఉప్పుతాళ్ల రాజు జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లాడు. నాలుగు రోజులైనా భర్త తిరిగి రాకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ మూడేళ్ళ కూతురిని వెంటబెట్టుకుని భార్య మహేశ్వరి హైదరాబాద్ వెళ్లింది. హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్‌లో చిన్నారితో కలిసి బస్ దిగిన మహేశ్వరిని కొందరు దుండగులు మాయమాటలు చెప్పి నమ్మించారు. ఆమె భర్త రాజు దగ్గరకు తీసుకెళ్తామని చెప్పి భువనగిరికి తీసుకొచ్చారు. మాటల్లో పెట్టి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించారు. మహేశ్వరి స్పృహ తప్పగానే బాలికను అపహరించుకుపోయారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించి గోడు వెళ్లబోసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన 24 గంటల్లో కేసును ఛేదించారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. చిన్నారి క్షేమంగా ఉందని పేర్కొన్నారు. (చదవండి: మానుకోటలో బాలుడి కిడ్నాప్) -
తొలిరోజు సందడి లేని ఎంజీబీఎస్
అఫ్జల్‌గంజ్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు 58 రోజులపాటు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు గత వారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. అయితే బస్సులను నగర శివారు ప్రాంతాలకే పరిమితం చేశారు. తాజాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లోకి అనుమతిచ్చారు. ఈ క్రమంలో తొలిరోజు గురువారం దాదాపు 250 బస్సులు వివిధ జిల్లాల నుంచి ఎంజీబీఎస్‌కు రాకపోకలు సాగించాయి. వీటి ద్వారా సుమారు పది వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారని ఎంజీబీఎస్ సహాయ మేనేజర్ సుధ తెలిపారు. ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఉన్న మూత్రశాలల వద్ద, సమాచార కేంద్రం వద్ద పెడల్ శానిటైజర్ స్టాండ్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి బస్సును శానిటైజ్ చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతిస్తున్నామని వెల్లడించారు. బస్సు ఎక్కే ముందు డ్రైవరు, కండక్టర్‌తో సహా ప్రయాణికులందరూ తమ చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని... భౌతిక దూరాన్ని పాటిస్తూ బస్సులను ఎక్కి నిర్దేశించిన సీట్లల్లో మాత్రమే కూర్చొని ప్రయాణించాలని ఆమె సూచించారు. -
మహమ్మారిపై యుద్ధం
-
సమ్మె: హైకోర్టులో మరో మూడు పిటిషన్లు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయమై హైకోర్టులో సోమవారం మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. అటు ప్రభుత్వానికి, ఇటు కార్మిక సంఘాలకు నోటీసులు జారీచేసింది. అన్ని పిటిషన్లపై ఈ నెల 28న వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మె నేటితో 17వ రోజుకు చేరుకున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కార్మిక సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు తమ ఆందోళనను తీవ్రతరం చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ రోజు (సోమవారం) సాయంత్రం 5 గంటలకు ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలువనున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని, దీనిపై జోక్యం చేసుకోవాలని జేఏసీ ప్రతినిధులు గవర్నర్‌ను కోరనున్నట్టు సమాచారం. సమ్మె మరింత ఉధృతం చేస్తాం ఆర్టీసీ సమ్మెలో భాగంగా నగరంలోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) వద్ద ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులు తమ కుటుంబసభ్యులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన టీజేఎస్ చీఫ్ కోదండరాం ఆర్టీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. ప్రజారవాణా వ్యవస్థను కాపాడుకోవడమే లక్ష్యంగా తమ ఉద్యమం ఉంటుందని, ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి.. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోదండరామ్ కోరారు. -
బస్టాండ్‌లోనే ప్రసవించిన మహిళ
సుల్తాన్‌బజార్: కాన్పు కోసం నగరంలోని ఆస్పత్రిలో చేరేందుకు వచ్చిన ఓ మహిళ ఇమ్లీబన్ బస్‌స్టేషన్‌లోనే ప్రసవించింది. సడన్‌గా నొప్పులు రావడంతో బస్టాండ్ ఆవరణలోనే ఆర్టీసీ సిబ్బంది సాయంతో ఆమెకు పురుడు పోశారు. దీంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివరాలిలా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తాలూకా అమ్రాబాద్ గ్రామానికి చెందిన చెంచు మణెమ్మ, ఈదయ్య దంపతులు. మణెమ్మ కాన్పు కోసం ఆదివారం తన తల్లితో కలిసి నగరంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా...ప్రతి నెల చెకప్, స్కానింగ్ సంబంధిత రిపోర్టులు లేవన్న కారణంతో అక్కడి వైద్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో నిరాశతో వెనుదిరిగి..ఊరికి వెళ్లేందుకు ఎంజీబీఎస్‌కు వచ్చారు. అదే సమయంలో ఆమెకు నొప్పులు వచ్చాయి. పరిస్థితి గమనించిన ఆర్టీసి అధికారులు, సిబ్బంది బ్లాంకెట్లను తెప్పించి ఆమె చుట్టూ ఏర్పాటు చేశారు. మహిళా సిబ్బంది, తల్లి సహాయంతో మణెమ్మ మగ శిశువుకు జన్మినిచ్చింది. అనంతరం ఆర్టీసి అధికారులు, సిబ్బంది ఇచ్చినసమాచారంతో అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది వైద్యం నిమిత్తం ఆమెను ప్రభుత్వ పేట్ల బురుజు ఆసుపత్రికి తరలించారు. అయితే వారి వద్ద డబ్బులు లేకపోవడంతో కల్వకుర్తి ఏడీసీజి.ఆర్.రెడ్డి, ఎంజీబీఎస్ కంట్రోలర్లు, సిబ్బంది కలిసి కొంత నగదు అందజేసి మానవత్వాన్నిచాటుకున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
కూలీగా మారిన టాలీవుడ్ హీరో
హైదరాబాద్ : టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పోర్టర్ అవతారం ఎత్తాడు. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో మూటలు మోశాడు. హీరో ఏంటి కూలీగా పని చేయటమేంటనుకున్నారా? అసలు విషయానికి వస్తే తన సోదరి మంచు లక్ష్మీప్రసన్న నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమం కోసం అతడు కూలీగా మారాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం మంచు మనోజ్ బరువులు మోశాడు. ఈ సందర్భంగా సంపాదించిన డబ్బులను మేము సైతం కార్యక్రమానికి విరాళంగా ఇచ్చాడు. మరోవైపు మంచు మనోజ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అతడితో సెల్పీలు దిగేందుకు పోటీలు పడ్డారు. కాగా ఇప్పటికే పలువురు సినీ నటీనటులు మేము సైతం కార్యక్రమం కోసం కూరగాయలు అమ్మడం మొదలు పానీపూరి, కారు సర్వీసింగ్, బేకరీలో పని చేసిన విషయం తెలిసిందే.