
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో యూపీఐ, క్యూఆర్ కోడ్ ఆధారంగా టిక్కెట్ బుకింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ఆర్టీసీ తాజాగా జూబ్లీ బస్‌స్టేషన్ (జేబీఎస్)లోనూ అదే తరహా విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు యూపీఐ లేదా క్యూఆర్ కోడ్‌ను వినియోగించి రిజర్వేషన్ టికెట్లు తీసుకోవడంతో పాటు పార్శిల్, కార్గో సేవలను కూడా పొందవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. క్యూఆర్ సేవలపై ఎంజీబీఎస్‌లో ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో ప్రస్తుతం జేబీఎస్‌లో కూడా ఆ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.
చదవండి: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. ఆర్టీసీలో ‘పెళ్లి సందడి’
టీఎస్‌ఆర్టీసీ మరో ముందడుగు.. ప్రయాణికులకు సజ్జనార్ గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment