Jubilee Bus Station
-
జేబీఎస్ మెట్రో స్టేషన్ వద్ద కీచకుడు, యువతితో..
హైదరాబాద్, సాక్షి: నగరంలోని జేబీఎస్ మెట్రో స్టేషన్ వద్ద కీచక పర్వం చోటు చేసుకుంది. ఓ యువతిపై గుర్తు తెలియని యువకుడు లైంగిక దాడికి యత్నించబోయాడు. అయితే యువతి ప్రతిఘటించడంతో ఆ మానవ మృగం అక్కడి నుంచి పారిపోయింది.శుక్రవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం పడింది. ఆ వానకు జేబీఎస్ మెట్రో పరిసరాలు జలమయం అయ్యాయి. ఓ యువతి బస్టాండ్‌కు వెళ్తున్న టైంలో.. అడ్డగించిన ఓ యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. చెయ్యి పట్టుకుని లాగడంతో ఆమె కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వాళ్లు గమనించడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. సీపీటీవీ ఫుటేజీ ఆధారంగా యువకుడిని గుర్తించే పనిలో ఉన్నారు. -
ఓటేసేందుకు ఊరి బాట..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో ఓటేసేందుకు చాలామంది హైదరాబాద్ వాసులు సొంతూళ్ల బాట పట్టారు. పోలింగ్ రోజు గురువారం(నవంబర్30)న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో సొంతూళ్లలో ఓట్లున్నవారు స్వస్థలాలకు పయనమయ్యారు. ఒక్కసారిగా నగర వాసులు సొంతూళ్లకు బయలుదేరడంతో నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్లు రద్దీగా మారాయి. పండగల ముందురోజుల్లో ఉన్నట్లుగా కిక్కిరిసిపోయాయి. బస్సులన్నీ నిండిపోవడంతో సీట్ల కోసం జనం ఎగబడుతున్నారు. ఎలాగైనా ఊరెళ్లి ఓటెయ్యాలన్న ఉద్దేశంతో సీట్లు దొరకకపోయిన బస్సుల్లో నిల్చొని ప్రయాణించేందుకూ సిద్ధమవుతున్నారు. ఓటేసేందుకు స్వచ్ఛంధంగా ఊళ్లకు వెళ్లే వారు కొందరైతే పార్టీల పోల్ మేనేజ్మెంట్ ఎఫెక్ట్‌తో ఊరి బాట పట్టేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఊళ్లలోని ప్రధాన పార్టీల స్థానిక నాయకులు ఫోన్లు చేసి మరీ హైదరాబాద్‌లో ఉంటున్న ఆయా ఊళ్లకు సంబంధించిన వారిని ఓటేసేందుకు రమ్మని పిలుస్తున్నట్లు సమాచారం. దీంతో సొంత నియోజకవర్గాల్లో తమ అభిమాన పార్టీని, నాయకుడిని గెలిపించుకునేందుకు నగరవాసులు స్వస్థలాలకు బయలుదేరారు. హైదరాబాద్‌కు ఉద్యోగ,వ్యాపార రీత్యా, ఇతరకారణాలతో వచ్చి నివసిస్తున్న వారిలో చాలా మందికి నగరంలో ఓటు హక్కు లేదన్న విషయం తెలిసిందే. వీరంతా తమ ఓటును సొంతూళ్లలోనే నమోదు చేయించుకున్నారు. పోలింగ్ రోజు ఓటేయ్యకుండా హైదరాబాద్‌లో ఉండటానికి వీరు సాధారణంగా ఆసక్తి చూపరు. ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లో తమ స్వస్థలాల్లో వినియోగించుకోవాలని చాలా మంది ఊరి బాట పట్టారు. ఇదీచదవండి..తెలంగాణ పోలింగ్‌కు వరుణగండం? -
సంక్రాంతి ఎఫెక్ట్.. బస్టాండులు కిటకిట (ఫొటోలు)
-
TSRTC: జేబీఎస్‌లోనూ యూపీఐ సేవలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో యూపీఐ, క్యూఆర్ కోడ్ ఆధారంగా టిక్కెట్ బుకింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ఆర్టీసీ తాజాగా జూబ్లీ బస్‌స్టేషన్ (జేబీఎస్)లోనూ అదే తరహా విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు యూపీఐ లేదా క్యూఆర్ కోడ్‌ను వినియోగించి రిజర్వేషన్ టికెట్లు తీసుకోవడంతో పాటు పార్శిల్, కార్గో సేవలను కూడా పొందవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. క్యూఆర్ సేవలపై ఎంజీబీఎస్‌లో ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో ప్రస్తుతం జేబీఎస్లో కూడా ఆ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. చదవండి: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. ఆర్టీసీలో ‘పెళ్లి సందడి’ టీఎస్ఆర్టీసీ మరో ముందడుగు.. ప్రయాణికులకు సజ్జనార్ గుడ్‌న్యూస్ -
జేబీఎస్, ఎంజీబీఎస్: బండి పెడితే బాదుడే..
‘బోయిన్‌పల్లికి చెందిన ప్రవీణ్ సిద్ధిపేట సమీపంలోని కొండపాకలో పని చేస్తాడు. ప్రతి రోజు ఉదయం జేబీఎస్ నుంచి బస్సులో వెళ్లి తిరిగి సాయంత్రం నగరానికి చేరుకుంటాడు. అప్పటి వరకు అతని బైక్ జేబీఎస్ పార్కింగ్‌లో ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్కింగ్ చేసినందుకు ప్రతి రోజు రూ.40 వరకు పార్కింగ్ ఫీజు చెల్లించవలసి వస్తుంది. బండి పెట్టాలంటేనే భయమేస్తుంది. ఒక్క నిమిషం తేడా ఉన్నా రూ.10 అదనంగా తీసుకుంటారు. ఇదేమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు..’ అంటూ అతను ఆవేదన వ్యక్తం చేశాడు. సాక్షి, హైదరాబాద్: ఒక్క ప్రవీణ్ మాత్రమే కాదు. జూబ్లీబస్‌స్టేషన్, మహాత్మాగాంధీ బస్స్టేషన్లలో బండి పార్క్ చేస్తే చాలు ప్రయాణికుల జేబులకు చిల్లులు పడాల్సిందే. పార్కింగ్ నిర్వాహకులు అడిగినంతా ఇవ్వలేకపోతే దౌర్జన్యానికి దిగుతున్నారు. పార్కింగ్ ఫీజుల్లో పారదర్శకత కోసం టిమ్స్ యంత్రాలను ప్రవేశపెట్టినప్పటికీ అవి అమలుకు నోచుకోవడం లేదు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ప్రతి నిత్యం దోపిడీకి గురవుతున్నారు. జూబ్లీబస్‌స్టేషన్‌లో ఇటీవల పార్కింగ్ దోపిడీకి గురైన ప్రయాణికుడు ఒకరు సామాజిక మాధ్యమాల్లో సైతం ఆందోళన వ్యక్తం చేశారు. లెక్కల్లో చిక్కులు.. బస్స్టేషన్లలో పార్కింగ్ నిర్వహణ పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. అయితే పార్కింగ్ ఫీజులను మాత్రం ఆర్టీసీ నిర్ణయిస్తుంది. కానీ అమలుపై ఆ సంస్థ నియంత్రణ కోల్పోతోంది. ద్విచక్ర వాహనాలకు 3 గంటలకు రూ.10 చొప్పున, 15 గంటలకు రూ.30 చొప్పున పార్కింగ్ ఫీజుగా వసూలు చేయాలి. ఒక రోజంతా బండిని పార్క్ చేస్తే రూ.50 చెల్లించాలి. కారు పార్కింగ్‌కు మూడు గంటలకు రూ.20, 15 గంటలకు రూ.50, ఒక రోజంతా కారు పార్క్ చేస్తే రూ.75 మాత్రమే తీసుకోవాలి. అయితే ఈ పార్కింగ్ ఫీజులు వాహనదారులకు స్పష్టంగా కనిపించకుండా బోర్డులను పార్కింగ్ స్థలాలకు దూరంగా ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ఏదో హడావిడిలో ఉండే ప్రయాణికులు పెద్దగా పట్టించుకోకుండానే అడిగినంతా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ పార్కింగ్ ఫీజుల గురించి స్పష్టమైన అవగాహనతో నిలదీస్తే మాత్రం బెదిరింపులకు గురి కావలసి వస్తుంది. మరోవైపు పార్కింగ్ గంటల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. మూడు గంటలపైన ఒక నిమిషం గడిచినా అదనంగా రూ.10 చెల్లించాల్సిందే..ప్రయాణికుడు 15 గంటల పాటు బండి నిలిపినప్పుడు మాత్రమే రూ.30 చెల్లించవలసి ఉండగా, ప్రతి మూడు గంటల చొప్పున లెక్కలు వేసి కనీసం రూ.50 వరకు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అలాగే 24 గంటల వ్యవధిలోనూ మార్పులు చేసి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. చర్యలు శూన్యం... బస్స్టేషన్లలో విక్రయించే తినుబండారాలు, వాటర్ బాటిళ్లు, స్నాక్స్, టిఫిన్స్‌తో సహా అన్నింటిపైన అధిక ధరలు వసూలు చేసినా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పార్కింగ్ నిర్వాహకుల దోపిడీపై కూడా చర్యలు శూన్యం. ప్రయాణికులు ఫిర్యాదు చేసిన సందర్భాల్లో మాత్రం నామమాత్రపు జరిమానాలు విధించి వదిలేస్తున్నారు. రేట్లు కనిపించకుండా పెట్టారు జేబీఎస్ లో బండి పార్క్ చేయాలంటే ఆలోచించాల్సి వస్తుంది. రేట్లు కనిపించకుండా ఎక్కడో పైన పెట్టేస్తారు. ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే అదంతే అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతారు. వాళ్లతో గొడవ ఎందుకని అడిగినంతా ఇచ్చి రావాల్సి వస్తోంది. చదవండి: జూబ్లీహిల్స్: లైసెన్స్డ్ గన్‌కు పని చెప్పమంటావా..? బల్దియా చరిత్రలోనే మొదటిసారి.. ప్రతిపక్షాల విమర్శలు -
జూబ్లీ బస్ స్టేషన్‌కు వజ్ర మినీ బస్సులు
‘సాక్షి’ కథనానికి స్పందించిన ఆర్టీసీ సాక్షి, హైదరాబాద్: వజ్ర బస్సులు నష్టాలు తెచ్చిపెడుతుండటంతో ఆర్టీసీ ఒక్కో లోపాన్ని సరిదిద్దుకుంటూ వస్తోంది. బస్టాండ్లకు వెళ్లకుండా కేవలం కాలనీల గుండా మాత్రమే తిప్పాలన్న వింత నిర్ణయానికి ఎట్టకేలకు అధికారులు స్వస్తి పలికారు. వజ్ర బస్సుల్లో వైఫల్యాలు ఎత్తిచూపుతూ అవి బస్టాండ్లకు వచ్చి వెళ్తేనే ప్రయాణికుల ఆదరణ ఉంటుందని పేర్కొంటూ ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కథనం ప్రచురితమైన వెంటనే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అధికారులతో సమీక్షించి ప్రధాన మార్పులుచేర్పులు సూచించారు. ఈ మేరకు మెహిదీపట్నం, దిల్సుఖ్నగర్ల నుంచి నిజామాబాద్ వెళ్లే వజ్ర మినీ బస్సులు ఇక నుంచి జూబ్లీ బస్‌స్టేషన్ వెలుపల ఉండే సిటీ బస్టాప్‌లో ఆగి అక్కడ ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లనున్నట్టు ఆర్టీసీ ఎండీ రమణారావు ప్రకటించారు. మార్గమధ్యంలో ప్రయాణికులు ఆపితే వారిని ఎక్కించుకోవాలని, ప్రధాన బస్టాండ్ల వద్దకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకోవాలన్న ఆయన సూచనలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ఇటీవలే తొలి సూచనను అమలుచేయగా తాజాగా రెండో సూచనను అమలు చేయాలని నిర్ణయించారు. వజ్ర బస్సుల ప్రయాణ సమయాలు నిజామాబాద్ వర్ని చౌరస్తావైపు వెళ్లే బస్సులు ఉదయం 5.50, 8.10, 9.35, 11.10, మధ్నాహ్నం 12 గంటలు, 3.20, సాయంత్రం 5.05, రాత్రి 8.20, 9.15, 9.40 గంటలకు, ముబారక్ నగర్ వైపు వెళ్లే బస్సులు ఉదయం 6.25, 7.35, మధ్నాహ్నం 12.40, 2.35, సాయంత్రం 4.15, 7.10 గంటలకు జూబ్లీ బస్టాండ్ వద్దకు వస్తాయని రమణారావు తెలిపారు. తిరుగు ప్రయాణంలో వర్ని చౌరస్తా వద్ద ఉదయం 6.40, 7.25, 9.20, 11.35 మధ్యాహ్నం 2.05, సాయంత్రం 4.35, 6.45, రాత్రి 8.30, ముబారక్‌నగర్ నుంచి జేబీఎస్‌కు ఉదయం 4.40, 6.00, 9.50, 11.05, మధ్యాహ్నం3.05, సాయంత్రం 4.05, 6.05, 7.55లకు బయలుదేరతాయని తెలిపారు. -
మేము సైతం..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటుహక్కు వినియోగించుకునేందుకు మంగళవారం నగరం నుంచి వేలాది మంది జిల్లావాసులు పల్లెబాట పట్టారు. తమ తమ వృత్తులు, వ్యాపారాల రీత్యా నగరంలో వీరంతా ఓటు వేసేందుకు తమ సొంత ఊళ్లకు బయలుదేరివెళ్లారు. బుధవారం ఎన్నికలు, గురువారం మే డే రోజున సెలవు కూడా కలిసి రావడంతో స్వగ్రామాలకు బయలుదేరారు. రాజధాని నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే వాహనాలు మంగళవారం సాయంత్రం నుంచి కిటకిటలాడాయి. ఆర్టీసీ చాలా బస్సులను పోలింగ్ సిబ్బంది కోసం కేటాయించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. ఎంజీబీఎస్, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి జిల్లాలోని నలుమూలలకు వెళ్లే బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. పోలింగ్ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ విఫలమైంది. కుటుంబాలతో ఇళ్లకు బయలుదేరిన వారు బస్సుల్లేక ప్రత్యామ్నాయ వాహనాలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల కమిషన్ చేసిన విస్త్రృత ప్రచారం కారణంగా ఈసారి ఓటర్లలో చైతన్యం పెరిగింది. దీనికి తోడు రెండు రోజుల వరుస సెలవులు రావడంతో సుదూర ప్రాంత ప్రజలు కూడా స్వస్థలాలకు పయనమయ్యారు. -
బస్టాండులో పసికందు మృతదేహం
సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్లో దారుణం జరిగింది. అక్కడ ఓ బ్యాగులో పసికందు మృతదేహం లభ్యమైంది. కర్రల సంచి పడి ఉండటం, ఎవరూ పట్టించుకోకపోవడంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు దాన్ని చూడగా, అందులో ఒకటి రెండు రోజుల వయసున్న పాప మృతదేహం పడి ఉంది. ఆడపిల్ల పుట్టిందని అక్కడ వదిలేశారా, లేక చనిపోయిన చిన్నారిని బ్యాగులో వదిలేశారా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్లాట్ఫారం నెంబరు 1 వద్దనే ఈ బ్యాగ్ ఉండటంతో అక్కడి నుంచి వెళ్లే బస్సులు ఎక్కాల్సిన ప్రయాణికులు ఎవరో ఆ బ్యాగ్ అక్కడ పెట్టి ఉంటారని భావిస్తున్నారు. మారేడ్‌పల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. శిశువు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
బస్టాండులో పసికందు మృతదేహం
-
పండగ జోరు.. చలో పల్లె‘టూరు’
= సొంతవూళ్లకు తరలిన నగరవాసులు = తెలంగాణ జిల్లాలకే పెద్ద ఎత్తున ప్రయాణం = సమ్మె విరమణతో కదిలిన సీమాంధ్ర బస్సులు = తగ్గిన రైళ్ల రద్దీ.. = తుపాన్‌తో ప్రయాణాల విరమణ = రెండు హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు సాక్షి, సిటీబ్యూరో : నగరం పల్లెబాట పట్టింది. దసరా వేడుకల కోసం నగరవాసులు సొంతవూళ్లకు తరలి వెళ్లారు. గత వారం రోజులుగా కొనసాగుతున్న ప్రయాణాలు శనివారం తార స్థాయికి చేరుకొన్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరుకావడంతో సీమాంధ్ర జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో బస్సులు నగరానికి చేరుకొన్నాయి. దీంతో ఇటీవల వరకు తెలంగాణ జిల్లాలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు చాలా రోజుల తరువాత శనివారం విజయవాడ, కడప, కర్నూలు, తిరుపతి, గుంటూరు తదితర ప్రాంతాలకు తరలి వెళ్లాయి. మరోవైపు నగర శివార్ల నుంచి సైతం ప్రజలు భారీ సంఖ్యలో ఊళ్లకు వెళ్లారు. ఒక్క శనివారమే 900కి పైగా బస్సులు వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ సి.వినోద్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. రెండురోజుల క్రితం వరకు పలుచగా ఉన్న మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లలో సందడి నెలకొంది. మొత్తంగా ఈ ఏడాది సీమాంధ్రలో కొనసాగిన నిరవధిక సమ్మె, నిలిచిపోయిన బస్సుల కారణంగా ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. తెలంగాణ జిల్లాలకు మాత్రమే పెద్దసంఖ్యలో ప్రజలు తరలి వెళ్లారు. పైగా బతుకమ్మ, దసరా వేడుకలకు తెలంగాణలో ఉండే ప్రాధాన్యం దృష్ట్యా ఈ ప్రాంత ప్రజలే ఎక్కువ సంఖ్యలో సొంతవూళ్లకు వెళ్లారు. తెలంగాణ జిల్లాలకు వెళ్లే వాళ్ల కోసం ఆర్టీసీ నాలుగు రోజుల ముందు నుంచే అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, తదితర జిల్లాలకు ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు బస్సులు నడిపారు. మరోవైపు నగర శివార్ల నుంచి సైతం ప్రజలు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాలు, రైళ్లలో వెళ్లారు. మొత్తంగా ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య చాలా వరకు తగ్గింది. సాధారణంగా దసరా, సంక్రాంతి వంటి పర్వదినాల్లో హైదరాబాద్ నుంచి కనీసం 20 నుంచి 30 లక్షల మంది సొంత ఊళ్లకు తరలి వెళితే ఈ ఏడాది 10 నుంచి 15 లక్షల మంది మాత్రమే వెళ్లినట్లు అంచనా. వారిలోనూ తెలంగాణ జిల్లాలదే అగ్రస్థానం. యథావిధిగా ‘ప్రైవేట్’ దోపిడీ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ బస్సులు యథావిధిగా తమ దోపిడీ పర్వాన్ని కొనసాగించాయి. ఆర్టీసీ సమ్మెతో ప్రైవేట్ ఆపరేటర్లకు ఈ ఏడాది కనకవర్షం కురిసింది. అది చాలదన్నట్లు వారు రెట్టింపు చార్జీలు వసూలు చేసి ప్రయాణికులపై నిలువు దోపిడీకి పాల్పడ్డారు. రైళ్లు చాలక, ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణం తప్పనిసరి అనుకున్న ప్రయాణికులు రూ.వేలకు వేలు కుమ్మరించి సొంత ఊళ్లకు వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు ప్రైవేట్ బస్సులే కాకుండా టాటా ఏసీ, ఓమ్ని వ్యాన్లు, మెటాడోర్లు, ట్యాక్సీలు, కార్లు వంటి ప్రైవేట్ వాహనాలు సైతం తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి దోచుకున్నాయి. బాలానగర్, చింతల్ నుంచి నర్సాపూర్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ చార్జీ రూ.35 అయితే, ఈ వాహనాలు ఒక్కొక్కరి దగ్గర రూ.100 చొప్పున వసూలు చేశాయి. ఉప్పల్ నుంచి జనగామ, హన్మకొండ, ఎల్బీనగర్ నుంచి నకిరేకల్, ఖమ్మం, సూర్యాపేట్ తదితర ప్రాంతాలకు వెళ్లిన ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల దారిదోపిడీకి గురయ్యారు. తగ్గిన రైళ్ల రద్దీ గత వారం రోజులుగా ప్రయాణికులతో కిటకిటలాడిన రైళ్లలో శనివారం రద్దీ తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోవడం ఒక కారణమైతే ఫై-లీన్ తుపాన్ ప్రభావం వల్ల పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు కావడంతో చాలామంది ప్రయాణాలు విరమించుకున్నారు. దీంతో సికింద్రాబాద్ రిజర్వేషన్ కార్యాలయం వద్ద టికెట్ల రద్దు కోసం వచ్చినవారి సంఖ్య ఎక్కువగా కనిపించింది. తుపాన్ ప్రభావం వల్ల రద్దయిన, పాక్షికంగా రద్దయిన, దారి మళ్లిన రైళ్ల వివరాలను తెలుసుకొనేందుకు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో అధికారులు రెండు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక హెల్ప్లైన్లను అందుబాటులోకి తెచ్చారు. సికింద్రాబాద్ హెల్ప్‌లైన్ : 040-27700868 నాంపల్లి హైల్ప్‌లైన్ : 040-23200865