సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్లో దారుణం జరిగింది. అక్కడ ఓ బ్యాగులో పసికందు మృతదేహం లభ్యమైంది.
సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్లో దారుణం జరిగింది. అక్కడ ఓ బ్యాగులో పసికందు మృతదేహం లభ్యమైంది. కర్రల సంచి పడి ఉండటం, ఎవరూ పట్టించుకోకపోవడంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు దాన్ని చూడగా, అందులో ఒకటి రెండు రోజుల వయసున్న పాప మృతదేహం పడి ఉంది. ఆడపిల్ల పుట్టిందని అక్కడ వదిలేశారా, లేక చనిపోయిన చిన్నారిని బ్యాగులో వదిలేశారా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్లాట్ఫారం నెంబరు 1 వద్దనే ఈ బ్యాగ్ ఉండటంతో అక్కడి నుంచి వెళ్లే బస్సులు ఎక్కాల్సిన ప్రయాణికులు ఎవరో ఆ బ్యాగ్ అక్కడ పెట్టి ఉంటారని భావిస్తున్నారు. మారేడ్పల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. శిశువు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.