జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ వద్ద కీచకుడు, యువతితో.. | Hyderabad Crime: Man Try To Molest Girl At JBS Bus Stand, Check News Details Inside | Sakshi
Sakshi News home page

జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ వద్ద కీచకుడు, యువతితో..

Published Fri, Aug 16 2024 8:38 PM | Last Updated on Sat, Aug 17 2024 10:07 AM

Hyderabad Crime: Man Try To Molest Girl At JBS Bus Stand

హైదరాబాద్‌, సాక్షి: నగరంలోని జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ వద్ద కీచక పర్వం చోటు చేసుకుంది. ఓ యువతిపై గుర్తు తెలియని యువకుడు లైంగిక దాడికి యత్నించబోయాడు. అయితే యువతి ప్రతిఘటించడంతో ఆ మానవ మృగం అక్కడి నుంచి పారిపోయింది.

శుక్రవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం పడింది. ఆ వానకు జేబీఎస్‌ మెట్రో పరిసరాలు జలమయం అయ్యాయి. ఓ యువతి బస్టాండ్‌కు వెళ్తున్న టైంలో.. అడ్డగించిన ఓ యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. చెయ్యి పట్టుకుని లాగడంతో ఆమె కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వాళ్లు గమనించడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఫిర్యాదు నమోదు  చేసుకున్న పోలీసులు.. సీపీటీవీ ఫుటేజీ  ఆధారంగా యువకుడిని గుర్తించే పనిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement