నిందితుడు సుమిత్
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి అత్యాచారం ఘటన మరువక ముందే మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దారుణం చోటుచేసుకుంది. మంగళహాట్‌లోని మాంగాలరు బస్తీలో తొమ్మిదేళ్ల చిన్నారిని సుమిత్ అనే దుర్మార్గుడు ఖాళీగా ఉన్న షెటర్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు.
చిన్నారి అరుపులు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే వారు షెట్టర్ వద్దకు చేరుకున్నారు. వారిని చూడగానే నిందితుడు సుమిత్ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో బాధితురాలిని స్థానికులు రక్షించారు. కాగా, నిందితుడు సుమిత్‌ను లంగర్ హౌస్‌లో అత్తాపూర్‌లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వాచ్‌మెన్ కూతురు పట్ల అసభ్య ప్రవర్తన
బంజారాహిల్స్: వాచ్‌మెన్ కూతుళ్లపై ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బంజారాహిల్స్‌లో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 12వ తేదీన సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని విష్ణు బ్లూ లోటస్ అపార్ట్‌మెంట్స్ సమీపంలో నివసించే ఓ వాచ్‌మెన్ ఇంటి వద్దకు ఓ యువకుడు బైక్ వచ్చాడు. అక్కడే ఉన్న వాచ్‌మెన్ కుమారుడిని అడిగి బాత్రూంకు వెళ్ళాడు.
అనంతరం బాత్రూం నుంచి బయటకు వస్తూ.. అక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న వాచ్‌మన్ కూతుళ్ల వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ ఇద్దరు బాలికలు భయపడి గదిలోకి వెళ్లగా.. ఆ యువకుడు కూడా గదిలోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో వారు పెద్దగా కేకలు వేశారు. దీంతో ఆ యువకుడు అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ అపార్ట్‌మెంట్ సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ మేరకు అపార్ట్‌మెంట్ యజమాని ఖాజా ఆసిఫ్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు గుర్తు తెలియని యువకుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment