
మృతి చెందిన ఫసీఖాన్, మోసిన్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంజీబీఎస్ బస్సు స్టేషన్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఫసీఖాన్ (19), మోసిన్ (23)లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై ఓ ఫంక్షన్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి ఒక్కసారిగా కింద పడ్డారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఓ లారీ వారిపై నుంచి దూసుకెళ్లింది.
దాంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరు యువకులు చాదర్‌ఘాట్ ముసానగర్ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాల మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
చదవండి: వివాహేతర సంబంధం: యువకుడి హత్య!
Comments
Please login to add a commentAdd a comment