Two Youngsters
-
తల్లి, భార్య వారించినా వినకుండా పార్టీకి వెళ్లి.. ఒక్క నిమిషమైతే!
నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే పోలీసులు అవగాహన కల్పించినా.. ఇంట్లో తల్లి ఎంతగా వారించినా.. ఫోన్లో భార్య ఎంత వేడుకున్నా.. వినకుండా బయట పార్టీకి వెళ్లారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికిన తర్వాత మృత్యువును కూడా ఆహ్వానించారు. బైక్‌ను వేగంగా నడపడం వల్ల అదుపుతప్పి ఓ దుకాణంలోకి దూసుకుపోగా.. దానిపై ఉన్న ఇద్దరు యువకులు కిందపడి తలలకు గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. సాక్క్షి, ఖమ్మం: చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులుగా ఉన్న వారిద్దరూ మృత్యువులోనూ బంధం వీడలేదు. నూతన సంవత్సరం ప్రారంభం రోజు ఎంతో ఆనందాన్ని నింపాల్సిన ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. తాము చెప్పినట్లు విని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని ఆ యువకుల కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు అక్కడివారిని తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన రఘునాథపాలెం గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నగరంలోని పాండురంగాపురం గ్రామంలో పెయింటింగ్ కార్మికుడిగా పనిచేస్తున్న కట్ల పుల్లారావు (24), రఘునాథపాలెంలో నివాసం ఉండే, ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న (గతంలో ఇతను కూడా పెయింటింగ్ పనిచేసేవాడు) సాయి (25) ఇద్దరు స్నేహితులు. 2022 ఏడాది చివరి రోజు కాబట్టి తోటి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బయటకు వెళ్లి పార్టీ చేసుకున్నారు. అనంతరం పుల్లారావు తన ద్విచక్రవాహనంపై సాయిని ఇంటి వద్ద దించేందుకు రఘునాథపాలెం చేరుకున్నాడు. సెంటర్లో వేగంగా బైక్ నడుపుతూ అదుపుతప్పి ఓ దుకాణం మెట్లను ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు కిందపడ్డారు. వారి తలలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలియగానే రఘునాథపాలెం ఎస్ఐ ఎం.రవి సిబ్బందితో అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ శ్రీనివాస్ సందర్శించారు. పెళ్లి అయి ఏడాదే.. పుల్లారావుకు వెన్నెల అనే యువతితో ఏడాది కిందటే వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. గత నెల 29న వెన్నెల తన పుట్టింటికి వెళ్లింది. తన భర్త పార్టీకి వెళ్తున్నట్లు గ్రహించిన ఆమె తన అత్తకు ఫోన్ చేసి పార్టీకి వెళ్లకుండా ఆపాలని వేడుకుంది. పుల్లారావుకూ ఫోన్ ద్వారా చెప్పింది. అయినా పుల్లారావు తన తల్లి, భార్య మాట వినకుండా బయటకు వెళ్లి వారు సందేహించినట్లుగానే మృత్యువాడ పడి తీరని శోకాన్ని మిగిల్చాడు. ఒక్క నిమిషమైతే.. ఇదే ప్రమాదంలో మరణించిన సాయి.. ఒక్క నిమిషమైతే ఇంటికి చేరుకునేవాడే. ఇంటికి అడుగుల దూరంలోనే ప్రమాదం జరిగి అతడు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక్క నిమిషం సవ్యంగా వచ్చి ఉంటే ఇంట్లోకి చేరుకునే వాడని అతడి కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. కాగా, సాయి రెండేళ్ల కిందట ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. రెండు నెలల కిందట అతడికి పాప పుట్టింది. యువత ఆలోచనలో మార్పు మారాలి.. డిసెంబర్ 31న మిత్రులతో కలిసి పార్టీలు చేసుకోవడం.. మద్యం మత్తులో అతివేంగా వాహనాలపై రాకపోకలు సాగించడం.. లాంటివి చేయొద్దని పదే పదే ప్రచారం చేశాం. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోషల్ మీడియా, పత్రికల ద్వారా అవగాహన కల్పించాం. ప్రధాన రోడ్ల వెంట భారీగా పెట్రోలింగ్ చేపట్టాం. అయినా ప్రమాదం జరగడం బాధాకరం. ఇలాంటి ఘటనలు చూసైనా యువత ఆలోచనలో మార్పు రావాలి. నియంత్రిత వేగంతో బైక్‌లు నడపటంతోపాటు హెల్మెట్ కచ్చితంగా ధరించాలి. – శ్రీనివాస్, రూరల్ సీఐ -
ప్రాణం తీసిన గుంత.. పాతబస్తీ యువకుల దుర్మరణం
-
దారుణం: రోడ్డుపై గుంతను తప్పించబోయి..
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంజీబీఎస్ బస్సు స్టేషన్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఫసీఖాన్ (19), మోసిన్ (23)లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై ఓ ఫంక్షన్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి ఒక్కసారిగా కింద పడ్డారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఓ లారీ వారిపై నుంచి దూసుకెళ్లింది. దాంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరు యువకులు చాదర్‌ఘాట్ ముసానగర్ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాల మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. చదవండి: వివాహేతర సంబంధం: యువకుడి హత్య! -
గోదారమ్మ మింగేసింది
♦ పర్ణశాల వద్ద గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు ♦ కొనసాగుతున్న గాలింపు పర్ణశాల(భద్రాచలం)/జూలూరుపాడు(వైరా): వినాయక నిమజ్జనం.. విషాదాన్నిమిగిల్చింది. పర్ణశాల వద్ద గోదావరిలో మంగళవారం ఉదయం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గాలింపు కొనసాగుతోంది. ఎలా జరిగింది? జూలురుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామస్తులు దాదాపుగా 40మంది కలిసి వినాయకుక విగ్రహంతో భద్రాచలం వద్ద గోదావరి వద్దకు సోమవారం సాయంత్రం వెళ్లారు. విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఆ తరువాత అందరూ కలిసి పర్ణశాల చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే బస చేశారు. ఉదయం స్నానాలు చేసేందుకు గోదావరి అవతలి ఒడ్డుకు బోటుపై వెళ్లారు. అక్కడ స్నానాలు చేస్తుండగా పాపిని శ్రీకాంత్(22) లోతుకు వెళ్లాడు. అతడికి ఈత రాదు. నీట మునిగిపోతూ భయంతో గట్టిగా అరవసాగాడు. అతడిని కాపాడేందుకని దుర్గారావు అనే యువకుడు వెళ్లాడు. ఇంతలో.. శ్రీకాంత్‌ను కాపాడుదామన్న ఆతృతతో బోగి వినయ్‌కృష్ణ(22) కూడా నీటిలోకి వెళ్లాడు. తనకు ఈత రాదన్న విషయాన్ని ఆ క్షణాన అతడు మరిచిపోయినట్టున్నాడు. వినయ్‌కృష్ణ కూడా నీట మునిగిపోతున్నాడు. వీరిద్దరినీ కాపాడేందుకు దుర్గారావు శాయశక్తులా ప్రయత్నించాడు. ఒక్కడికి సాధ్యపడలేదు. అప్పటికే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ ఇద్దరూ నీట మునిగిపోయారు. దుర్గారావు నిరాశగా వెనుదిరిగాడు. శ్రీకాంత్, వినయ్‌కృష్ణ.. వరసకు అన్నదమ్ములు. ఒడ్డున ఉన్న కుటుంబీకులు, బంధువులు, మిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రదేశాన్ని భద్రాచలం ఆర్డీవో శివనారాయణ రెడ్డి, ఎస్ఐ బాలకృష్ణ పరిశీలించారు. గల్లంతైన ఆ ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు మంగళవారం సాయంత్రం వరకు గాలిస్తూనే ఉన్నారు. పడమట నర్సాపురంలో విషాదం గల్లంతైన ఈ ఇద్దరు యువకులది జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం కాలనీ. వీరిద్దరూ తాపీ మేస్త్రీలు. వినాయక ఉత్సవ కమిటీలోని 14 మంది సభ్యుల్లో వీరిద్దరు కూడా ఉన్నారు. వినయ్కృష్ణతోపాటు, అతని భార్య మౌనిక, సోదరి ఉమామణి కూడా వెళ్లారు.కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు మరో 25మందికి పైగా ఉన్నారు. భద్రాచలంలో నిమజ్జనం అనంతరం పర్ణశాల వెళ్లారు. అక్కడ ఈ దుర్ఘటన జరిగింది. వినయ్‌కృష్ణ, శ్రీకాంత్ వరుసకు సోదరులే కాదు.. మంచి మిత్రులు కూడా. ఏ కార్యానికైనా వీరిద్దరి కుటుంబీకులు, బంధువులు, మిత్రులు కలిసే వెళ్లొస్తుంటారు. ఈ ఇద్దరు గల్లంతవడంతో పడమట నర్సాపురం కాలనీలో విషాదం అలుముకుంది. కుటుంబ నేపథ్యం.. బోగి వినయ్‌కృష్ణ: తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, కళావతి దంపతులకు ఇద్దరు సంతా నం... వినయ్‌కృష్ణ, ఉమారాణి. ఇద్దరూ వివాహితులే. ఒక్కడే కొడుకవడంతో చిన్నప్పటి నుంచి విడిచి పెట్టి ఉండేవారు కాదు. ఏడాదిన్నర క్రితం కాకర్ల గ్రామానికి చెందిన మౌనికతో వినయ్కృష్ణకు వివాహమైంది. వినయ్‌కృష్ణ, భార్య మౌని క, తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, కళావతి కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నారు. కొడుకు గోదావరిలో గల్లంతైన విషయాన్ని ఇంటి వద్దనే ఉన్న ఆ తల్లిదండ్రులకు బంధువులు రాత్రి వరకు తెలియనివ్వలేదు. పాపిన్ని శ్రీకాంత్: శంకర్, నాగమణి దంపతులకు ఇద్దరు సంతానం... లక్ష్మీనారాయణ, శ్రీకాంత్. అవివాహితుడైన శ్రీకాంత్, సుతారి మేస్త్రీ పనితో కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. కొడుకు గల్లంతయ్యాడన్న వార్తతో తల్లిదండ్రులు శంకర్, నాగమణి గుండెలవిసేలా రోదిస్తూ, తట్టుకోలేక కిందపడి బొర్లారు. కొద్ది క్షణాల్లోనే స్పృహ కోల్పోయారు. క్షణాల్లో జరిగిపోయింది.. ‘‘మాలో కొందరు ఇప్పటివరకూ పర్ణశాల చూడలేదు. చూద్దామనుకున్నాం. అందరం కలిసి వచ్చాం. స్నానాలు చేయడానికి అవతలి ఒడ్డు బాగుంటుందని వెళ్లాం. ఆడవారు ఒకవైపు, మగవారు మరోవైపు స్నానాలు చేస్తున్నారు. ఇంతలో అరుపులు వినిపించాయి. ఏం జరిగిందోనని భయంతో వెళ్లాం. అప్పటికే నీటి ప్రవాహంలో శ్రీకాంత్, వినయ్‌కృష్ణ కొట్టుకుపోయారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది’’ అని చెప్పింది బోడ వరలక్ష్మి. గల్లంతైన శ్రీకాంత్, వినయ్కృష్ణకు ఈమె బంధువు. ఈ పాపం ఎవరిది..? పర్ణశాల(భద్రాచలం): గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు పాపం ఎవరిది? నిబంధనలను గాలికొదిలేసిన బోటు షికారు యజమానులది. దీనిని పట్టించుకోని అధికారులది. గోదావరిలో ఫెర్ర్రీ వేలం పాటను కొన్ని నియమ నిబంధనలతో పంచాయతీ నిర్వహిస్తోంది. అన్ని బోట్లకు లైసెన్స్ ఉండాలని, పరిమితికి మించి ఎక్కించవద్దని, బోటులోని అందరికీ సేఫ్టీ జాకెట్ ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. బోటు షికారు ఎప్పుడెప్పుడు.. ఎంత దూరం చేయాలి? ఇవేవీ బోటు యజమానులు పట్టించుకోవడం లేదు. పర్ణశాలలోని బోట్ యజమానులు పరిమితికి మించిన సంఖ్యలో పర్యాటకులను ఎక్కించుకుంటున్నారు. సేఫ్టీ జాకెట్లు ఇవ్వడం లేదు. తమ వ్యాపారం కోసం ‘‘స్నానాలు చేయడానికి అవతల ఒడ్డు చాలా బాగుంటుంది’’ అని పర్యాటకులను మభ్యపెడుతున్నారు. అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులేవీ లేకపోవడం, జాగ్రత్తలు చెప్పేవారు లేకపోవడంతో పర్యాటకులకు ప్రాణాపాయం ఏర్పడుతోంది. -
విద్యుదాఘాతానికి ఇద్దరు యువకులు బలి
వనస్థలిపురం (హైదరాబాద్) : జెండా కర్రను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురంలోని ఎన్జీవోస్ కాలనీలో కాశీరెడ్డి, ప్రశాంత్ రెడ్డి అనే ఇద్దరు యువకులు జెండాపైపును తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పైన ఉన్న విద్యుత్ వైర్లకు పైపు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహితపై ఇద్దరు యువకుల అత్యాచారం