జెండా కర్రను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
వనస్థలిపురం (హైదరాబాద్) : జెండా కర్రను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురంలోని ఎన్జీవోస్ కాలనీలో కాశీరెడ్డి, ప్రశాంత్ రెడ్డి అనే ఇద్దరు యువకులు జెండాపైపును తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పైన ఉన్న విద్యుత్ వైర్లకు పైపు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.