
పానీపూరీ అమ్మిన హీరో మంచు విష్ణు
హైదరాబాద్ : హీరో మంచు విష్ణు శుక్రవారం కూకట్పల్లిలో పానీపూరీ అమ్మాడు. విష్ణు ఏంటీ పానీపూరీ అమ్మడం ఏంటానుకుంటున్నారా?. అసలు విషయానికి వస్తే విష్ణు సోదరి లక్ష్మి ప్రసన్న నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమం కోసం విష్ణు పానీపూరీ అమ్మాల్సి వచ్చింది. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులను ‘మేము సైతం’ ద్వారా నిర్వహించనున్న సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు.
కాగా గతంలో ‘మేము సైతం’ కార్యక్రమానికి సహాయం నిమిత్తం సినీ నటులు శ్రియ, రకుల్ ప్రీతి సింగ్, రెజీనా, దగ్గుబాటి రానా, మోహన్ బాబు, అఖిల్ అక్కినేని, నానీ, రవితేజ, యాంకర్ సుమ తదితరులు తమ వంతు సాయం చేసిన విషయం తెలిసిందే.