panipoori
-
డాన్సింగ్ పానీపూరి.. ఎగబడితింటున్న జనం.. ఇదేం పనంటూ నెటిజన్స్ ఫైర్!
కోటి విద్యలు కూటి కొరకు అన్న సామెత అందరికి తెలసిందే. రుచి, శుచితో కూడిన ఆహారానికి దేశంలో యమ డిమాండ్ ఉంది. అందుకే ఫుడ్ బిజినెస్‌లోకి ప్రజలు అడుగుపెడుతున్నారు. ఈ వ్యాపారంలో పిల్లలు నుంచి పెద్దలు వరకు ఎంతో ఇష్టంగా తినే చిరుతిండి పానీపూరికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిరుతిండి టేస్ట్ ఉంటే చాలు ప్రజలు అక్కడవాలిపోతారు. అందుకే వీధి వ్యాపారులు కేవలం రుచితో మాత్రమే కాకుండా అనేక వైవిధ్యాలతో ముందుకు వస్తూ.. కస్టమర్లను ఆకర్షిస్తూ తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి రుచితో పాటు కాస్త భిన్నంగా పానీపూరి అమ్ముతున్నాడు. ప్రస్తుతం అతని వీడియో వైరల్‌గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక వీధి వ్యాపారీ సందడిగా ఉండే ట్రిపోలియా బజార్లో తోపుడు బండి మీద పానీపూరి అమ్ముతున్నాడు. అయితే అతను కేవలం టేస్ట్‌తోనే కాకుండా కాస్త వెరైటీని తన వ్యాపారంలో జోడించాడు. తన వద్దకు వచ్చే కస్టమర్లకు.. డ్యాన్స్ చేస్తూ పానీపూరిని అందిస్తూ మరింత మంది కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ఆ వీడియో వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో, వీధి వ్యాపారి తన ఒట్టి చేతులతో పానీ పూరీని కలపడం, పూరీలను నింపడం డ్యాన్స్ చేస్తూ కస్టమర్లకు అందిస్తుంటాడు. అతను తన ముక్కును గీసుకున్న తర్వాత పానీ పూరి నీటిలో తన చేతులను ఉంచడం కూడా అందులో కనిపిస్తుంది. అనంతరం అదే చేతితో వినియోగదారులకు గోల్గప్ప అందించే ముందు తన చేతితో రుచి చూస్తాడు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ వ్యాపారి వద్ద విశిష్టమైన వడ్డించే విధానం ఉన్నప్పటికీ, రుచితో పాటు శుచితో కూడిన ఆహారాన్ని ఇవ్వడం మరిచిపోయాడని మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by Swag Se Doctor (@swagsedoctorofficial) చదవండి: Video: బైక్‌పై లవర్స్ రొమాన్స్.. అందరిముందే హగ్‌లతో రెచ్చిపోయిన జంట -
పానీపూరి తిని 100 మందికి అస్వస్థత!
కోల్‌కతా: పానీపూరి అంటే చాలా మంది ఇష్టపడతారు. లొట్టలేసుకుంటూ తింటారు. వీధుల్లో పానీపూరి బండి కనిపించిందంటే చాలు.. నోట్లో నీళ్లురూతాయి. అయితే, అదే పానీపూరి 100 మందికిపైగా ప్రాణాల మీదకు తెచ్చింది. స్ట్రీట్ స్టాల్లో పానీపూరి తిని మూడు గ్రామాల్లో 100 మందికిపైగా అస్వస్థతకు గురైన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని సుగంధ గ్రామపంచాయతీ పరిధి డొగచియాలో ఓ వీధి బండి వద్ద బుధవారం చాలా మంది పానీపూరి తిన్నారు. వారిలో దాదాపు అందరు సాయంత్రానికి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. నీటి కాలుష్యం వల్ల కలిగే డయేరియాగా వైద్యులు అనుమానిస్తున్నారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని ఔషధాలు అందించారు. పలువురు తీవ్రంగా ప్రభావితమైన క్రమంలో ఆసుపత్రిలో చేరాలని సూచించారు. అస్వస్థతకు గురైన వారిలో డొగచియా, బహిర్ రనగచా, మకల్టాలా గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ఇదీ చదవండి: Actress Kamya Punjabi: పానీపూరి మైకంలో లక్ష రూపాయలు మరిచిపోయిన నటి.. -
పానీపూరీ తిని 77 మందికి అస్వస్థత.. వాంతులు, కడుపులో తిప్పడంతో..
చంఢీగడ్: బయట దొరికే చిరుతిండిలో ఎక్కువ మంది ఇష్టపడి మరీ తినేది ఏదని అడిగితే టక్కున చెప్పే పేరు పానీపూరీ. అయితే కొందరు మాత్రం నాణ్యత లేకుండా, తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్‌మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పానీపూరీ తినడం వల్ల కొంత మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని గటపార్ కాలా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నిర్వహించే మార్కెట్లో పానీపూరీ తినడం వల్ల 77 మంది అనారోగ్యం పాలైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వీరిలో 57 మంది చిన్నారులు కూడా ఉన్నారు. తొలుత వారిని మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లిన అధికారులు, మెరుగైన చికిత్స కోసం పెండ్రి ప్రాంతంలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో 26 మందిని బుధవారం ఉదయం డిశ్చార్జ్ చేయగా, మిగిలిన వారిని వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. వారిని పరీక్షించిన వైద్యులు ఫుడ్ పాయిజనింగ్ జరగడం వల్లే అస్వస్థత పాలైనట్లు అధికారులకు వివరించారు. ఈ ఘటనపై విచారణ జరపనున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: Priyanka Gandhi Vadra: అమ్మాయిలకు స్మార్ట్ఫోన్లు, స్కూటీలు -
పానీపూరీ అమ్మిన హీరో..
-
పానీపూరీ అమ్మిన హీరో మంచు విష్ణు
హైదరాబాద్ : హీరో మంచు విష్ణు శుక్రవారం కూకట్‌పల్లిలో పానీపూరీ అమ్మాడు. విష్ణు ఏంటీ పానీపూరీ అమ్మడం ఏంటానుకుంటున్నారా?. అసలు విషయానికి వస్తే విష్ణు సోదరి లక్ష్మి ప్రసన్న నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమం కోసం విష్ణు పానీపూరీ అమ్మాల్సి వచ్చింది. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులను ‘మేము సైతం’ ద్వారా నిర్వహించనున్న సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. కాగా గతంలో ‘మేము సైతం’ కార్యక్రమానికి సహాయం నిమిత్తం సినీ నటులు శ్రియ, రకుల్ ప్రీతి సింగ్, రెజీనా, దగ్గుబాటి రానా, మోహన్ బాబు, అఖిల్ అక్కినేని, నానీ, రవితేజ, యాంకర్ సుమ తదితరులు తమ వంతు సాయం చేసిన విషయం తెలిసిందే.