Dancing Golgappa Video: Street Vendors Serving Unhygienic Pani Puri To People Jaipur - Sakshi
Sakshi News home page

డాన్సింగ్‌ పానీపూరి.. ఎగబడితింటున్న జనం.. శు‘ఛీ’ శుభ్రత పట్టించుకోరే!

Published Thu, Jun 22 2023 7:07 PM | Last Updated on Thu, Jun 22 2023 8:40 PM

Street Vendors Serving Unhygienic Pani Puri To People Jaipur - Sakshi

కోటి విద్యలు కూటి కొరకు అన్న సామెత అందరికి తెలసిందే. రుచి, శుచితో కూడిన ఆహారానికి దేశంలో యమ డిమాండ్‌ ఉంది. అందుకే ఫుడ్‌ బిజినెస్‌లోకి ప్రజలు అడుగుపెడుతున్నారు. ఈ వ్యాపారంలో పిల్లలు నుంచి పెద్దలు వరకు ఎంతో ఇష్టంగా తినే చిరుతిండి పానీపూరికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిరుతిండి టేస్ట్‌ ఉంటే చాలు ప్రజలు అక్కడవాలిపోతారు. అందుకే వీధి వ్యాపారులు కేవలం రుచితో మా​త్రమే కాకుండా అనేక వైవిధ్యాలతో ముందుకు వస్తూ.. కస్టమర్లను ఆకర్షిస్తూ తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు.

తాజాగా ఓ వ్య​క్తి రుచితో పాటు కాస్త భిన్నంగా పానీపూరి అమ్ముతున్నాడు. ప్రస్తుతం అతని వీడియో వైరల్‌గా మారి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక వీధి వ్యాపారీ సందడిగా ఉండే ట్రిపోలియా బజార్‌లో తోపుడు బండి మీద పానీపూరి అమ్ముతున్నాడు. అయితే అతను కేవలం టేస్ట్‌తోనే కాకుండా కాస్త వెరైటీని తన వ్యాపారంలో జోడించాడు. తన వద్దకు వచ్చే కస్టమర్లకు.. డ్యాన్స్ చేస్తూ పానీపూరిని అందిస్తూ మరింత మంది కస్టమర్‌లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు.  ఇటీవల ఆ వీడియో వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

ఆ వీడియోలో, వీధి వ్యాపారి తన ఒట్టి చేతులతో పానీ పూరీని కలపడం, పూరీలను నింపడం డ్యాన్స్ చేస్తూ కస్టమర్లకు అందిస్తుంటాడు. అతను తన ముక్కును గీసుకున్న తర్వాత పానీ పూరి నీటిలో తన చేతులను ఉంచడం కూడా అందులో కనిపిస్తుంది. అనంతరం అదే చేతితో వినియోగదారులకు గోల్‌గప్ప అందించే ముందు తన చేతితో రుచి చూస్తాడు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ వ్యాపారి వద్ద విశిష్టమైన వడ్డించే విధానం ఉన్నప్పటికీ, రుచితో పాటు శుచితో కూడిన ఆహారాన్ని ఇవ్వడం మరిచిపోయాడని మండిపడుతున్నారు. 

చదవండి: Video: బైక్‌పై లవర్స్‌ రొమాన్స్‌.. అందరిముందే హగ్‌లతో రెచ్చిపోయిన జంట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement