కోల్‌కతా: పానీపూరి అంటే చాలా మంది ఇష్టపడతారు. లొట్టలేసుకుంటూ తింటారు. వీధుల్లో పానీపూరి బండి కనిపించిందంటే చాలు.. నోట్లో నీళ్లురూతాయి. అయితే, అదే పానీపూరి 100 మందికిపైగా ప్రాణాల మీదకు తెచ్చింది. స్ట్రీట్ స్టాల్‌లో పానీపూరి తిని మూడు గ్రామాల్లో 100 మందికిపైగా అస్వస్థతకు గురైన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లాలో వెలుగు చూసింది.
జిల్లాలోని సుగంధ గ్రామపంచాయతీ పరిధి డొగచియాలో ఓ వీధి బండి వద్ద బుధవారం చాలా మంది పానీపూరి తిన్నారు. వారిలో దాదాపు అందరు సాయంత్రానికి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. నీటి కాలుష్యం వల్ల కలిగే డయేరియాగా వైద్యులు అనుమానిస్తున్నారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని ఔషధాలు అందించారు. పలువురు తీవ్రంగా ప్రభావితమైన క్రమంలో ఆసుపత్రిలో చేరాలని సూచించారు. అస్వస్థతకు గురైన వారిలో డొగచియా, బహిర్ రనగచా, మకల్టాలా గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు.
ఇదీ చదవండి: Actress Kamya Punjabi: పానీపూరి మైకంలో లక్ష రూపాయలు మరిచిపోయిన నటి..
Comments
Please login to add a commentAdd a comment