
తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'గతంలో మన హీరోలు మగాళ్లు కారు.. హీరోలకు దమ్ములేదంటూ' వ్యాఖ్యానించిన ఆయన తాజాగా... ఫిలింపేర్ కోసం ఎగేసుకుని వెళ్లే ఆర్టిస్టులు ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల కార్యక్రమాలకు మాత్రం రావటం లేదని అన్నారు.
చిత్తూరులో గాయకుడు బాలసుబ్రమణ్యం ఒక్కరే గంట ప్రోగ్రామ్ చేస్తే రూ.కోటి వచ్చిందని...ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కలిసి 'మేము సైతం' కార్యక్రమం చేసినా రూ.8 కోట్లు కూడా రాలేదని తమ్మారెడ్డి భరద్వాజ వాపోయారు. ఇటువంటి కార్యక్రమాలకు హీరోలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి... కానీ బతిమిలాడుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం చిత్ర పరిశ్రమ పెద్దలు తెలంగాణ మంత్రి కేటీఆర్ను కలిశారని.. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని తమ్మారెడ్డి పేర్కొన్నారు.