Pilla nuvvu leni jeevitham
-
హిట్ కాంబినేషన్లో మరో సినిమా
చాలా కాలం తరువాత సక్సెస్ ట్రాక్ ఎక్కిన దర్శకుడు ఎయస్ రవికుమార్ చౌదరి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తొలి సినిమాగా విడుదలైన 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాతో మంచి సక్సెస్ సాధించిన రవికుమార్ చౌదరి వరుసగా యంగ్ హీరోలతో సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా 'సౌఖ్యం' సినిమాను తెరకెక్కిస్తున్న రవికుమార్ చౌదరి ఆ సినిమా పూర్తవ్వగానే కళ్యాణ్ రామ్ హీరోగా మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే మరో సినిమాను కూడా ఫైనల్ చేశాడు రవికుమార్ చౌదరి. 'పిల్లా నువ్వులేని జీవితం' లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన అదే కాంబినేషన్లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను కూడా దిల్‌రాజు నిర్మించనున్నాడు. గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న 'సౌఖ్యం' సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. జనవరి నుంచి కళ్యాణ్‌రామ్ సినిమాను ప్రారంభించి సమ్మర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరోసారి సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. -
విమర్శలా నాకేం తెలియదు: సాయి ధరంతేజ్
తిరుమల : సినీనటుడు సాయి ధరంతేజ్ శుక్రవారం తిరుమల విచ్చేశాడు. ఈరోజు తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శనంలో అతను వెంకన్న దర్శనం చేసుకున్నాడు. దర్శనం అనంతరం సాయి ధరంతేజ మీడియాతో మాట్లాడుతూ త్వరలో దిల్ రాజు బ్యానర్లో హరీష్ శంకర్ దర్శకత్వం వస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పాడు. అలాగే 'రేయ్' చిత్రంపై ఆ చిత్ర నిర్మాత వైవీఎస్ చౌదరే స్వయంగా ప్రకటన చేస్తారని తెలిపాడు. కాగా 'మేము సైతం' కార్యక్రమంపై దర్శక, నిర్మాత తమ్మారెడ్డి వ్యాఖ్యలపై తనకేమీ తెలియదని...విలేకర్లు అడిగిన ప్రశ్నకు సాయి ధరంతేజ్ సమాధానమిచ్చాడు. మంచి విషయం కోసం ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని...అయితే విమర్శలు గురించి తనకు తెలియదని, వాటిని పట్టించుకోనని తెలిపాడు. తాను కూడా మేము సైతం కార్యక్రమంలో డాన్స్ ఫెర్మామెన్స్ ఇచ్చినట్లు చెప్పాడు. ఈ సందర్భంగా సాయి ధరంతేజ్తో ఫోటోలు దిగేందుకు, షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు పలువురు పోటీ పడ్డారు. సాయి ధరంతేజ్ హీరోగా నటించిన 'పిల్ల నువ్వేలేని జీవితం' సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. -
మేకింగ్ ఆఫ్ మూవీ - పిల్లా నువ్వు లేని జీవితం
-
ముగ్గురు మావయ్యల ముద్దుల మేనల్లుడ్ని..
ఒక వైపు నుంచి పవర్ స్టార్,ఇంకో వైపు నుం చి మెగా స్టార్, మరో వైపు నుంచి మెగా బ్రదర్....ఈ వర్ణన అంతా ఎవరి గురించా అని ఆలోచిస్తున్నారా? అదేనండీ సాయి ధరమ్ తేజ్ గురించే. నగరంలో 'పిల్లా నువ్వులేని జీవితం' విజయోత్సవ సభలో పాల్గొనడానికి వచ్చిన తేజ్ విశాఖతో తనకున్న అనుబంధం గురించి సిటీప్లస్‌తో పంచుకున్నారు. నటన కోసం... నేను 2009 సెప్టెంబర్‌లో సత్యానంద్ మాస్టార్ దగ్గర యాక్టింగ్‌లో మూడు నెలల ట్రైనింగ్ కోసం వచ్చాను. ఆ సమయంలో నాకు చాలా మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా నేను సో అండ్ సో...ఫలానా వాళ్ల తాలూకా అని చెప్పుకోలేదు. అందరి అటెన్షన్ డ్రా చేయడం ఇష్టం లేక అలా చెప్పాను. కానీ నా కోర్సు పూర్తయ్యే సమయానికి చాలా మందికి తెలిసిపోయింది... నేను మెగాస్టార్ మేనల్లుడిని అని. డాబాలో ఫుడ్...ఫ్రెండ్ ఇంట్లో హ్యాంగౌట్స్ సత్యానంద్ మాస్టార్ దగ్గర ట్రైనింగ్ సమయంలో వైజాగ్‌లో ఎక్కువగా తిరిగేవాడిని. దత్ ఐలాండ్‌లో ఉన్న సబ్వేలో తిరిగేవాడిని. దానికి దగ్గర్లోనే ఒక మల్టీక్యూజిన్ రెస్టారెంట్ ఒకటి ఉండేది. రీసెంట్ గా అది క్లోజ్ చేసేశారు. అక్కడకు రెగ్యులర్‌గా వెళ్లేవాడిని. వైజాగ్‌లో నాతో పాటు కోర్సు చేసిన ఒకబ్బాయి అపార్ట్మెంట్ ఉంది. అక్కడ ఎక్కువగా హ్యాంగవుట్స్ చేసేవాడిని. రుషికొండ దగ్గర ఉన్న 'రాజుగారి డాబా'లో ఫుడ్ చాలా ఇష్టం. ప్రతి ఆదివారం అక్కడకు వెళ్లి ఫుడ్ తినాల్సిందే. రొయ్యల పలావ్, చికెన్ వేపుడు ఇలా అన్ని రకాల బాగా తినేవాడిని. మ్యాగ్జిమం సీ ఫుడ్ టేస్ట్ చేసేవాడిని. యాక్టర్ అవుతా అనుకోలేదు... మా ఫ్యామిలీలో అందరూ యాక్టర్స్ ఉన్నా సరే నాకెప్పుడూ నేను ఒక యాక్టర్ అవ్వాలి అని అనిపించలేదు. నా డిగ్రీ అయిపోయిన తర్వాత 9-5 జాబ్‌లో లేదా ఒక కార్పొరేట్ కంపెనీలో ఎవరో ఒకతనికి 'గుడ్ మార్నింగ్ సార్' అని చెప్తాం అన్న ఆలోచన నాకెప్పుడూ రాలేదు. అది నాకు నచ్చదు కూడా. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛా భావం ఉంటుంది. సో ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఓ అలోచన వచ్చింది. నేను యాక్టింగ్ సెలక్ట్ చేసుకుంటే...నేను ఏమైనా అవ్వచ్చు....నా ఫ్రీడం నాకు ఉంటుంది. సో అప్పుడు నాకు నటన మీద ఆసక్తి వచ్చింది. పిల్లా నువ్వులేని జీవితం ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను, రెజీనా జస్ట్ హాయ్ అంటే హాయ్ అని మామూలుగా ఉండేవాళ్లం. సినిమా షూటింగ్ అయిపోయే సమయానికి మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఇద్దరం బాగా అల్లరి చేసేవాళ్లం. మా అల్లరి తట్టుకోలేక డెరైక్టర్ వచ్చి కొంచెం షూటింగ్ మీద దృష్టి పెట్టండి..ప్లీజ్ అని చెప్పేవారు. మాతో పాటు జగపతిబాబు గారు కూడా జాయిన్ అయ్యారు. మా కన్నా అతనే ఎక్కువగా అల్లరి చేశారు. డాన్స్ మా అమ్మగారు క్లాసికల్ డ్యాన్సర్. స్టేజ్ షోస్ చేసి ఇంటికి వచ్చేవారు. అమ్మకు తెలియకుండా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. తర్వాత పెద్ద మావయ్య చిరంజీవి గారి సినిమాలు చూసి ఆయన పాటలకు డాన్స్ చేయడం, చిన్నప్పుడు స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో డాన్స్ చేస్తూ ఉండేవాడిని. అలా చిన్నప్పటి నుంచి డాన్స్‌ను వదల్లేదు. ముద్దుల మేనల్లుడు నేను 7వ తరగతి వరకు చెన్నైలో ఉండేవాడిని. అప్పుడు నా బాధ్యత అంతా నాగబాబు గారు చూసుకున్నారు. తర్వాత హైదరాబాద్ షిప్ట్ అయ్యాం. అక్కడి నుంచి డిగ్రీ వరకు పెద్ద మావయ్య ఆధ్వర్యంలో ఉన్నాను. కెరీర్ పరంగా నాకు కల్యాణ్ మావయ్య గైడ్ చేసేవారు. మా ముగ్గురు మావయ్యలు నాకు మనో బలం,మనో ధైర్యం. మల్టీస్టారర్ మా ముగ్గురు మావయ్యలతో కలిసి నటించాలి అని ఉంది. ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఉంది. వాళ్లు ఓకే అంటే నేను రెడీ. హరిశంకర్ గారి డెరైక్షన్‌లో 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమా చేస్తున్నాను. నేను ఒక రకమైన పాత్రలే చేయాలి అని అనుకోవట్లేదు. అన్ని రకాల జోనర్ సినిమాలు చేస్తాను. ఒక్క హారర్ సినిమాలు తప్పించి. ఎందుకంటే బేసిక్‌గా నాకు హారర్ అంటే భయం. -
మీ అభిమానమే కొండంత అండ
పాలకొల్లు అర్బన్: ‘మీ అభిమానమే మాకు కొండంత అండ.. మెగా కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఆశీర్వదించండి’ అని మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయి ధరమ్‌తేజ అన్నారు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా విజయోత్సవంలో భాగంగా చిత్ర యూనిట్ ఆది వారం రాత్రి పాలకొల్లు గీతా అన్నపూర్ణ థియేటర్‌కు వచ్చింది. హీరో, హీరోయిన్ రెజీనా, నిర్మాత బన్నీవాసు, శ్రీహర్షిత్, సహనటుడు ప్రభాస్ శ్రీను ప్రేకక్షకులతో మాట్లాడి సందడి చేశారు. తూ ర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి ప్రత్యేక బస్సులో వచ్చిన చిత్ర యూని ట్‌కు అభిమానులు తీన్మార్ డప్పులతో స్వాగతం పలికారు. హీరో సాయిధరమ్‌తేజ మాట్లాడుతూ నిజాయితీ, నిబద్ధత ఉంటే చిత్ర పరిశ్రమలో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని అన్నారు. ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ పాలకొల్లులో అభిమానుల సందడి చూస్తుంటే మనసు పులకరించిపోతుందన్నారు. తమకు ఇం తలా మరెక్కడా ఆదరణ లభించలేదని చెప్పారు. హీరోయిన్ రెజీనా, నిర్మాత బన్నీవాసు మాట్లాడారు. అనంతరం హీ రోను అభిమానులు గజమాలతో సత్కరించారు. చిరంజీవి అభిమానుల సం ఘం రాష్ట్ర కార్యదర్శి తులా రామలింగేశ్వరరావు, దాసిరెడ్డి శ్రీనివాసు, థియేటర్ యజమాని అహ్మద్ పాల్గొన్నారు. తొలి చిత్రంతోనే విజయం సొంతం చేసుకున్న సాయి ధరమ్‌తేజను చూసేం దుకు, మాట్లాడేందుకు అభిమానులు ఆసక్తి కనబర్చారు. అభిమానులంతా ఒక్కసారిగా ఎగబడటం, కేరింతలతో కార్యక్రమం రసాభాసగా మారింది. విలేకరులు ఫొటోలు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా తోపులాట జరగడం ప్రేక్షకులను నిరాశపర్చింది. అనంతరం భీమవరం గీతా మల్టీప్లెక్స్‌లో యూనిట్ సందడి చేసింది. -
మావయ్యల పై చూపించిన అభిమానమే నాపై చూపిస్తున్నారు
అమలాపురం టౌన్ :‘మీ రుణం తీర్చుకోలేను, మావయ్యలు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌పై మీరు చూపించిన అభిమానమే నాపై చూపిస్తున్న తీరు జీవితాంతం గుర్తుంచుకుంటాను’ అని మెగా హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. ధరమ్‌తేజ్ హీరోగా నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రం యూనిట్ ఆదివారం సాయంత్రం అమలాపురం వచ్చింది. ఆ చిత్రం ప్రదర్శిస్తున్న రమా థియేటర్లో సందడి చేసింది. థియేటర్లో ప్రేక్షకులను, అభిమానులనుదే దశించి సాయిధరమ్‌తేజ్ మాట్లాడారు. ఆయనతోపాటు చిత్ర దర్శకుడు రవికుమార్ చౌదరి, నటుడు గబ్బర్‌సింగ్ శ్రీను కూడా మాట్లాడారు. చిత్ర కథానాయిక రెజీనా సందడి చేశారు. ముందుగా ఈదరపల్లి వంతెన వద్ద ఆ చిత్ర యూనిట్ బస్సుకు చిరంజీవి అభిమానులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఊరేగింపుగా యూనిట్‌ను థియేటర్‌కు తోడ్కొని వచ్చారు. చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు నల్లా చిట్టిబాబు, ఏడిద శ్రీను, నల్లా నాయుడు, యర్రా నాగబాబు, నల్లా పవన్, ఆకుల రాము, పిండి రాజా, జంగా అబ్బాయి వెంకన్న తదితరులు హీరో సాయిధరమ్తేజను గజమాల, పూలకిరీటాలతో ఘనంగా సన్మానించారు. థియేటర్ వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అభిమానులు అసౌకర్యానికి గురయ్యారు. ప్రేక్షకాదరణ పొందుతుందని తెలుసు : దిల్ రాజు కాకినాడ సిటీ : ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందని ముందే ఊహించినట్టు దిల్ రాజు చెప్పారు. విజయోత్సవ యాత్రలో భాగంగా ఈ చిత్ర యూనిట్ కాకినాడకు వచ్చింది. హీరో సాయిధరమ్‌తేజ్, హీరోయిన్ రెజీనా, చిత్ర సమర్పకులు దిల్‌రాజు, దర్శకుడు రవికుమార్‌చౌదరి, నిర్మాతలు బన్నీవాసు, శ్రీహర్షిత్, సినీనటి హేమ, నటుడు ప్రభాస్‌శ్రీను పద్మప్రియ థియేటర్‌ను సందర్శించారు. ముందుగా థియేటర్ యాజమాన్యం అభిమానులతో కలిసి చిత్రయూనిట్‌కు బాణ సంచా, డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. మెగా ఫ్యామిలీ ప్రభావం ఉన్నప్పటికీ హీరో నటన, ప్రతిభ కామన్ ఆడియన్స్‌ను ఎంతో ఆకట్టుకుందని దిల్‌రాజు చెప్పారు. మంచి కథ, కథనాలతో నిర్మిస్తున్న చిత్రాల్లో పిల్లా నువ్వులేని జీవితం ఒక్కటన్నారు. హీరో సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ మేనమామల ప్రోత్సాహం తనకు స్ఫూర్తి ఇచ్చిందన్నారు. ప్రేక్షకులు ఆదరించడం చాలా ఆనందంగా ఉందని, కుటుంబ సమేతంగా చిత్రాన్ని చూస్తున్నారని చెప్పారు. పాదగయ సందర్శన పిఠాపురం : ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్ర యూనిట్ బృందం స్థానిక పాదగయ క్షేత్రాన్ని దర్శించుకుంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, చిత్ర హీరో సాయి ధరమ్‌తేజ, నిర్మాతలు బన్నీవాసు, ఆదిశెట్టి తదితరులు శ్రీకుక్కుటేశ్వరస్వామిని, శ్రీపురుహూతికా అమ్మవారిని, శ్రీరాజరాజేశ్వరీదేవిని, దత్తాత్రేయస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. రాజమండ్రిలో హల్చల్ రాజమండ్రి కల్చరల్ : గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్ర బృందం ఆదివారం స్థానిక గీతా అప్సరా థియేటర్లో హల్చల్ చేసింది. హీరో, హీరోయిన్లను చూడడానికి ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హీరో సాయిధరమ్‌తేజ్, హీరోయిన్ రెజీనాలకు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. సాయి ధరమ్‌తేజ్ మాట్లాడుతూ మావయ్య (చిరంజీవి)తో కలిసి మదర్‌థెరిస్సా విగ్రహావిష్కరణకు రాజమండ్రి వచ్చానని, తర్వాత ఇప్పుడు వచ్చానన్నారు. గోదావరి అందచందాలంటే మావయ్యకు ఎంతో ఇష్టమని చెప్పారు. హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ చిత్రం విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. గోదావరి అందాలు తనను ఆకట్టుకున్నాయన్నారు. హీరోను గజమాలతో సత్కరించారు. అభిమానసంఘ నాయకులు ఏడిద బాబి, పడాల శ్రీనివాస్, వై.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
మెగా ఫ్యామిలిలో పుట్టడమే అదృష్టం
శ్రీకాకుళం కల్చరల్: పిల్లా నువ్వులేని జీవితం చిత్ర యూనిట్ శనివారం శ్రీకాకుళంలో సందడి చేసింది. సినిమా ప్రదర్శిస్తున్న ఎస్వీసీ రామలక్ష్మణ థియేటర్ మ్యాట్నీషో సయయంలో హిరో సాయి ధరమ్ తేజ్, కథానాయిక తదితరులు వచ్చారు. ఈ సందర్భంగా ప్రేక్షకులను ఉద్దేశించి హీరో తేజ్, హీరోయిన్ రేజీనా మాట్లాడుతూ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అభిమానాన్ని కొనసాగించాలన్నారు. సినీనటి హేమ మాట్లాడుతూ సినిమాకి మంచి హిట్ ఇచ్చినందుకు ధన్యవాదాలన్నారు. తొలుత థియేటర్ యూజమాన్యం చిత్ర యూనిట్‌కు పూలదండలతో, బొకేలతో స్వాగతం పలికారు. చిత్ర నిర్మాతలు బన్నీవాసు, శ్రీహర్ష, ఎస్వీసీ థియేటర్స్ ప్రతినిధి విజయభాస్కర్, హాలు మేనేజర్ బోసుబాబు, ఫ్యాన్సు అసోసియేషన్ సభ్యులు చౌదరి సతీష్, త్వైకాండో శ్రీను, వైశ్యరాజు మోహన్, జీవీ నరసింహం, జామి దిలీప్, గిరి, సత్యనారాయణ ఉన్నారు. శ్రీకాకుళం కల్చరల్:మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలిలో పుట్టడమే తన అదృష్టం.. అవకాశం వస్తే చిరు 150వ చిత్రంలో నటిస్తానని చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌ల మేనల్లుడు.. పిల్లా నువ్వులేని జీవితం కథా నాయకుడు సాయిధరమ్ తేజ్ చెప్పారు. చిత్రం విజయోత్సవంలో భాగంగా శనివారం శ్రీకాకుళం వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రశ్న: హీరో అవ్వాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? జవాబు: డిగ్రీ పూర్తయిన తరువాత మాస్టర్ డిగ్రీ చేయాలనుకుంటుండగా నటించాలనే చిన్న ఆలోచన వచ్చింది. డాక్టర్ కావాలనుకున్నా... అది నాకు సెట్ కాలేదు. తర్వాత లాయర్ కావాలనుకున్నా అదీ కరెక్ట్ అనిపించలేదు. ఇలా అనుకుంటుండగానే ఎంబీఏ పూర్తిచేశాను. అప్పుడే నటుడుని కావాలనే ఆలోచన వచ్చింది. ప్రశ్న: చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ ఉండడం వల్ల హీరో అయిపోవడం ఈజీ అనుకుని ఈ ఫీల్డ్‌లోకి వచ్చారా? జవాబు: నేను నటించాలనుకున్నాను కాని హీరో అవుదామనుకోలేదు. నటుడిగా స్థిరపడ్డాక హీరోగా చేద్దామనుకున్నా. ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు మాత్రం హీరోగా అనుకోలేదు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఈజీ అయిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు. అరుుతే మెగా ఫ్యామిలీలో పుట్టడం నా అదృష్టం. ప్రశ్న: నటుడు అవుదామని ముందుగా మీ ఫ్యామిలీలో ఎవరి దగ్గర చెప్పారు? జవాబు: తొలుత కల్యాణ్ మావయ్యతో చెప్పాను. ఎందుకంటే నాకు చిన్నప్పటినుంచి ఆయనతో చనువు ఎక్కువ. చెప్పగానే అన్నయ్యకు చెప్పావా అన్నారు. లేదంటే.. వెళ్లి అన్నయ్యతో చెప్పు అన్నారు. చిరంజీవి గారికి చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ప్రశ్న: మీ కెరీర్లో పవన్ కల్యాణ్ సాయం ఏమైన ఉంటుందా? జవాబు: ఆయన ఒక గైడ్, ఒక గురువు. ఉపాధ్యాయుడు తన స్టూడెంట్‌ని ఎలాగైతే గైడ్ చేస్తారో అలాగే ఆయన నన్ను గైడ్ చేశారు. అవకాశం వస్తే చిరంజీవి 150వ సినిమాలో నటించాలని ఉంది. ప్రశ్న: విజయ యాత్రకు సిక్కోలు నుంచి శ్రీకారం చుట్టడానికి కారణం? జవాబు: పిల్లా నువ్వులేని జీవితం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సందర్భంగా మా చిత్ర యూనిట్ విజయయాత్ర ప్రారంభించాల ని నిర్ణరుుంచారు. వెంటనే నేను శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆదిత్యుని ఆలయం నుంచి ప్రారంభించాలని మా నిర్మాతలను కోరాను. దానికి అంగీకారం రావడంతో ఇక్కడ నుంచే విజయయూత్ర ప్రారంభించా. ఆదిత్యుని సన్నిధిలో.. పిల్లా నువ్వులేని జీవితం సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ అరసవల్లి ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యదేవుని ఆలయం చాలా బాగుందన్నారు. అర్చకుడు ఇప్పిలిశంకరశర్మ ఆశీర్వచనం అందజేశారు. కూర్మనాథుని సన్నిధిలో.. గార:శ్రీకూర్మం శ్రీకూర్మనాథుడ్ని సినీ హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు సీహెచ్ సీతారామనృసింహాచార్యులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందజేశారు. -
‘పిల్లా నువ్వు లేని జీవితం’ సందడే సందడి
అనకాపల్లి రూరల్ : అనకాపల్లి పట్టణంలోని సత్యసాయి, పర్తిసాయి థియేటర్లలో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రం యూనిట్ శనివారం సందడి చేసింది. మధ్యాహ్నం ఆట సమయంలో వచ్చిన యూనిట్ బృందం సినిమా డైలాగ్‌లు చెపుతూ ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. ఈ సందర్భంగా హీరో సాయి ధరమ్‌తేజ్ మాట్లాడుతూ తన మొదటి చిత్రాన్ని పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ ప్రేక్షకదేవుళ్లకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తన తదుపరి చిత్రం హరీష్ శంకర్ డెరైక్షన్లోసాయి ధరమ్‌తేజ్ హీరోగా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ నిర్మించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కేరింత సినిమా నిర్మిస్తున్నామన్నారు. దర్శకుడు రవికుమార్ చౌదరి, నటి హేమ పాల్గొన్నారు. -
అద్భుతమైన ఆరంభం ఇది!
‘‘రవికుమార్ చౌదరి స్క్రీన్‌ప్లే కొత్తగా ఉందని సినిమా నిర్మాణంలో ఉన్నప్పట్నుంచీ నేను చెబుతూనే ఉన్నాను. చివరకు ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం అదే అయ్యింది. సాయిధరమ్‌తేజ్‌కి అద్భుతమైన ఆరంభాన్నిచ్చిందీ సినిమా. జగపతిబాబు ప్రత్యేక పాత్ర చేసి సినిమాను నిలబెట్టారు’’ అని అల్లు అరవింద్ అన్నారు. ఆయన సమర్పణలో సాయిధరమ్‌తేజ్, రెజీనా జంటగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో బన్నీ వాస్, శ్రీహర్షిత్ కలిసి నిర్మించిన చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. అతిథు లుగా పాల్గొన్న దర్శకులు బోయపాటి శ్రీను, హరీశ్‌శంకర్, పైడిపల్లి వంశీ, మారుతి చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపారు. సాయిధరమ్ తేజ్, ఎ.ఎస్. రవికుమార్ చౌదరి, జగపతిబాబు, రెజీనాలతో పాటు చిత్రం యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. -
ఏ పిల్లా నన్ను పట్టించుకోలేదు!
తొలి సినిమాతోనే సత్తాను చాటారు సాయిధరమ్‌తేజ్. డాన్సుల్లో, ఫైటుల్లో తనదైన ప్రతిభను ఆవిష్కరించారు. ‘బాయ్ నెక్ట్స్ డోర్ అనిపించేలా ఉన్నాడే...’ అని అందరితో అనిపించారు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ విజయం తన జీవితంలో ఎంత మార్పు తెచ్చినా... తాను మాత్రం సామాన్యుడినేననీ, వ్యక్తిత్వంలో మార్పు రాదనీ ఘంటాపథంగా చెబుతున్న యువ హీరో సాయిధరమ్‌తేజ్‌తో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ. తొలి సినిమా విడుదల ఆలస్యమవ్వడం, మలి సినిమా ముందు రిలీజవ్వడం... ఈ మధ్యలో ఏమైనా సంఘర్షణకు గురయ్యారా? అవును... అయితే, ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వదల్లేదు. ‘రేయ్’ నిర్మాణంలో ఉన్నప్పుడే ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ప్రతిపాదన వచ్చింది. కథ నచ్చి, ‘ఓకే’ చేశాను. రవికుమార్ చౌదరి నాకు ఏదైతే చెప్పారో, అదే తీశారు. కొంతమంది అడిగారు... జగపతిబాబు పాత్రను హైలైట్ చేయడానికి మీ పాత్ర తగ్గించారా అని. అలాంటిదేం జరగలేదు. కథను కథగా తీశారంతే. ఈ విజయానికి కారణం కూడా అదే. ‘పిల్లా... నువ్వు లేని జీవితం’ విడుదలయ్యాక మీకు దక్కిన గొప్ప ప్రశంస? ‘కంగ్రాట్స్... నీ సినిమా విడుదల ఖాయమైంది..’ అని తొలుత ఎవరు చెప్పారో... అదే నాకు గొప్ప ప్రశంస. విడుదలయ్యాక ఎన్ని ప్రశంసలొచ్చినా అవన్నీ దాని తర్వాతే. చిరంజీవి ఏమన్నారు? రిలీజ్‌కి ముందే మామయ్య సినిమా చూశారు. ఆయనకు బాగా నచ్చింది. నిన్ననే మళ్లీ ఆయన్ను కలిశాను. భుజం తట్టి అభినందించారు. ‘ఇక ప్రతి క్షణం కష్టపడాలి.. బీ కేర్‌ఫుల్’ అని హెచ్చరించారు. బన్నీ, వరుణ్‌తేజ్, అరవింద్‌గారు.. అందరూ ఈ సినిమా విషయంలో హ్యాపీ. ఇంతకీ ఈ పాత్ర కోసం మీరు ఎలాంటి హోమ్‌వర్క్ చేశారు? నా తొలి సినిమా ‘రేయ్’లో జమైకాలో పెరిగిన తెలుగబ్బాయి పాత్ర నాది. వెస్టిండీస్ బాడీ లాంగ్వేజ్... వారి బిహేవియర్ ఆ పాత్రలో కనిపించాలి. దాని కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను. చాలా మంచి పాత్ర. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాకొచ్చేసరికి తొలి సినిమాకు పూర్తి భిన్నమైన పాత్ర. పక్కింటి కుర్రాడిలా అనిపించేలా ఉంటుంది. తెలివైన కుర్రాడు. ఏది చేసినా కాన్ఫిడెంట్‌గా, క్లారిటీగా చేస్తాడు. ఆ పాత్రకు తగ్గట్టు మారిపోవడానికి మళ్లీ చాలా కష్టపడాల్సి వచ్చింది. అది సరేకానీ... హీరో అవ్వాలనే కోరిక చిన్నప్పట్నుంచీ ఉండేదా? చిరంజీవిగారి లాంటి గ్రేట్ సూపర్‌స్టార్ నా మామయ్యే అయినా... నా దృష్టి మాత్రం ఎప్పుడూ చదువు మీదే ఉండేది. ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అవుదామనుకున్నాను. ఎంసెట్ కూడా రాశాను. అయితే... చివర్నుంచి రెండో ర్యాంక్ వచ్చింది(నవ్వుతూ). తర్వాత బీఎస్సీ బయో టెక్నాలజీ చేరాను. థర్డ్ ఇయర్ కెమిస్ట్రీ-3 పేపర్ గుండెపోటు తెప్పించినంత పనిచేసింది. ఇలా కాదని ఎంబీఏలో చేరాను. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టూడెంట్‌ని కావడంతో ఎకౌంట్స్ ఏమీ అర్థం కాలేదు. పిచ్చెక్కినంత పనైంది. నిస్పృహ వచ్చేసింది. ఆ టైమ్‌లోనే నా మైండ్‌సెట్‌లో మార్పొచ్చింది. నైన్ టు సిక్స్ జాబ్‌లో నన్ను నేను ఊహించుకోలేకపోయాను. ఎందుకో ఓ రోజు రాత్రి అనిపించింది... ‘యాక్టర్‌ని అయితే తప్పేంటి?’ అని. హీరోని కావాలని మాత్రం అనుకోలేదు. నా మనసులో మాటను కల్యాణ్ మామయ్య (పవన్‌కల్యాణ్)కి చెప్పాను. వెరీగుడ్.. అని పెద్ద మామయ్య (చిరంజీవి)కు, చిన్నమామయ్య (నాగబాబు)కు చెప్పారు. చివరకు నా బంతి అమ్మ కోర్టులో పడింది. ‘నువ్వు ముందు ఎంబీఏ పూర్తి చెయ్. తర్వాత యాక్టింగ్’ అంది. అమ్మ మాట ప్రకారం ఎంబీఏ పూర్తి చేసి ఇటొచ్చేశా. ఇంతకీ హీరో అవడానికి ఎలాంటి వర్కవుట్లు చేశారు? 135 కిలోల బరువుండేవాణ్ణి. సగం పైగా తగ్గాను. చిన్నప్పుడే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం పెద్ద హెల్ప్ అయ్యింది. అమ్మ క్లాసికల్ డాన్సర్. అమ్మ డాన్స్ చూస్తుండటం వల్ల... నాకు కూడా నాట్యం తేలిగ్గా అబ్బింది. మామయ్యల ప్రభావం ఎలాగూ ఉంటుంది. వైజాగ్ సత్యానంద్, ముంబయ్ బ్యారీజోన్, హైదరాబాద్ భిక్షు, అరుణ భిక్షుగార్ల వద్ద నట శిక్షణ పొందా. సినిమాలో అల్లరి అల్లరి చేశారు. మరి రియల్ లైఫ్‌లో? ఇంకా ఎక్కువ ఉంటుంది. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అంటూ మీరు ఎప్పుడు ఆడపిల్లల వెంటపడ్డారు? ఆహా... చాలామంది వెంటపడ్డాను. ఇంత లావుగా ఉండి మా వెంట పడతాడేంటి? అనుకునేవారు. ‘నిన్ను బోయ్‌ఫ్రెండ్‌గా ఊహించుకోలేకపోతున్నాం’ అన్నవాళ్లే ఎక్కువ. నేనూ అందరిలాంటి కుర్రాణ్ణేనండీ. ఇంతకీ మీ ఫ్యామిలీలో మీకు ఎవరు బాగా క్లోజ్? వరుణ్‌తేజ్.. వాడి టాలెంట్ నాకు తెలుసు. అయితే కెమెరా ముందు ఏంటో తెలీదు. మొన్ననే టీజర్ చూశా. అదిరిపోయింది. వాడు పెద్ద స్టార్ అవుతాడని నా నమ్మకం. హీరో అయ్యాక మార్పు? ఇప్పుడు వేసుకున్న చొక్కాకంటే రేపు ఖరీదైన చొక్కా వేసుకుంటానేమో! మారిన పరిస్థితులు నన్ను ఎప్పటిలా ఉండనీయవేమో! మొన్నటివరకూ ఇష్టమైన చోట చాయ్ తాగేవాణ్ణి. ఇకపై ఆ ఛాన్స్ ఉండకపోచ్చేమో! కానీ.. వ్యక్తిత్వంలో మాత్రం మార్పు రానీయను. నాలో జనాలు చూసేది నా మామయ్యలనే. - బుర్రా నరసింహ -
సినిమా రివ్యూ: పిల్లా.. నువ్వులేని.. జీవితం
నటీనటులు: సాయిధరమ్ తేజ్, రెజీనా, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, షియాజీ షిండే తదితరులు. మ్యూజిక్: అనూప్ రూబెన్స్ నిర్మాత బన్నీ వాసు దర్శకత్వం: ఏఎస్ రవికుమార్ చౌదరీ ప్లస్ పాయింట్స్ః స్క్రీన్ ప్లే, డైరక్షన్ సాయిధరమ్ తేజ్ ఎనర్జీ రెజీనా గ్లామర్, ఫెర్ఫార్మెన్స్ మ్యూజిక్ కెమెరా మైనస్ పాయింట్స్: చివరి 10 నిమిషాలు ముఖ్యమంత్రి పదవికి ప్రభాకర్ (ప్రకాశ్ రాజ్), గంగాప్రసాద్ (షియాజీ షిండే) రేసులో ఉంటారు. ఈ పదవి కోసం ఇద్దరూ పావులు కదుపుతుండగా గంగాప్రసాద్ అక్రమ వ్యవహారాలపై ఓ టీవీ చానెల్‌కు చెందిన రిపోర్టర్ ఓ కథనాన్ని ప్రసారం చేస్తాడు. దాంతో అవకాశాలు సన్నగిల్లడంతో రౌడీ షీటర్ మైసమ్మ (జగపతిబాబు)తో రిపోర్టర్ షఫీని చంపించేందుకు పోలీస్ ఆఫీసర్ (ఆహుతిప్రసాద్)తో కలిసి గంగాప్రసాద్ ప్లాన్ వేస్తాడు. ఇదిలా ఉండగా, పాలకొల్లు నుంచి చదువుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చిన శ్రీను(సాయిధరమ్ తేజ్) మైసమ్మ వద్దకు వచ్చి తనను చంపాలని కోరుతాడు. ఎందుకు చంపాలని మైసమ్మ అడగడంతో శైలజ(రెజీనా)తో ప్రేమ కథను చెప్పడం ప్రారంభిస్తాడు.. కథ అలా సాగుతుండగానే శ్రీను, శైలజలను చంపాలని మైసమ్మను పోలీస్ ఆఫీసర్ ఆదేశిస్తాడు. శ్రీను, శైలజలను చంపాలని ఎవరు, ఎందుకు అనుకున్నారు? మైసమ్మ ఏం చేశాడు? గంగప్రసాద్, ప్రభాకర్లిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయ్యాడు? అనే ప్రశ్నలకు వినోదత్మాకంగా, బోలెడన్ని ట్విస్టులతో ఆసక్తికరంగా అందించిన సమాధానమే ’పిల్లా నువ్వు లేని జీవితం’ ‘రేయ్’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచమైనప్పటికి.. సాయిధరమ్‌కు తొలి చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం’. తొలి చిత్రమైనా మంచి ఎనర్జీ, యాక్షన్, టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. అల్లు అర్జున్ మేనరిజం, పవన్ కళ్యాణ్ స్టైల్‌ను క లిపి.. కొత్త ఇమేజ్ను సంపాదించుకోవడానికి ప్రయత్నించాడు. తొలి చిత్రం ద్వారా దొరికిన చక్కటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. శైలజ పాత్రలో గ్లామర్, ఫెర్ఫార్మెన్స్‌తో రెజీనా మరోసారి తెలుగు తెరపై మెరిసింది. ఈ చిత్రం ద్వారా స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందడానికి మరో మెట్టు ఎక్కింది. ఈ చిత్రంలో మైసమ్మ పాత్రలో జగపతిబాబు మరోసారి పవర్‌పుల్ పాత్రలో కనిపించారు. లెజెండ్ చిత్రం ద్వారా ప్రత్యేకపాత్రతో ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన జగపతిబాబు మైసమ్మగా గుర్తుండి పోయే పాత్రను పోషించారు. రఘుబాబు, తాగుబోతు రమేశ్‌లు తమ ప్రాతలతో ఈ చిత్రానికి అదన పు ఆకర్షణగా మారారు. చంద్రమోహన్, జయప్రకాశ్‌రెడ్డి, హేమ తదితరులు కనిపించింది కాసేపే అయినా.. హస్యంతో కడుపుబ్బ నవ్వించారు. సాంకేతిక అంశాలు: ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ప్రేమ కథ అంశాలకు తగిన సంగీతాన్ని అందించడంలో అనూప్ రూబెన్ తన మార్కును చూపించారు. చిన్నా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి మరింత బలాన్ని అందించింది. యాక్షన్, రొమాంటిక్ సీన్లు, ట్రైన్ ఎపిసోడ్ లాంటి సన్నివేశాలు శివేంద్ర కెమెరా పనితనానికి అద్దం పట్టాయి. ఊహకందని ట్విస్టుల ద్వారా ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయడంలో దర్శకుడు రవికుమార్ వంద శాతం సక్సెస్ అయ్యాడు. రొటీన్ కథే అయినా కొత్తరకం స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మంచి వేగంతో క్లైమాక్స్ వరకు దూసుకొచ్చిన ఈ చిత్రం.. చివరి పదిహేను నిమిషాల్లో మందగించిందనే ఫీలింగ్ కలుగుతుంది. అయినా చిత్ర కథనం మాత్రం ఆసక్తికరంగానే సాగింది. కొన్ని ప్రతికూల అంశాలున్నా.. వాటిని సానుకూల అంశాలు డామినేట్ చేశాయి. దాంతో సాయిధరమ్ తేజ్, రవికుమార్ చౌదరి ఖాతాలో భారీ విజయం నమోదయ్యే అవకాశం ఉంది. -రాజబాబు అనుముల Follow @sakshinews -
‘పిల్లా నువ్వు లేని జీవితం’ స్టిల్స్ & పోస్టర్స్
-
పిల్లా.. నువ్వు లేని జీవితం టీమ్‌తో ముచ్చట్లు!
-
నాకు జరిగినట్లే తేజ్కీ జరగడం యాదృచ్ఛికం : చిరంజీవి
‘‘తేజ్ మా ఇంట్లోనే ఉండేవాడు. క్రమశిక్షణ గల కుర్రాడు. మా కుటుంబం నుంచి వచ్చిన హీరోలు కష్టపడుతూ, తమను తాము నిరూపించుకుంటూ నిలదొక్కుకుంటున్నారు. తేజ్ కూడా ఆ జాబితాలో చేరతాడనే నమ్మకం ఉంది’’ అని నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు. అల్లు అరవింద్ సమర్పణలో సాయిధరమ్ తేజ్, రెజీనా జంటగా గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలపై బన్నీ వాసు, హర్షిత్ నిర్మించిన చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం’. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఆడియో ఆవిష్కరణ వేడుకలో చిరంజీవి సీడీని ఆవిష్కరించి హీరోలు రామ్‌చరణ్, అల్లు అర్జున్‌కి ఇచ్చారు. ప్రచార చిత్రాలను దర్శకుడు వీవీ వినాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మరిన్ని విశేషాలు చెబుతూ - ‘‘తేజ్ నా లాగానే ఉంటాడని అందరూ అంటూ ఉంటారు. నా తొలి చిత్రం ‘పునాదిరాళ్ళు’ అయినా, ముందుగా రిలీజైంది మాత్రం రెండో చిత్రమైన ‘ప్రాణం ఖరీదు’. అచ్చంగా అప్పుడు నాకు జరిగినట్లే ఇప్పుడు తేజ్‌కి కూడా జరుగుతుండడం యాదృచ్ఛికం. రామ్‌చరణ్ రెండో చిత్రం ‘మగధీర’ను నిర్మించిన గీతా ఆర్ట్స్ తేజ్ రెండో చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం విజయం సాధించి, అందరికీ మంచి పేరు రావాలని కోరుకుం టున్నా’’ అని చెప్పారు. ‘‘సాయిధరమ్ తేజ్‌ను పరిచయం చేయడం వెనుక మొత్తం మా మెగా కుటుంబమంతా ఉన్నా, తొలి షో వరకే అది ఉపయోగపడుతుంది. నటుడిగా నిరూపించుకుంటేనే అతనికి మనుగడ ఉంటుంది. తేజ్ ఆ విషయంలో మా కుటుంబానికి చెందిన నలుగురు హీరోల్లో ఒకడవుతాడు’’ అని అల్లు అరవింద్ అన్నారు. దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడు శ్రీహరి చనిపోయారు. అప్పుడు చాలా డీలా పడ్డాను. ఆ తర్వాత ఈ పాత్ర కోసం జగపతిబాబుగారిని తీసుకు న్నాం’’ అని చెప్పారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘‘మా పెద్ద మావయ్య నా హార్ట్ బీట్ అయితే పవన్ మావయ్య నా మనస్సాక్షి. నాలోని సహనం నాగబాబు మావయ్య. ఈ ముగ్గురూ నాకు కొండంత అండ’’ అన్నారు. ఇంకా వీవీ వినాయక్, ‘దిల్’ రాజు, హీరోలు రామ్‌చరణ్, అల్లు అర్జున్ తదితర అతిథులు చిత్రబృందానికి శుభాకాంక్షలందజేశారు. అనూప్ రూబెన్స్, రెజీనా తదితర చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు నిర్మాతలు డా. వెంకటేశ్వరరావు, పోకూరి బాబురావు, శరత్ మరార్, దర్శకులు శ్రీవాస్, వీరు పోట్ల తదితర ప్రముఖులు హాజరయ్యారు. -
గపిల్లా నువ్వు లేని జీవితం అంటున్న సాయిధరమ్ తేజ
‘‘సాయిధరమ్ తేజలో మంచి మాస్ హీరో ఉన్నాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. ‘దిల్’ రాజుతో చక్కని అవగాహన కుదిరినందువల్ల తనతో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నాను. మున్ముందు కూడా మా కాంబినేషన్లో సినిమాలొస్తాయి’’ అన్నారు అల్లు అరవింద్. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ హీరోగా రెజీనా హీరోయిన్గా గీతా ఆర్ట్స్, ఎస్వీసీ సినిమాస్ నిర్మిస్తున్న చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసుతో కలిసి ‘దిల్’ రాజు సోదరుని కుమారుడు హర్షిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘గబ్బర్‌సింగ్ విడుదల తర్వాత దేవిశ్రీప్రసాద్ నాతో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ టైటిల్‌ని రిజిస్టర్ చేయించాడు. ఈ చిత్రానికి ఆ టైటిల్ ఉపయోగపడింది. ఇందులో జగపతిబాబు, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు’’ అన్నారు. ‘‘టైటిల్ కోసం మా టీవీలో ఒపీనియన్ పోల్ నిర్వహించాం. ఎక్కువ శాతం ఓట్లు ఈ టైటిల్‌కే పడటంతో దాన్నే ఖరారు చేశాం’’ అని దర్శకుడు చెప్పారు. ఇప్పటివరకు జరిపిన షూటింగ్‌తో 80 శాతం సినిమా పూర్తయ్యిందని బన్నీ వాసు తెలిపారు. ‘‘మా మామయ్య పవన్‌కళ్యాణ్ సినిమాలోని పాట.. నా సినిమా టైటిల్ అవ్వడం ఆనందంగా ఉంది’’ అని సాయిధరమ్ తేజ అన్నారు. ఈ వేడుకలో గౌతంరాజు, రత్నబాబు, హర్షిత్, రెజీనా తదితరులు పాల్గొన్నారు.