గపిల్లా నువ్వు లేని జీవితం అంటున్న సాయిధరమ్ తేజ
గపిల్లా నువ్వు లేని జీవితం అంటున్న సాయిధరమ్ తేజ
Published Sun, Nov 3 2013 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
‘‘సాయిధరమ్ తేజలో మంచి మాస్ హీరో ఉన్నాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. ‘దిల్’ రాజుతో చక్కని అవగాహన కుదిరినందువల్ల తనతో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నాను. మున్ముందు కూడా మా కాంబినేషన్లో సినిమాలొస్తాయి’’ అన్నారు అల్లు అరవింద్. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ హీరోగా రెజీనా హీరోయిన్గా గీతా ఆర్ట్స్, ఎస్వీసీ సినిమాస్ నిర్మిస్తున్న చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసుతో కలిసి ‘దిల్’ రాజు సోదరుని కుమారుడు హర్షిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ని హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘గబ్బర్సింగ్ విడుదల తర్వాత దేవిశ్రీప్రసాద్ నాతో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ టైటిల్ని రిజిస్టర్ చేయించాడు. ఈ చిత్రానికి ఆ టైటిల్ ఉపయోగపడింది. ఇందులో జగపతిబాబు, ప్రకాష్రాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు’’ అన్నారు.
‘‘టైటిల్ కోసం మా టీవీలో ఒపీనియన్ పోల్ నిర్వహించాం. ఎక్కువ శాతం ఓట్లు ఈ టైటిల్కే పడటంతో దాన్నే ఖరారు చేశాం’’ అని దర్శకుడు చెప్పారు. ఇప్పటివరకు జరిపిన షూటింగ్తో 80 శాతం సినిమా పూర్తయ్యిందని బన్నీ వాసు తెలిపారు. ‘‘మా మామయ్య పవన్కళ్యాణ్ సినిమాలోని పాట.. నా సినిమా టైటిల్ అవ్వడం ఆనందంగా ఉంది’’ అని సాయిధరమ్ తేజ అన్నారు. ఈ వేడుకలో గౌతంరాజు, రత్నబాబు, హర్షిత్, రెజీనా తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement