
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల తరువాత రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్ లాంటి హీరో వచ్చారు. తాజాగా మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్‌ను కూడా హీరోగా పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో మెగా హీరో ఎంట్రీ పై వార్తలు వినిపిస్తున్నాయి.
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. చిరంజీవి హీరోగా తెరకెక్కిన శంకర్ దాదా ఎమ్‌బీబీయస్ సినిమాలో బాలనటుడిగా కనిపించాడు వైష్ణవ్. ఈ మెగా వారసుడిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను నిర్మాత సాయి కొర్రపాటి తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. కొత్త దర్శకుడి సినిమాతో వైష్ణవ్ హీరోగా పరిచయం అయ్యే అకాశం ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలవడనుందన్న టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment