Vaishnav
-
టెలికం పీఎల్ఐ స్కీముతో కోట్లాది పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద టెల్కోలు రూ. 2,419 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తద్వారా 17,753 మందికి ఉపాధి కల్పించినట్లు వివరించారు. ఇది దేశీ టెలికం పరిశ్రమ చరిత్రలో కీలక మైలురాయని తెలిపారు. అమెరికాకు చెందిన టెలిట్ సింటెరియోన్ కోసం దేశీ సంస్థ వీవీడీఎన్ .. 4జీ, 5జీ కనెక్టివిటీ మాడ్యూల్స్, డేటా కార్డుల తయారు చేయడానికి సంబంధించిన ప్రొడక్షన్ లైన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. సంక్లిష్టమైన మెషిన్లను నిర్వహించడంలో అమ్మాయిలకు కూడా శిక్షణ లభిస్తుండటమనేది మేకిన్ ఇండియా లక్ష్య విజయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పీఎల్ఐ స్కీము కింద ఎంపికైన కంపెనీల్లో వీవీడీఎన్ కూడా ఒకటి. 2022 అక్టోబర్‌లో ఈ పథకం కోసం కేంద్రం 42 కంపెనీలను షార్ట్‌లిస్ట్ చేసింది. ఆయా సంస్థలు రూ. 4,115 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు, 44,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చాయి. రాజన్‌కు కౌంటర్.. మేకిన్ ఇండియా నినాదాన్ని విమర్శిస్తున్నవారు టెలికం, ఎల్రక్టానిక్స్ తయారీలో భారత్ సాధిస్తున్న సామరŠాధ్యల గురించి తెలుసుకునేందుకు వీవీడీఎన్ ప్లాంట్లను సందర్శించాలంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్‌కు వైష్ణవ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. నేడు భారత్‌లో తయారు చేస్తున్న టెలికం పరికరాలు అమెరికా, యూరప్, జపాన్ మొదలైన ప్రాంతాలకు ఎగుమతవుతున్నాయన్నారు. అత్యంత నాణ్యమైనవిగా భారతీయ ఉత్పత్తులు ఆయా దేశాల ఆమోదయోగ్యత పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్స్ తయారీ విషయంలో భారత్‌లో అదనంగా ఎంత విలువ జతవుతున్నది ప్రశ్నార్ధకమేనంటూ రాజన్ కొన్నాళ్ల క్రితం సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో వైష్ణవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
కరీంనగర్–హసన్‌పర్తి ‘లైన్’క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కరీంనగర్ – హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన రీ సర్వే చేసి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సర్వే నివేదిక వచ్చిన అనంతరం నిధుల కేటాయింపుతో పాటు నిర్మాణ పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అశ్విని వైష్ణవ్‌తో బండి భేటీ శుక్రవారం ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ – హసన్‌పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి వినతిపత్రం అందించారు. ఈ లైన్ నిర్మాణానికి సంబంధించి 2013లో సర్వే చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దిష్ట సమయంలోగా సరైన నిర్ణయం తీసుకోని కారణంగా పురోగతి లేకుండా పోయిందని సంజయ్ తెలిపారు. దాదాపు 62 కి.మీ. లైన్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఉత్తర తెలంగాణలోని గ్రానైట్ ఇండస్ట్రీకి , వరి, పప్పు ధాన్యాలు, పసుపు పంట ఉత్పత్తుల రవాణాకు ఈ లైన్ ఉపయోగపడుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లిలో ఈ రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జమ్మికుంట రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కూడా సంజయ్ కోరారు. ఈ నేపథ్యంలో రైల్వేమంత్రి అధికారులను పిలిపించి మాట్లాడారు. కరీంనగర్ –హసన్‌పర్తి లైన్ కు తక్షణమే రీసర్వేకు ఆదేశించారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా వచ్చే నెలలో పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొమరవెల్లిలో రైలు ఆగేలా చర్య లు తీసుకోవాల్సిందిగా అధికారులను మంత్రి ఆదే శించారు. జమ్మికుంట రైల్వేస్టేషన్ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆలస్యం: సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరీంనగర్ – హసన్‌పర్తి రైల్వే లైన్ నిర్మాణం ఆలస్యమైందని, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలు ఇబ్బంది పడ్డారని సంజయ్ మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన రైల్వేమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ తప్పిదంతో రాష్ట్రానికి అన్యాయం ’కృష్ణా జలాల వాటా విషయంలో సీఎం కేసీఆర్ చేసిన తప్పిదాన్ని సరిదిద్దాలని సంజయ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రజల వనరుల శాఖ సలహా దారు వెదిరే శ్రీరాంతో కలిసి సంజయ్ శుక్రవారం ఢిల్లీలో ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజలకు సాగు, తాగు నీరందే అవకాశం ఉందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వానికి తలొగ్గి 299 టీఎంసీలను తెలంగాణకు కేటాయించేందుకు అంగీకరించి రాష్ట్రప్రజలకు నష్టం కలిగించారని వివరించారు. కృష్ణా జలాల వాటా నీటి కేటాయింపు, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్‌ను పరిశీలించి త్వరగా పనులు చేపట్టేలా అను మతి ఇవ్వాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించి అధికారులను పిలిచి మాట్లాడారు. డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి పంపి పరిశీలించడంతోపాటు పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
రైల్వేబడ్జెట్‌లో తెలంగాణకు రూ.4,400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఈసారి రైల్వేబడ్జెట్‌లో రూ.4,400 కోట్లు కేటాయించామని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ప్రపంచ స్థాయి స్టేషన్‌గా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణ, ఏపీలకు రెండు వందే భారత్ రైళ్లను అందించామని చెప్పారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో అశ్వనీ వైష్ణవ్ మాట్లాడారు. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్.. సబ్కా ప్రయాస్’పేరుతో ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైల్వేల అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. శ్రీవెంకటేశ్వర స్వామి సులభతర దర్శనం కోసమే వందేభారత్ రైలును ప్రారంభించినట్లు చెప్పారు. తెలంగాణను అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు: కిషన్‌రెడ్డి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని మోదీ ఆలోచన అని.. మంచి మౌలిక వసతులు కల్పించేందుకే మోదీ హైదరాబాద్‌కు వచ్చారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పారు. తెలంగాణలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేశామన్నారు. ఇప్పటివరకు దేశంలో 14 వందే భారత్ రైళ్లను ప్రారంభించామని, అందులో రెండింటిని తెలంగాణకు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారని పేర్కొన్నారు. రూ.714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తుండటం గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొంతకాలం ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఆగిపోయిందని.. బీజేపీ ఎంపీలు వెళ్లి ప్రధానికి విజ్ఞప్తి చేయగా.. కేంద్రం చొరవ తీసుకుని మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్‌ను, 13 కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభిస్తోందని చెప్పారు. తెలంగాణను అన్నిరకాలుగా ఆదుకుంటున్న ప్రధాని మోదీని రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. -
నవశక రాజకీయానికి సీఎం జగన్ శ్రీకారం: సజ్జల
సాక్షి, అమరావతి: అట్టడుగు వర్గాలకు సాధికారిత కల్పించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారని.. ఆ వర్గాల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ ద్వారాలు తెరిచే ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చాత్తాద శ్రీ వైష్ణవ కార్పొరేషన్ ఛైర్మన్ టి.మనోజ్‌కుమార్ అధ్యక్షతన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన చాత్తాద శ్రీ వైష్ణవ కులస్తుల రాష్ట్ర స్థాయి నేతల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవకులుగా పేరుతెచ్చుకునే అట్టడుగు వర్గాల నేతలను నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్ నవశక రాజకీయానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా నాయకులు పేరు తెచ్చుకోవాలి గాని అధికారం ఉంది కదా అని జులుం ప్రదర్శించే విధానానికి కాలం చెల్లిందని అన్నారు. వైఎస్ జగన్ నవశక రాజకీయానికి శ్రీకారం చుట్టారని తెలియచేశారు. కొందరి రాజకీయ నేతల మాదిరిగా ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే తత్వం వైఎస్ జగన్‌ది కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
ముచ్చటగా మూడోది?
ఒక సినిమా పూర్తవ్వకముందే మరో సినిమాలో యాక్ట్ చేసే చాన్స్ కొట్టేస్తే లక్కీ అంటారు. ముచ్చటగా మూడో సినిమా అవకాశం కూడా కొట్టేస్తే? నిధి అగర్వాల్ అంటారు. నాగచైతన్య తాజా చిత్రం ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు నిధి అగర్వాల్. ‘సవ్యసాచి’ సెట్స్‌లో ఉండగానే అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యారు. ఇప్పుడు మూడో సినిమాకు సంతకం చేసి నట్టు సమాచారం. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ హీరోగా పరిచయం కానున్న చిత్రానికి కథానాయికగా ని«ధి అగర్వాల్ పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ నిర్మించనున్న ఈ చిత్రానికి సుకుమార్ అసిస్టెంట్ దర్శకుడు బుచ్చిబాబు సన డైరెక్టర్. -
దత్తాత్రేయకు మోదీ లేఖ
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. పుట్టెడు శోకంలో ఉన్న దత్తాత్రేయకు సానుభూతి తెలియజేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. ‘వైష్ణవ్ చనిపోయాడన్న విషాద వార్త నన్ను కలిచివేసింది. ఇలాంటి సమయంలో దేశం అంతా నీ బాధను పంచుకుంటుంది. మెడిసిన్ చదివి దేశ సేవ చేయాల్సిన అబ్బాయి చనిపోవడం దురదృష్టకరం. మీకు మీ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వైష్ణవ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని లేఖలో మోదీ పేర్కొన్నారు. -
దత్తాత్రేయకు రోహిత్ వేముల తల్లి సానుభూతి
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్(21) హఠార్మణం పట్ల రోహిత్ వేముల తల్లి రాధిక వేముల సంతాపం ప్రకటించారు. దత్తాత్రేయకు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘కొడుకును కోల్పోయిన వారి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. జరిగిన విషాదానికి చింతిస్తున్నాను. మీరు త్వరగా ఈ ఘటన నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నాను...జై భీమ్’ అంటూ తన ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. దత్తాత్రేయ కుమారుడు వైష్టవ్ మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో చనిపోయారు. హెచ్‌సీయూ విద్యార్ధి రోహిత్ వేముల 2016, జనవరి 17న హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో రోహిత్‌ను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన వారిలో దత్తాత్రేయ కూడా ఉన్నాడరనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ కార్యకర్తపై దాడి చేశారనే అభియోగంతో రోహిత్ వేములతోపాటు మరో నలుగురు విద్యార్థులను వీసీ యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. దాంతో మనస్తాపం చెందిన రోహిత్ వేముల హస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయారు. అయితే ఈ వ్యవహారంలో అప్పట్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న దత్తాత్రేయపై కూడా ఆరోపణలు వచ్చాయి. హెచ్‌సీయూ కులవాదులు, ఉగ్రవాదులు, జాతి వ్యతిరేకుల అడ్డాగా మారిందంటూ కేంద్రమంత్రి దత్తాత్రేయ అప్పటి హెచ్చార్డీ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. దీనికి స్పందనగా వీసీ అప్పారావుతో రోహిత్ వేములతో పాటు మరో నలుగురు విద్యార్ధులను బహిష్కరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడంతో దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఆందోళనలు రేగాయి. దీంతో ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే రూపన్వాల్ నేతృత్వంలో ఏక సభ్య కమిటీని వేసింది. ఈ కమిటీ దత్తాత్రేయను నిర్ధోషిగా ప్రకటించి క్లీన్ చీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
భోజనం చేస్తూనే కుప్పకూలిన వైష్ణవ్
సాక్షి, హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ పుత్రశోకంతో తల్లడిల్లిపోయారు. ఏకైక కుమారుడు వైష్ణవ్(21) మంగళవారం అర్ధరాత్రి హఠాన్మరణం చెందారు. రాత్రి 10.30 గంటల సమయంలో వైష్ణవ్ తన తండ్రి దత్తాత్రేయ, తల్లి వసంత, సోదరి విజయలక్ష్మీ కలసి ఇంట్లో భోజనం చేస్తున్నారు. వైష్ణవ్ ఒక్కసారిగా పక్కనే ఉన్న సోదరిపైన కుప్పకూలిపోయాడు. ఫిట్స్ వచ్చి ఉండవచ్చని భావించిన కుటుంబసభ్యులు వైష్ణవ్‌ను హుటాహుటిన ముషీరాబాద్ గురునానక్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ‘మీరు అవసరం లేదు, మేము చూసు కుంటాం’అని వైద్యులు దత్తాత్రేయకు నచ్చచెప్పి ఇంటికి పంపించేశారు. ఆసుపత్రికి వచ్చే సమయానికే వైష్ణవ్ పల్స్‌రేటు పూర్తిగా పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. అత్యవసర వైద్యసేవలను అందజేసినా గుండె స్పందించలేదు. తాత్కాలికంగా ఫేస్మేకర్ అమర్చినా ఎలాంటి స్పందన కనిపించలేదు. చివరకు వెంటిలేటర్ అమర్చారు. వైష్ణవ్‌ను కాపాడేందుకు 15 మంది వైద్యులు సుమారు 2 గంటలపాటు అన్ని విధాలుగా శ్రమించారు. అయినా అతన్ని కాపాడలేకపోయారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ‘సడెన్ కార్డియాక్ అరెస్టు’తో వైష్ణవ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఉదయం వరకు తెలియదు... కుమారుడు చనిపోయిన విషయాన్ని చెబితే పరిస్థితి ఎలా ఉంటుందోనని భావించిన వైద్యులు ఉదయం వరకూ ఆ విషయాన్ని దత్తాత్రేయకు చేరవేయలేదు. తీవ్ర అనారోగ్యం, గుండె బలహీనతతో బాధపడుతున్న దత్తాత్రేయ సతీమణి వసంతకు కూడా కొడుకు చనిపోయిన సంగతి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. రెండు, మూడు రోజుల్లో ఆమెకు ఫేస్మేకర్ అమర్చాల్సి ఉంది. చివరకు బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు మరణవార్త చెప్పడంతో వెంటనే దత్తాత్రేయ, వసంత, ఇతర కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని కుమారుడి భౌతికకాయాన్ని చూసి బోరున విలపించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి వారిని ఓదార్చడానికి విఫలయత్నం చేశారు. ఉదయం 7 గంటలకు వైష్ణవ్ భౌతికకాయాన్ని రాంనగర్‌లోని నివాసానికి తరలించారు. అనంతరం దత్తన్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు, కుటుంబసభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంతి మయాత్ర సాగింది. మధ్యాహ్నం సైదాబాద్‌లోని ధోబీఘాట్ శ్మశానవాటికలో దత్తాత్రేయ చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి. కుమారుడి కడసారి వీడ్కోలు సందర్భంగా దత్తాత్రేయతోపాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అందొచ్చిన ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో దత్తాత్రేయ సతీమణి గర్భశోకంతో తల్లడిల్లింది. అంత్యక్రియలకు కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖుల సంతాపం... దత్తాత్రేయ కుమారుడి మరణవార్త తెలిసిన వెంటనే ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాంనగర్ వచ్చి వైష్ణవ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. దత్తాత్రేయను ఓదార్చారు. కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, సంతోష్ గాంగ్వర్, పలువురు రాష్ట్ర మంత్రులు దత్తాత్రేయను పరామర్శించారు. సీఎం సంతాపం దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దత్తాత్రేయకు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
దత్తాత్రేయ కుమారుడు మృతి : ప్రముఖుల పరామర్శ
-
బండారు దత్తాత్రేయకు పలువురు సంతాపం
-
దత్తాత్రేయను ఇలా కలవడం బాధాకరం..
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీమంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్రాత్తేయ కుమారుడు వైష్ణవ్ ఆకస్మిక మృతి పట్లు పలువురు సంతాపం తెలిపారు. గతరాత్రి వైష్ణవ్ గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ...‘దత్తాత్రేయ ఇంటికి ఎన్నో సందర్భాలలో వచ్చాను కానీ ఈ రోజు ఈ రకంగా ఆయనను కలవడం చాలా బాధాకరం. ప్రపంచంలో అతి పెద్ద దుఃఖం పుత్రశోకం. భగవంతుడు ఆయనకు శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.’ అని తెలిపారు. మరోవైపు సినీనటుడు హరికృష్ణ...బండారు దత్తాత్రేయకు సంతాపం తెలిపారు. కాగా బండారు వైష్ణవ్ అంత్యక్రియలు సైదాబాద్‌లోని శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాంనగర్‌లోని స్వగృహం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది. -
బండారు దత్తాత్రేయ కుమారుడి మృతి
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు వైష్ణవ్(21) హఠాన్మరణం చెందారు. ఎంబీబీఎస్ మూడో ఏడాది చదువుతున్న వైష్ణవ్ బుధవారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతి చెందారు. వివరాలు.. రాత్రి, 10 గంటలకు భోజన సమయంలో వైష్ణవ్ హఠాత్తుగా కుర్చీలో నుంచి కిందకు కుప్పకూలిపోయారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ముషీరాబాద్‌లోని గురునానక్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్య బృందం దాదాపు రెండు గంటల పాటు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. అర్థరాత్రి 12.15 నిమిషాలకు ప్రాణాలు విడిచారు. అయితే ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈ విషయాన్ని దత్తాత్రేయ, ఆయన సతీమణికి వైష్ణవ్ మరణవార్తను కుటుంబ సభ్యులు తెలియనీయలేదు. ఉదయం 5 గంటలకు కుమారుడి మరణ వార్తను విన్న దత్తాత్రేయ కన్నీరు మున్నీరు అయ్యారు. కుమారుడు ఇక లేడని తెలుసుకున్న బండారు శోకసంద్రంలో మునిగిపోయారు. వైష్ణవ్ మృతదేహాన్ని తెల్లవారు జామునే దత్తాత్రేయ ఇంటికి తరలించారు. చిన్న వయస్సులో గుండెపోటుతో మృతి చెందడంతో పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ముషీరాబాద్ శాసనసభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డిలు ఆసుపత్రికి చేరుకొని దత్తాత్రేయ కుటుంబాన్ని పరామర్శించారు . -
మరో మెగా హీరో ఎంట్రీ
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల తరువాత రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్ లాంటి హీరో వచ్చారు. తాజాగా మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్‌ను కూడా హీరోగా పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో మెగా హీరో ఎంట్రీ పై వార్తలు వినిపిస్తున్నాయి. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. చిరంజీవి హీరోగా తెరకెక్కిన శంకర్ దాదా ఎమ్బీబీయస్ సినిమాలో బాలనటుడిగా కనిపించాడు వైష్ణవ్. ఈ మెగా వారసుడిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను నిర్మాత సాయి కొర్రపాటి తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. కొత్త దర్శకుడి సినిమాతో వైష్ణవ్ హీరోగా పరిచయం అయ్యే అకాశం ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలవడనుందన్న టాక్ వినిపిస్తోంది. -
ఫైట్స్: వైష్ణవి
యోగాను, కలరిపయట్టును కలిపికొడుతున్న అమ్మాయి! ఉదయం ఎనిమిది గంటలు దాటింది. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ దగ్గర్లో ఉన్న ఓ డ్యాన్స్ స్కూల్ జనంతో కిటకిటలాడుతోంది. వారందరి ఎదుటా నిలబడి ఓ ఇరవై నాలుగేళ్ల అమ్మాయి డెమో ఇస్తోంది. ఒళ్లును విల్లులా వంచి ఆమె ప్రదర్శిస్తోన్న ఆసన భంగిమలు చూపరుల మతి పోగొడుతున్నాయి. చేతుల్ని చురకత్తుల్లా తిప్పుతోన్న భంగిమలు ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. అందరికీ తెలిసిన యోగాకి... కేరళ వారికి మాత్రమే తెలిసిన యుద్ధకళ కలరిపయట్టును కలిపిన ఆమె ప్రతిభకి చప్పట్ల వర్షం కురిసింది. ప్రశంసల జల్లులో తడిసి ముద్దయిన ఆ యువతి పేరు... వైష్ణవీ సాయినాథ్. ప్రముఖ నర్తకి రాజేశ్వరీ సాయినాథ్ కుమార్తె, చిన్న వయసులోనే కీర్తి కిరీటాలను అందుకున్న భరతనాట్య, ఒడిస్సీ నృత్యకారిణి. నర్తకిగా తన ప్రయాణం గురించి, తాను రూపొందించిన ‘కలరి-యోగ’ గురించి వైష్ణవి మాటల్లోనే... నా మూడో యేటనే నృత్య సాధన మొదలుపెట్టాను. అమ్మలాగా మంచి డ్యాన్సర్‌ని కావాలని, గొప్ప పేరు తెచ్చు కోవాలని ఊహ తెలిసిన నాటి నుంచీ కలలు కనేదాన్ని. నిజానికి నాలో నాన్న సాయినాథ్ టాలెంట్ కూడా ఉంది. ఆయన క్రికెటర్. రంజీ ఆడారు. నేనూ చదువుకునే రోజుల్లో రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ ప్లేయర్‌ని. అయినా క్రీడల కంటే నాట్యమే నన్ను ఎక్కువ ఆకర్షించడంతో భరతనాట్యం, ఒడిస్సీ నేర్చు కున్నాను. దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. అవార్డులూ గెల్చుకున్నాను. కానీ అన్నిటికంటే ఆనందం కలిగించేదేంటో తెలుసా... అమ్మతో కలిసి వేదిక మీద నృత్యం చేయడం, నేను సోలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు అమ్మ ప్రేక్షకుల్లో కూర్చుని నావైపు గర్వంగా చూస్తూ ఉండటం! అప్పుడొచ్చిన ఆలోచనే.. ఓరోజు సాయంత్రం ఫ్రెండ్స్‌తో బయటి కెళ్లాను. ఒక చోటికి వెళ్దామని నేనంటే, వాళ్లు ఈ టైమ్‌లో ఎందుకు రిస్క్ అన్నారు. సరే అన్నాను కానీ తర్వాత చాలా ఆలోచించాను. అమ్మాయిలకు రక్షణ లేదు. శరీరం బలహీన మైనది కావడం వల్ల చెడుకు ఎదురు తిరిగే శక్తి ఉండదు. కాబట్టే ఎక్కడికైనా వెళ్లాలంటే భయం. అదే మనం బలంగా ఉంటే, ఎవరినైనా ఎదుర్కోగల శక్తిమంతులమైతే... ఏ సమయంలోనైనా, ఎక్కడికైనా ధైర్యంగా వెళ్లగలం. అలా అనుకున్నప్పుడు పుట్టిన ఆలోచనకు రూపమే... ‘కలరి-యోగా’. మార్షల్ ఆర్ట్స్ అనగానే అందరికీ విదేశీ కళలు గుర్తొస్తాయి. కానీ మనదేశంలోనే ఓ గొప్ప మార్షల్ ఉంది... కలరిపయట్టు. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ కళలో నాలుగు దశలుంటాయి. మొదటి దశలో బాడీ మూమెంట్స్.. రెండో దశలో కర్ర సాము.. మూడో దశలో కత్తి వంటి ఆయు ధాలను వాడటం.. నాలుగో దశలో మర్మకళను నేర్పుతారు. నేను మూడేళ్లుగా కేరళ వెళ్లి కలరిపయట్టు నేర్చు కుంటున్నాను. మూడో దశకు చేరుకున్నాను. ఈ కళను మన వారికి కూడా పరిచయం చేయాలని పించింది. అయితే కలరిపయట్టు నేర్చుకోవడం అంత తేలిక కాదు. చాలా కష్టమైన విద్య కాబట్టి శరీరం సహకరించదు. ముందుగా యోగా ప్రాక్టీస్ చేస్తే... శరీరం ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఆపైన కలరిపయట్టు తేలికగా అబ్బుతుంది. అందువల్ల ఈ రెండిటినీ కలిపాను. అది మాత్రమే కాదు. మారిన జీవనశైలి అనారోగ్యాలను పెంచుతోంది. వాటిని అదుపు చేయాలంటే యోగాయే మంచి మార్గం. అటువంటి యోగాకి కలరిపయట్టును జతచేస్తే... వ్యాయామంతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్చుకున్నట్టు అవుతుంది కదా అని కూడా అనిపించింది. మహిళలపై నేరాలు పెరిగిపోతున్న ఈ సమయంలో ఇలాంటి విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది. కళ అడ్డంకి కాదు... మాకు హైదరాబాద్‌లో డ్యాన్స్ స్కూల్స్ ఉన్నాయి. వాటిలో చాలామంది డ్యాన్స్ నేర్చు కుంటున్నారు. అయితే ఇప్పటికీ చాలామంది తల్లి దండ్రులు డ్యాన్సూ గట్రా అంటూ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు, ముందు చదవండి అని పిల్లల్ని కట్టడి చేయడం కనిపిస్తోంది. కళలు సమయాన్ని వృథా చేస్తాయనడం కరెక్ట్ కాదు. నేను చిన్నప్పుడు ఎక్కువసేపు డ్యాన్స్‌తోనే కాలం గడిపినా, చదువులో వెనుకబడలేదు. బీఏ జర్నలిజంతో పాటు, రెండు సబ్జెక్ట్స్ మాస్టర్స్ చేసింది. నాట్యం చేసేటప్పుడు అవయవాలన్నింటినీ కో ఆర్డినేట్ చేయాల్సి వస్తుంది. అది ఏకాగ్రతను నేర్పుతుంది. ఏకాగ్రత ఎప్పుడైతే పెరుగుతుందో గ్రాహ్యశక్తి కూడా పెరుగుతుంది. అందుకే నాకు ఏ పాఠమైనా ఒకట్రెండుసార్లు చదివితే వచ్చేసేది. డ్యాన్స్ పిల్లల్ని మరింత షార్ప్‌గా తయారు చేస్తుందే తప్ప ఎందులోనూ వెనుకబడనివ్వదు. కాబట్టి పిల్లల్ని నిరుత్సాహపర్చకండి... ప్రోత్సహించండి!! ఫొటోలు: ఠాకూర్