
నిధి అగర్వాల్
ఒక సినిమా పూర్తవ్వకముందే మరో సినిమాలో యాక్ట్ చేసే చాన్స్ కొట్టేస్తే లక్కీ అంటారు. ముచ్చటగా మూడో సినిమా అవకాశం కూడా కొట్టేస్తే? నిధి అగర్వాల్ అంటారు. నాగచైతన్య తాజా చిత్రం ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు నిధి అగర్వాల్. ‘సవ్యసాచి’ సెట్స్‌లో ఉండగానే అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఇప్పుడు మూడో సినిమాకు సంతకం చేసి నట్టు సమాచారం. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ హీరోగా పరిచయం కానున్న చిత్రానికి కథానాయికగా ని«ధి అగర్వాల్ పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ నిర్మించనున్న ఈ చిత్రానికి సుకుమార్ అసిస్టెంట్ దర్శకుడు బుచ్చిబాబు సన డైరెక్టర్.
Comments
Please login to add a commentAdd a comment