
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. పుట్టెడు శోకంలో ఉన్న దత్తాత్రేయకు సానుభూతి తెలియజేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. ‘వైష్ణవ్ చనిపోయాడన్న విషాద వార్త నన్ను కలిచివేసింది. ఇలాంటి సమయంలో దేశం అంతా నీ బాధను పంచుకుంటుంది. మెడిసిన్ చదివి దేశ సేవ చేయాల్సిన అబ్బాయి చనిపోవడం దురదృష్టకరం. మీకు మీ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వైష్ణవ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని లేఖలో మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment