మీ అభిమానమే కొండంత అండ | Pilla Nuvvu Leni Jeevitham team Success Tour in Palakollu | Sakshi
Sakshi News home page

మీ అభిమానమే కొండంత అండ

Published Mon, Nov 24 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

మీ అభిమానమే కొండంత అండ

మీ అభిమానమే కొండంత అండ

 పాలకొల్లు అర్బన్: ‘మీ అభిమానమే మాకు కొండంత అండ.. మెగా కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఆశీర్వదించండి’ అని మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయి ధరమ్‌తేజ అన్నారు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా విజయోత్సవంలో భాగంగా చిత్ర యూనిట్ ఆది వారం రాత్రి పాలకొల్లు గీతా అన్నపూర్ణ థియేటర్‌కు వచ్చింది. హీరో, హీరోయిన్ రెజీనా, నిర్మాత బన్నీవాసు, శ్రీహర్షిత్, సహనటుడు ప్రభాస్ శ్రీను ప్రేకక్షకులతో మాట్లాడి సందడి చేశారు. తూ ర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి ప్రత్యేక బస్సులో వచ్చిన చిత్ర యూని ట్‌కు అభిమానులు తీన్‌మార్ డప్పులతో స్వాగతం పలికారు. హీరో సాయిధరమ్‌తేజ మాట్లాడుతూ నిజాయితీ, నిబద్ధత ఉంటే చిత్ర పరిశ్రమలో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని అన్నారు. ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ పాలకొల్లులో అభిమానుల సందడి చూస్తుంటే మనసు పులకరించిపోతుందన్నారు.
 
 తమకు ఇం తలా మరెక్కడా ఆదరణ లభించలేదని చెప్పారు. హీరోయిన్ రెజీనా, నిర్మాత బన్నీవాసు మాట్లాడారు. అనంతరం హీ రోను అభిమానులు గజమాలతో సత్కరించారు. చిరంజీవి అభిమానుల సం ఘం రాష్ట్ర కార్యదర్శి తులా రామలింగేశ్వరరావు, దాసిరెడ్డి శ్రీనివాసు, థియేటర్ యజమాని అహ్మద్ పాల్గొన్నారు. తొలి చిత్రంతోనే విజయం సొంతం చేసుకున్న సాయి ధరమ్‌తేజను చూసేం దుకు, మాట్లాడేందుకు అభిమానులు ఆసక్తి కనబర్చారు. అభిమానులంతా ఒక్కసారిగా ఎగబడటం, కేరింతలతో కార్యక్రమం రసాభాసగా మారింది. విలేకరులు ఫొటోలు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా తోపులాట జరగడం ప్రేక్షకులను నిరాశపర్చింది. అనంతరం భీమవరం గీతా మల్టీప్లెక్స్‌లో యూనిట్ సందడి చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement