చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సయామీఖేర్, శ్రద్ధాదాస్ కాంబినేషన్లో బొమ్మరిల్లు పతాకంపై వైవీయస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘రేయ్’ సినిమా థియేటర్ ట్రయల్ విడుదలైంది. ఈ సినిమాలో సయామీ ఖేర్, శ్రద్ధా దాస్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ఎ టు జెడ్ లుక్‌ని హైదరాబాద్‌లో అల్లు అర్జున్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ -‘‘రామ్‌చరణ్ కోసం సిద్ధం చేసుకున్న కథ ఇది. అయితే సాయిధరమ్‌తేజ్‌లో పాత చిరంజీవిగారి లుక్ కనిపించేసరికి ‘రేయ్’ని తనతోనే చేయాలని ఫిక్స్ అయ్యాను’’ అని తెలిపారు. కుదిరితే వైవీఎస్‌తో మరో సినిమా చేయాలని ఉందని సాయిధరమ్‌తేజ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సయామీఖేర్, శ్రద్ధాదాస్, కొమ్మినేని వెంకటేశ్వరరావు, శ్రీధర్ సీపాన, గుణశేఖరన్ తదితరులు మాట్లాడారు.