టాలీవుడ్ దర్శకుడిపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి!
ఓ టాలీవుడ్ దర్శకుడుపై నటుడు పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ఫిలింనగర్ లో ఓ వార్తా వెలుగులోకి వచ్చింది. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో 'రేయ్' చిత్రాన్ని మూడేళ్ల క్రితం ప్రారంభించి.. ఇంకా పూర్తికాకుండా నాన్చుతున్న దర్శకుడి తీరు పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి కారణమైంది.
గతంలో ఆర్ధిక సమస్యల్లో చిక్కుకున్న 'రేయ్' చిత్రానికి పవన్ ఆర్ధిక సహాయాన్ని కూడా అందించి పూర్తి చేసేందుకు సహకరించారనే వార్తలు గతంలో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయినా దర్శకుడు 'రేయ్' చిత్ర షూటింగ్ ను పూర్తి చేయడంలో దర్శకుడు విఫలం కావడం పవన్ నచ్చడం లేదట. 'రేయ్' చిత్రాన్ని పూర్తి చేసి విడుదలకు సిద్దం చేయాలని దర్శకుడికి మెగా ఫ్యామిలీ ఇటీవల సూచించారని ఫిలింనగర్ సమాచారం.
ఏదిఏమైనా మూడేళ్ల క్రితం ప్రారంభించిన 'రేయ్' చిత్రంపై మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. చిత్ర షూటింగ్ పూర్తి చేసుకోవడానికి, విడుదల కావడం అడ్డుపడిన సమస్యల్ని అధిగమించి ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం!