సాయిని హీరో చేద్దామని చరణ్‌తో చెప్పాను - అల్లు అర్జున్
‘‘సాయిధరమ్‌తేజ్‌కి చిన్నప్పట్నుంచీ సినిమాల పిచ్చి. తను ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడని తెలుసుకుని... హీరోని చేద్దామని రామ్‌చరణ్‌తో అంటే... ‘‘సాయి బుద్ధిగా చదువుకుంటున్నాడు. అనవసరంగా వాణ్ణి డిస్టర్బ్ చేయకు’’ అన్నాడు. కట్ చేస్తే... వైవీఎస్ చౌదరితో సాయి సినిమా అని తెలిసింది. నాకు శిరీష్ ఎంతో, సాయి కూడా అంతే’’ అని అల్లు అర్జున్ చెప్పారు.
సాయిధరమ్‌తేజ్, సయామీఖేర్, శ్రద్ధాదాస్ కాంబినేషన్‌లో బొమ్మరిల్లు పతాకంపై వైవీయస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘రేయ్’ సినిమా ఎ టు జెడ్ లుక్‌ని హైదరాబాద్‌లో బన్నీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ -‘‘రామ్‌చరణ్ కోసం సిద్ధం చేసుకున్న కథ ఇది. అయితే సాయిధరమ్‌తేజ్‌లో పాత చిరంజీవిగారి లుక్ కనిపించేసరికి ‘రేయ్’ని తనతోనే చేయాలని ఫిక్స్ అయ్యాను’’ అని తెలిపారు. కుదిరితే వైవీఎస్‌తో మరో సినిమా చేయాలని ఉందని సాయిధరమ్‌తేజ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సయామీఖేర్, శ్రద్ధాదాస్, కొమ్మినేని వెంకటేశ్వరరావు, శ్రీధర్ సీపాన, గుణశేఖరన్ తదితరులు మాట్లాడారు.