కరీబియన్ భాషలో రేయ్ | 'Rey' to release in West Indies | Sakshi
Sakshi News home page

కరీబియన్ భాషలో రేయ్

Published Sun, Apr 6 2014 11:23 PM | Last Updated on Mon, May 28 2018 2:13 PM

కరీబియన్ భాషలో రేయ్ - Sakshi

కరీబియన్ భాషలో రేయ్

బ్రిటీష్‌వారి కాలంలో చెరుకుతోటల పెంపకం కోసం కొంతమంది భారతీయుల్ని వెస్టిండీస్ తరలించారు. అలా వెళ్లి అక్కడే స్థిరపడ్డ ఓ భారతీయ కుటుంబానికి   చెందిన కుర్రాడి కథతో తెరకెక్కిన చిత్రం ‘రేయ్’. సాయిధరమ్‌తేజ్‌ని కథానాయకునిగా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. మరో విశేషం ఏంటంటే... వెస్టిండీస్‌కి చెందిన కరీబియన్ భాషలో డబ్ చేసి అదే రోజున అక్కడ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 
 
ఒక తెలుగు సినిమా వెస్టిండీస్ భాషలో అనువాదమవ్వడం ఇదే ప్రథమం. ఈ చిత్రం యూనిట్ అమెరికా, వెస్టిండీస్‌లలో ప్రదర్శించే ప్రీమియర్ షోలలో కూడా పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ- ‘‘వెస్టిండీస్‌లో పుట్టి, పెరిగిన తెలుగు కుర్రాడి కథ ఇది. కథానుగుణంగా ప్రథమార్ధం అంతా వెస్టిండీస్‌లో, ద్వితీ యార్ధమంతా అమెరికాలో నడుస్తుంది’’ అని తెలిపారు. సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొమ్మినేని వెంకటేశ్వరరావు, సమర్పణ: యలమంచిలి గీత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement