కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు : మోహన్‌బాబు | Actor Mohan Babu Responds On Check Bounce Case | Sakshi
Sakshi News home page

కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు : మోహన్‌బాబు

Apr 2 2019 3:21 PM | Updated on Apr 2 2019 3:43 PM

Actor Mohan Babu Responds On Check Bounce Case - Sakshi

ప్రముఖ‌ న‌టుడు, వైఎస్‌ఆర్సీపీ నేత మంచు మోహ‌న్‌బాబుకు హైద‌రాబాద్ ఎర్రమంజిల్ 23 మెట్రోపాలిటిన్ స్పెష‌ల్ మెజిస్ట్రేట్‌ కోర్టు ఏడాది పాటు శిక్షను ఖ‌రారు చేసింద‌ని వార్తలపై మోహ‌న్‌బాబు స్పందించారు. ‘2009లో ‘స‌లీమ్’ సినిమా చేస్తున్న స‌మయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని ద‌ర్శకుడు వైవీఎస్ చౌద‌రికి చెల్లించేశాం. మా బ్యాన‌ర్‌లోనే మ‌రో సినిమా చేయ‌డానికిగానూ ఆయ‌న‌కు రూ.40 ల‌క్షల చెక్ ఇచ్చాం. ‘స‌లీమ్’ అనుకున్న స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో.. వైవిఎస్ చౌద‌రితో త‌దుప‌రి చేయాల్సిన సినిమాను వ‌ద్దనుకున్నాం.

సినిమా చేయ‌డం లేద‌ని వైవీఎస్ చౌదరికి చెప్పాం. అలాగే చెక్‌ను బ్యాంకులో వేయ‌వ‌ద్దని కూడా చెప్పాం. అయినా కూడా కావాల‌నే చెక్‌ను బ్యాంకులో వేసి చెక్‌ను బౌన్స్ చేశారు. నాపై చెక్ బౌన్స్‌  కేసుని వేసి, కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. ఈ తీర్పుని మేం సెష‌న్స్ కోర్టులో చాలెంజ్ చేస్తున్నాం. కొన్ని చానెల్స్‌లో నాపై వ‌స్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ను న‌మ్మవద్దు’ అని పేర్కొంటు మోహన్‌ బాబు పత్రిక ప్రకటనను విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement