సీతారామరాజు, సీతారాముల కళ్యాణం చూతము రారండి, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వైవీఎస్ చౌదరి. తెలుగుదనం ఉట్టిపడేలా విభిన్న కథలతో సినిమాలు రూపొందించిన ఆయన కొంతకాలం బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు నందమూరి నాలుగో తరం నుంచి ఒకరిని వెండితెరకు ఆయన పరిచయం చేయనున్నాడు. ఈ విషయం గురించి వైవీఎస్ చౌదరి తాజాగా అధికారికంగా ప్రకటన చేశారు.
స్వర్గీయ హరికృష్ణ గారి మనమడిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు వైవీఎస్ చౌదరి ప్రకటించారు. హరికృష్ణ పెద్ద కుమారుడు స్వర్గీయ జానకీ రామ్ అబ్బాయి 'తారక రామారావు'ను ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన అన్నారు. తన తాతగారి పేరుతో నాలుగో తరం నట వారసుడిగా తారక రామారావు ఎంట్రీ ఇవ్వనున్నాడు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌లో యలమంచిలి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పిల్లలతో రూపొందిన పౌరాణిక చిత్రం ‘దానవీర శూర కర్ణ’లో కృష్ణుడి పాత్రలో బాల నటుడిగా తారక రామారావు నటించాడు.
వైవీఎస్ చౌదరి సినీ కెరీర్‌లో మంచి హిట్స్ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో సాయి ధుర్గ తేజ్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఆయనే నిర్మాతగా 'రేయ్' సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. ఆ తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత నందమూరి వారసుడి సినిమాతో మళ్లీ ఆయన మెగా ఫోన్ పట్టబోతున్నారు.
Director #YVSChowdary along with #YalamanchiliGeetha visited #NTRGhat and paid their respects to the Legendary NTR garu and took the blessings for their Production NO-1 under NEW TALENT ROARS@ ✨@HelloYvs @NewTalentRoars pic.twitter.com/MeEJvwnR4N
— BA Raju's Team (@baraju_SuperHit) June 10, 2024
Comments
Please login to add a commentAdd a comment