Taraka rama rao
-
వెండితెరపై కనిపించనున్న మరో ఎన్టీఆర్
సీతారామరాజు, సీతారాముల కళ్యాణం చూతము రారండి, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వైవీఎస్ చౌదరి. తెలుగుదనం ఉట్టిపడేలా విభిన్న కథలతో సినిమాలు రూపొందించిన ఆయన కొంతకాలం బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు నందమూరి నాలుగో తరం నుంచి ఒకరిని వెండితెరకు ఆయన పరిచయం చేయనున్నాడు. ఈ విషయం గురించి వైవీఎస్ చౌదరి తాజాగా అధికారికంగా ప్రకటన చేశారు.స్వర్గీయ హరికృష్ణ గారి మనమడిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు వైవీఎస్ చౌదరి ప్రకటించారు. హరికృష్ణ పెద్ద కుమారుడు స్వర్గీయ జానకీ రామ్ అబ్బాయి 'తారక రామారావు'ను ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన అన్నారు. తన తాతగారి పేరుతో నాలుగో తరం నట వారసుడిగా తారక రామారావు ఎంట్రీ ఇవ్వనున్నాడు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్లో యలమంచిలి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పిల్లలతో రూపొందిన పౌరాణిక చిత్రం ‘దానవీర శూర కర్ణ’లో కృష్ణుడి పాత్రలో బాల నటుడిగా తారక రామారావు నటించాడు.వైవీఎస్ చౌదరి సినీ కెరీర్లో మంచి హిట్స్ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో సాయి ధుర్గ తేజ్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఆయనే నిర్మాతగా 'రేయ్' సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. ఆ తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత నందమూరి వారసుడి సినిమాతో మళ్లీ ఆయన మెగా ఫోన్ పట్టబోతున్నారు.Director #YVSChowdary along with #YalamanchiliGeetha visited #NTRGhat and paid their respects to the Legendary NTR garu and took the blessings for their Production NO-1 under NEW TALENT ROARS@ ✨@HelloYvs @NewTalentRoars pic.twitter.com/MeEJvwnR4N— BA Raju's Team (@baraju_SuperHit) June 10, 2024 -
అన్ని ‘పంచాయతీ’లను గెలవాలి
ప్రత్యేక చాంబర్... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కె.తారక రామారావు సోమవారం ఉదయం 11.56 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. కేటీఆర్ కోసం తెలంగాణభవన్‌లో ప్రత్యేకంగా చాంబర్‌ను ఏర్పాటు చేశారు. వచ్చే ఆరేడు నెలల్లో గ్రామపంచాయతీ, సహకార, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా ఉన్న నేపథ్యంలో తెలంగాణభవన్ కేంద్రంగా కేటీఆర్ పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండువారాల్లో అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ కమిటీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర సమితి గురి పెట్టింది. అన్ని గ్రామపంచాయతీలను గెలిచేలా వ్యూహం రచిస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, బాధ్యులకు స్పష్టం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ప్రతి గ్రామపంచాయతీకి రూ.పది లక్షల గ్రాంట్ వస్తుందని, వీలైనన్ని పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా ప్రయత్నించాలని సూచించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తొలిసారి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం తెలంగాణ భవన్లో జరిగింది. టీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియపై కేటీఆర్ ఈ సమావేశంలో ప్రసంగిం చారు. 2006 నుంచి ఇప్పటిదాకా టీఆర్ఎస్లో తన రాజకీయ అనుభవాలను వివరించారు. డిసెంబర్ 26 నుండి జనవరి 6వ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రస్థాయి నేతలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఈ ప్రక్రియకు పదిరోజుల గడువున్న నేపథ్యంలో అందరూ గట్టిగా పనిచేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఫిబ్రవరిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, బీమా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. మార్చి నుంచి లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి లోక్సభస్థానానికి ఒక ప్రధాన కార్యదర్శిని, ముగ్గురు కార్యదర్శులను ఇన్‌చార్జీలుగా నియమిస్తామని, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు ఇన్చార్జీలు గా ఉంటారని తెలిపారు. జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. తెలంగాణభవన్‌లో ప్రజల ఫిర్యాదు విభాగం(పబ్లిక్ గ్రీవెన్స్ సెల్)ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ విభాగం పనిచేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ముఠా గోపాల్, సుంకే రవిశంకర్, మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలను టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి పదవుల నుంచి ఉపసం హరిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్లో వైరా ఎమ్మెల్యే చేరిక వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లావుడ్య రాములునాయక్ శనివారం టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. అనంతరం రాములునాయక్ తన అనుచరులతో కలసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ గులాబీ కండువా కప్పి రాములునాయక్‌ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం వైరా నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ‘ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో మొదటి చేరిక వైరా నుంచి కావడం ఆనందంగా ఉంది. వైరా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తా. తెలంగాణ అంతటా అనుకూల పవనాలు వీచినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫలితాలు నిరాశ కలిగించాయి. రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసి జిల్లావ్యాప్తంగా గులాబీ జెండా ఎగురవేస్తాం. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి బీడు భూములను సస్యశ్యామలం చేస్తాం. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాలు పూర్తయితే టీఆర్ఎస్ అజేయశక్తిగా మారుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో పదహారు సీట్లు గెలిచి టీఆర్ఎస్ సత్తా చాటుదాం. ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకునేలా కార్యకర్తలు శ్రమించాలి. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలనేది టీఆర్ఎస్ శాసించాలి. మనం చెబితే ఏర్పడే ప్రభుత్వం ఢిల్లీలో కావాలంటే టీఆర్ఎస్ 16 సీట్లు గెలవాలి. యాచించే స్థితి నుంచి ఢిల్లీలో శాసించే స్థితికి తెలంగాణ ఎదగాలి. బీజేపీకి సంఖ్యాబలం ఉండబట్టే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పెడచెవిన బెట్టింది. కేంద్రంలో మనకు అనుకూల ప్రభుత్వం ఏర్పడితే బయ్యారం లాంటి వాటికి పరిష్కారం దొరుకుతుంది. ఖమ్మంలో అన్ని నియోజక వర్గాలను అభివృద్ధి చేస్తాం. బంగారు తెలంగాణ దిశగా చిత్తశుద్ధితో పని చేస్తాం’అన్నారు. రాములు నాయక్‌ను కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్న కేటీఆర్. చిత్రంలో పొంగులేటి -
ఏపీ చిన్నారికి తెలంగాణ మంత్రి సాయం
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెట్‌జన్లు తీసుకువచ్చే సమస్యలను తనదైన శైలిలో స్పందించించి పరిష్కరించడంలో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కె తారకరామారావు ఎప్పుడూ ముందుంటారు. ఇలా ఇప్పటికే చాలా సార్లు స్పందించిన మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. అభం శుభం తెలియని చిన్నారి కంటి ఆపరేషన్‌కు రెండు గంటల్లో రెండు లక్షల రూపాయలు మంజూరు చేసి చిన్నారి కంటి చూపు రావడానికి కారణమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ చిన్నారి కంటిచూపు సమస్యతో బాధపడుతోంది. చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న కూడా వర్తించడం లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో భరత్ అనే ఓ నెట్‌జన్ వారి సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. బాధితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని, ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నా ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో వర్తించడంలేదంటూ సమస్యను మంత్రి కేటీఆర్‌కు వివరించాడు. చికిత్సకు సిఫారసు చేసి చిన్నారికి అండగా ఉంటాలని ట్విటర్లో కోరాడు. దీనిపై స్పందించిన మంత్రి తప్పక సహాయమందిస్తామని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి తగిన విధంగా ఆదుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. Absolutely adorable she is @KTRoffice to coordinate with LV Prasad Eye Institute or Sarojini Devi Eye hoapiral https://t.co/Krky6RV29s — KTR (@KTRTRS) April 6, 2018 @KTRTRS annayya chinna papa ki eye problem annayya..lv prasads lo operation cheyali..meeru oka letter issue chesthe freega avuddi annayya..velladi AP ..arogya sree work avvadam ledu..pls help annayya.. pic.twitter.com/bIwIGefoET — bharath143 (@kumarbharath) April 6, 2018 -
చేనేత, వస్త్ర పాలసీలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: చేనేత, వస్త్ర పరిశ్రమలకు ఊతమిచ్చే లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పాలసీల ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. ఈ పాలసీలను రాష్ట్ర పరిశ్రమలు, టెక్స్‌టైల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం విడుదల చేయనున్నారు. చేనేత, వస్త్ర, రెడీమేడ్ దుస్తుల తయారీ పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, చేనేత పరిశ్రమల స్థాపనలో సింగిల్ విండో విధానంలో అనుమతులు తదితర అంశాలను ఈ పాలసీల్లో చేర్చారు. టీఎస్ ఐపాస్‌లో పేర్కొన్న రాయితీలే కాకుండా అదనపు రాయితీలు, ప్రోత్సాహకాలనూ నూతన పాలసీల్లో చేర్చినట్లు తెలిసింది. దారం తయారీ మొదలుకొని వస్త్రాల ఉత్పత్తి, మార్కెటింగ్, పరిశోధన, శిక్షణ తదితర సౌకర్యాలన్నీ ఒకేచోట అందుబాటులో ఉండేలా వరంగల్ జిల్లాలో ‘కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు’ ఏర్పాటును నూతన పాలసీల్లో భాగంగా చేర్చినట్లు సమాచారం. చేనేత రంగంలో పరిశోధన, నైపుణ్యానికి పెద్దపీట వేస్తూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పరిశోధన, శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చేనేత, టెక్స్టైల్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు టీఎస్ ఐపాస్‌కు అనుబంధంగా ప్రత్యేక డెస్క్ ఏర్పాటును ప్రతిపాదించారు. వీటితోపాటు అంతర్జాతీయ ఎగుమతులకు అనువైన రీతిలో వస్త్ర ఉత్పత్తుల నాణ్యత కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నూతన పాలసీల్లో ప్రతిపాదించినట్లు సమాచారం. ఇరు రంగాలకూ సమ ప్రాధాన్యత... వ్యవసాయం తర్వాత ఉపాధి, ఉత్పత్తి, ఆదాయపరంగా చేనేత, వస్త్ర పరిశ్రమలకు రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత వుంది. రాష్ట్రంలో ఏటా 60 లక్షల బేళ్ల పత్తి దిగుబడి వస్తుండగా ఇందులో కేవలం 10 శాతాన్ని మాత్రమే రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. పత్తి లభ్యతకు అనుగుణంగా కాటన్ ఆధారిత అనుబంధ పరిశ్రమలు రాష్ట్రంలో లేకపోవడం చేనేత రంగం అభివృద్ధికి అవరోధంగా మారింది. రాష్ట్రంలో చేనేత రంగానికి ఆదరణ తగ్గడంతోపాటు ఇప్పటికే ఏర్పాటైన చేనేత పార్కులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత పాలసీ రూపకల్పనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో చేనేత పరిశ్రమల స్థితిగతులపై అధికారులు నివేదిక రూపొందించి దాని ఆధారంగా ‘తెలంగాణ చేనేత, వస్త్ర ఉత్పత్తుల పాలసీ 2015-2020’ (టీ టాప్)ను సిద్ధం చేశారు. ముసాయిదా ప్రతిని గతేడాది డిసెంబర్లో సీఎం కేసీఆర్ పరిశీలనకు సమర్పించగా ఆమోదానికి నోచుకోలేదు. దీంతో అధికారులు చేనేత, టెక్స్టైల్ రంగాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ వేర్వేరు పాలసీలను రూపొందించారు. పాలసీల విధి విధానాలపై చేనేత సంఘాల ప్రతినిధులతో జూలైలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో గద్వాల, పోచంపల్లి తదితర ప్రాంతాల నేత కార్మికుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. -
‘ఆరోగ్యలక్ష్మి’కి రూ.800 కోట్లు
నిజాంసాగర్ (నిజామాబాద్): రాష్ట్రంలో సోదరీమణుల అవసరాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని, ఇందుకోసం రూ.800 కోట్లు మంజూరు చేశారని పంచాయతీరాజ్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. ఈ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందని అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కుర్తిలో గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పంట రుణాలు మాఫీ చేశామన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.17 వేల కోట్ల భారం పడిందని తెలిపారు. వచ్చే వేసవి నుంచి వ్యవసాయూనికి పగటిపూట నిరంతరాయంగా 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పునః నిర్మాణం కోసం ముఖ్యమంత్రి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఆడపడుచులు తాగునీటికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు రూ.250 కోట్లతో వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని, వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా శుద్ధ జలాలను అందిస్తామని చెప్పారు. -
‘పంచాయతీ’లో విప్లవాత్మక మార్పులు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు. కేరళలో విజయవంతమైన పంచాయతీ వ్యవస్థను స్ఫూర్తిగా తీసుకుని అక్కడ అమలు చేస్తున్న పలు విధానాలను తెలంగాణలో కూడా అమలు చేస్తామన్నారు. పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలపై అధ్యయనంలో భాగంగా బుధవారం ఆయన తిరువనంతపురం జిల్లాలోని మణికల్ గ్రామంలో పర్యటించారు. మంత్రి పర్యటన వివరాలను ఇక్కడ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మణికల్ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కమిటీలు, ఇతర సిబ్బంది, ప్రజలతో సమావేశమై ఆయన పలు అంశాలపై చర్చించారు. కేరళలోని గ్రామ పంచాయతీలు తమ అధికారాలను వినియోగించుకుని సమర్థంగా పనిచేస్తున్నాయని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. కేరళలో కేవలం 964 గ్రామ పంచాయతీలు మాత్రమే ఉన్నాయని, తెలంగాణలో మాత్రం వాటి సంఖ్య 8,400పైనే ఉంటుందన్నారు. సమీకృత గ్రామ పంచాయతీ భవన సముదాయంలోని వసతులను ఆయన పరిశీలించారు. ఒకే చోట పౌర సేవలు అందిస్తున్న తీరును కొనియాడారు. అనంతరం మంత్రి కేటీఆర్ .. కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థ రూపకర్త, కేంద్ర ప్రత్యేక కార్యదర్శి విజయానంద్, సీనియర్ అధికారి జేఎం వర్గీస్‌తో భేటీ అయ్యారు. కేరళ నమూనా స్ఫూర్తితో తెలంగాణలో అమలు చేయదగిన కార్యక్రమాలపై అధికారుల నుంచి సలహాలు స్వీకరిం చారు. ‘కేరళ స్థానిక పాలన సేవల పథకం’ వివరాలను సేకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రేమండ్ పీటర్ని మంత్రి ఆదేశించారు. ఈ పర్యటనలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. -
వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్!
హన్మకొండ : వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. మంగళవారం శాసనసభలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ జిల్లాలో పరిశ్రమల స్థాపన, పారిశ్రామిక విధానంపై మాట్లాడారు. వినయ్‌భాస్కర్‌తోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. వరంగల్‌లో టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని వెల్లడించారు. టెక్స్టైల్ రంగంలో ప్రత్యేకమైన ఇన్సెంటీవ్‌ను వరంగల్, సిరిసిల్ల వంటి ప్రాంతాల్లో నెలకొల్పడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. అంతకుముందు అసెంబ్లీలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. ఆజాంజాహి మిల్లు మూతతో దాదాపు 30 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. దీంతో ఆ ప్రాంతం వెలవెల బోతుందన్నారు. కేసీఆర్ సీఎం కావడం, వరంగల్‌ను పారిశ్రామిక కారిడార్‌గా మార్చుతామనడం సంతోషంగా ఉందన్నారు. నూతన పారిశ్రామిక విధానం ద్వారా వేలాది మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కలుగుతాయనే నమ్మకం ఉందన్నారు. ఈ విధానంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత.. మహిళలు, బీసీ, మైనారిటీలకు ఇన్సెంటీవ్స్ ఇస్తారా అని ప్రశ్నించారు. నూతన పారిశ్రామిక విధానంలో స్కిల్ డెవలప్మెంట్కు ఏదైన కార్యక్రమం తీసుకుంటున్నారా అన్నారు. ఇన్నోవేటీవ్, ఇన్క్యూబిరేట్,ఇన్కార్పొరేట్ విధానం ద్వారా లబ్ధి జరుగుతుందో తెలియజేయాలని కోరారు. అదేవిధంగా బిల్ట్‌లో 3 వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని అడిగారు. -
ఎంపీని అవమానిస్తారా?
* ఎంపీ కవితపై నిరాధార వ్యాఖ్యలు చేశారంటూ రేవంత్‌రెడ్డిపై అధికారపక్షం ధ్వజం * టీడీపీ సభ్యుడుక్షమాపణలు చెప్పాలని డిమాండ్ * ముందుగా కేటీఆర్‌పై సభాహక్కుల నోటీసుకు చర్య తీసుకోవాలన్న టీడీపీ * రెండు పార్టీల ఎమ్మెల్యేల ఆందోళనతో అసెంబ్లీ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: పాలక, విపక్షాల వాదోపవాదాలు, నిరసనల మధ్య శాసనసభ దద్దరిల్లింది. నిజామాబాద్ ఎంపీ కవితపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ సభ్యుల నిరసనకు, ఉద్రిక్తతకు దారితీసింది. సమగ్ర కుటుంబ సర్వేలో ఎంపీ కవిత రెండు చోట్ల తన పేరును నమోదు చేసుకున్నట్లు మంగళవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రేవంత్ పేర్కొన్నారు. దీనిపై బుధవారం అసెంబ్లీలో దుమారం రేగింది. రేవంత్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం ఇచ్చారని, నిజామాబాద్ ఎంపీకి, అసెంబ్లీ సభ్యులందరికీ ఆయన క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. దీనిపై ఏమాత్రం తొణకని టీడీపీ సభ్యులు.. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే ముందు మంత్రి తారకరామారావుపై ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసుపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని పట్టుపట్టారు. దీంతో ఇరుపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ అట్టుడికింది. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పిన తర్వాతే మరే అంశాన్నైనా ప్రస్తావించాలని అధికారపక్షం పట్టుబట్టడంతో రెండు గంటల పాటు సభ స్తంభించిపోయింది. రేవంత్‌రెడ్డి చేసిన అభియోగాలకు సంబంధించి వివిధ పార్టీల నేతల అభిప్రాయాలను స్పీకర్ కోరారు. అవి తప్పుడు అభియోగాలైతే.. భేషజానికి పోకుండా వాటిని ఉపసంహరించుకోవాలని వారంతా సూచించారు. అంతకుముందు సాధారణ బడ్జెట్‌పై ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగం తర్వాత రేవంత్‌రెడ్డి ప్రసంగించాల్సి ఉంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌పై సభా ఉల్లంఘన నోటీసును ప్రస్తావించే సమయంలోనే.. టీఆర్ఎస్ సభ్యురాలు గొంగడి సునీత పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద ఎంపీ కవిత అంశాన్ని లేవనెత్తారు. తాత జాగీరా?: మంత్రి ఈటెల ఎంపీలు, ఎమ్మెల్యేలపై మాట్లాడే ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుందని, అయితే నోటీస్ ఇవ్వకుండానే రేవంత్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని, ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. దీంతో వివాదం ఒక్కసారిగా రాజుకుంది. వాగ్వాదాల మధ్య సభను పదినిమిషాల పాటు స్పీకర్ వాయిదావేశారు. కేటీఆర్‌పై సభా హక్కుల నోటీస్‌కు పట్టు సభ తిరిగి ప్రారంభం కాగానే మంత్రి కేటీఆర్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ అంశాన్ని రేవంత్‌రెడ్డి, ఆ తర్వాత టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రస్తావించారు. సభ్యుల వ్యాఖ్యల మధ్యే సభను స్పీకర్ మరోసారి పది నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ మళ్లీ మొదలుకాగానే రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..క్రైస్తవ మైనారిటీ సభ్యులను అసెంబ్లీకి నామినేట్ చేసినట్లు ఈ ఎమ్మెల్యేలను ఏపీ ప్రభుత్వం నామినేట్ చేసిందని టీడీపీ సభ్యులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మంగళవారం సభలో వ్యాఖ్యానించటం ప్రజలను, తమను, స్పీకర్‌ను అవమానపరటమేనన్నారు. సభాహక్కుల ఉల్లంఘనపై చర్యలు తీసుకుని కేటీఆర్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. ఎంపీలపై ఆరోపణలు చేసే ముందు స్పీకర్ అనుమతి తీసుకోవాలని నిబంధనల్లో ఉన్నట్లు మంత్రి హరీశ్ చెప్పారు. అయితే తాము ఇదివరకే స్పీకర్ అనుమతి తీసుకున్నందున మంత్రి కేటీఆర్‌పై సభా హక్కుల ఉల్లంఘన అంశాన్ని మొదట తీసుకోవాలని రేవంత్‌రెడ్డి పట్టుబట్టారు. దీంతో రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో సభను స్పీకర్ మధుసూదనాచారి గురువారానికి వాయిదా వేశారు. -
ఏడాదిలోగా ప్రతి స్కూల్లో మరుగుదొడ్లు!
హైదరాబాద్: 2015 ఆగస్టు 15 నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాగునీటి సదుపాయం కూడా కచ్చితంగా ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. సచివాలయంలో సోమవారం పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్ పరిస్థితులపై విద్యాశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖ అధికారులతో పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు, విద్యాశాఖమంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షించారు. టాయిలెట్ల నిర్మాణానికి చేపట్టాలని చర్యలను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భేటీ నిర్ణయాలను జగదీశ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం 24,364 వరకు పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. 4,693 వరకు పాఠశాలల్లో తాగునీటి సదుపాయం కల్పించేందుకు రెండుశాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. 2,100 పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక టాయిలెట్ సదుపాయం కల్పించాల్సి ఉందని తేల్చారు. పాఠశాలల్లో టాయిలెట్ల పరిస్థితిపై సమగ్ర నివేదికలను వారంరోజుల్లో తమకు అందజేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. -
నిజాంషుగర్స్‌ను టేకోవర్ చేస్తాం
బోధన్,న్యూస్‌లైన్ : రాబోయే తెలంగాణ రాష్ట్రంలో నిజాంషుగర్స్‌ను టేకోవర్ చేసుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) అన్నారు. నిజాంషుగర్స్ కార్మికులకు మంచి రోజులు వచ్చే సమయం దగ్గరలోనే ఉన్నాయని ఆయన అన్నారు. నిజాంషుగర్స్ స్థాపించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీఆర్ఎస్ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి మహ్మద్ షకీల్ అధ్వర్యంలో ఆదివారం ఫ్యాక్టరీ ప్రధాన గేట్‌కు ఎదురుగా వజ్రోత్సవ సభను నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరై మాట్లాడారు. వందల కోట్ల విలువచేసే నిజాంషుగర్ ఫ్యాక్టరీని 2002లో అప్పటి సీఎం చంద్రబాబు ఆంధ్ర ప్రాంతానికి చెందిన తన అస్మదీయులకు అప్పన్నంగా అప్పగించారని ఆరోపించారు. ప్రభుత్వరంగంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో నెలకు రూ. 18 వేల వేతనంపై పనిచేసిన కార్మికులు ,ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో తొలగించారన్నారు. ప్రైవేట్ యాజమాన్యం వారినే మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుని నెలకు రూ. 6 వేల వేతనంతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని ఆరోపించారు.కోర్టు తీర్పులను పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసి అన్యాయం చేశాడన్నారు. ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా మంత్రులతో సబ్ కమిటీ వేసి నిజాంషుగర్స్‌ను ప్రైవేటీకరించేందుకు చేసిన కుట్రలను నిజాంషుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం.అప్పిరెడ్డి హైకోర్టులో స్టే తెచ్చి అడ్డుకున్నారని చెప్పారు. ఒకప్పుడు ఆసియా ఖండంలోనే పెద్ద ఫ్యాక్టరీగా పేరు గడించిన నిజాంషుగర్స్ పరిస్థితి సీమాంధ్ర పాలకుల హయాంలో దయనీయంగా మారిందన్నారు. ఫ్యాక్టరీ వజ్రోత్సవాలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. బాధ్యతయుత పార్టీగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాము నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ కవచంగా నిలుస్తుందని, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు పార్టీకి అండగా నిలువాలని కోరారు. సచార్ కమిటీ సిఫార్సులను తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. జిల్లా అభివృద్ధిని విస్మరించారు... టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పో శెట్టి మాట్లాడుతూ... సీమాంధ్ర పాలకులు జి ల్లా అభివృద్ధికి ఒరగబెట్టింది ఏమి లేదన్నారు. నిజాం ప్రభువులు కాలంలోనే నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు, నిజాంసుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధికి పాలకులు విస్మరించారన్నారు. టీఆర్ఎస్ విలీనం అవాస్తవం... పార్టీ జిల్లా ఇన్చార్జి కరమిమెల్ల బాబూరావు మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటు ఖాయమని, రాబోయే ఎన్నికల్లో 119 అసెంబ్లీ, 19 పార్లమెంట్ స్థానాలకు పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. తమ పార్టీతో ఇతర పార్టీలో విలీనం అవుతుందని ప్రచారం అవాస్తవం అన్నారు. ఫ్యాక్టరీని అమ్మే కుట్ర... టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణలోని ఏ ఫ్యాక్టరీ అమ్మితే ఎన్ని కోట్లు మిగులుతాయేనని డబ్బు కక్కుర్తితో ఫ్యాక్టరీలను అమ్ముకునేందుకు యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ఎస్ఎఫ్ వజ్రోత్సవ సభ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ రజాక్, జిల్లా నాయకులు బిగాల గణేష్‌గుప్త, బస్వ లక్ష్మీనర్సయ్య, జీవన్‌రెడ్డి, రాజేందర్, దాదన్నగారి విఠల్, వేముల సురేందర్, నిజాంషుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం.అప్పిరెడ్డి, నియోజకవర్గ నాయకులు గిర్దావర్ గంగారెడ్డి, రవికిరణ్, శ్యాంరావు, బాల్‌రాజ్, కాశ్యం సాయిలు, నవీన్ కుమార్, భరత్‌యాదవ్, ఫయాజుద్దీన్, కార్యకర్తలు, కాలనీ వాసులు, కార్మికులు పాల్గొన్నారు. -
దళితుల ‘దారి’ మళ్లింది!
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రజాప్రతినిధుల పక్షపాతవైఖరి, అధికారుల అనాలోచిత చర్యలు దళితుల పాలిట శాపంగా పరిగణిస్తున్నాయి. దళితుల పేరుతో లబ్ధిపొందాలని ప్రణాళికలు రూపొందించుకున్న అగ్రవర్ణాల వారి అరాచక చర్యలకు అధికారులు వంతపాడడం పలు విమర్శలకు తావిస్తుంది. దళితుల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పాలకులు చేస్తున్న ప్రకటనలు ‘నేతిబీరకాయ’ చందంగా మారిపోయాయనే విమర్శలకు కొన్ని సంఘటనలతో బలం చేకూరుతుంది. దళితుల పేరుతో నిధులు దారిమళ్లిపోతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రహదారి నిర్మాణం నిమిత్తం విడుదల చేసిన నిధులు వారికేమాత్రం ఉపయోగపడని వైనం నిమ్మకూరు- చినముత్తేవి రోడ్డు ప్రతిపాదనల్లో వెలుగుచూసింది.నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా తన నిధుల నుంచి రూ.1.02 కోట్లను నిమ్మకూరు-చినముత్తేవి రోడ్డు అభివృద్ధికి కేటాయించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామరావు సొంత గ్రామమైన నిమ్మకూరు నుంచి మొవ్వ మండలం చినముత్తేవి దళితవాడ వరకు 1.8 కిలోమీటర్ల మేర డొంక రోడ్డును తారురోడ్డుగా అభివృద్ధి చేసేందుకు ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రతిపాదనలు ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నాయి. అయితే అసలు మతలబు అంతా ఇక్కడే ఉంది. నిమ్మకూరు నుంచి చినముత్తేవి వెళ్లడానికి సరాసరి రోడ్డు లేనే లేదు. నిమ్మకూరు నుంచి 1.8 కిలోమీటర్ల మేర డొంక రోడ్డు ఉంది. అరకిలోమీటరు మేర పొలాలు అడ్డుగా ఉన్నాయి. పంట కాల్వ ఉంది. చినముత్తేవి దళితవాడకు వెళ్లాలంటే కనీసం కాలిబాట లేని దుస్థితి. ఇటువంటి పరిస్థితిలో కొత్తగా ప్రతిపాదించిన రోడ్డు దళితవాడ వరకు వెళ్లే అవకాశం లేదు. అయినా ఆ ప్రాంతంలో పోలాలున్న కొంతమంది ‘పెద్ద మనుషుల’ సౌకర్యార్థం దళితుల నిధులను దారి మళ్లించడం విమర్శలకు తావిస్తోంది. నిమ్మకూరు నుంచి చినముత్తేవి దళితవాడ వరకు డొంకరోడ్డును తారురోడ్డుగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రతిపాదనల్లో చూపి అధికారులు పనులకు టెండర్లు పిలిచారు. అసలు లేనిరోడ్డును ఎలా అభివృద్ధి చేస్తారని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే...అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు కేటాయించే నిధుల నుంచి 22శాతం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటాయించాల్సి ఉంది. దళితవాడల అభివృద్ధికి మాత్రమే ఆ నిధులను వినియోగించాల్సి ఉంది. దీంతో నిమ్మకూరు డొంక రోడ్డును తారురోడ్డుగా మార్చేందుకు నిమ్మకూరు సమీపంలోని చినముత్తేవి దళితవాడను ప్రతిపాదనల్లో చూపి ఈ రోడ్డు నిర్మాణానికి రూపకల్పన చేశారు. వాస్తవంగా ఈ రోడ్డు అభివృద్ధి చేస్తే నిమ్మకూరులోని కొంతమంది పెద్దలకు మాత్రమే ఉపయోగంగా ఉంటుందని... వ్యూహాత్మకంగానే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులనుఈ విధంగా దారి మళ్లించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. -
నీది కల్తీలేని అవకాశవాదం
చంద్రబాబుకు కేటీఆర్ బహిరంగ లేఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వైఖరి కల్తీలేని, నిఖార్సయిన పచ్చి అవకాశవాదానికి పరాకాష్ట అని టీఆర్ఎస్ నేత కే తారక రామారావు విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన బాబు ఇప్పుడు మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు కేటీఆర్ గురువారం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. 2009 ఎన్నికలకు ముందు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న విషయాన్ని లేఖలో గుర్తుచేశారు. ‘ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఆ నిర్ణయం తీసుకున్నారా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పై కల్లబొల్లి విమర్శలు చేయడం, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడకు సహకరించడం.. ఈ పద్దతుల ద్వారా రాజకీయాల్లో పచ్చి అవకాశవాదానికి, కొత్తరకం మోసాలకు చంద్రబాబు తెరతీశారని కేటీఆర్ విమర్శించారు. ‘రాజకీయాల్లో తలలు పండిపోయిన నేతలకు ఎలాంటి రాజకీయ అనుభవంలేని లోకేశ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం వారసత్వ రాజకీయం కాదా’ అన్నారు. -
హక్కుల్లేని రాష్ట్రమెందుకు?
సాక్షి, హైదరాబాద్: సర్వహక్కులు లేని తెలంగాణ రాష్ట్రం ఎందుకు? అని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, శాసనసభ్యుడు కె.తారక రామారావు, ఎంపీ జి.వివేక్ ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీ, కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్టుగా హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో సంపూర్ణ తెలంగాణ కావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌పై హక్కుల్లోనూ, 10 జిల్లాల సరిహద్దుల్లోనూ ఏం కొంచెం తక్కువైనా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు, నీళ్లు, నిధులు, కొలువులు వంటివాటిపై అధికారాల్లేకుంటే తెలంగాణ పునర్నిర్మాణం ఎలా సాధ్యమని కేకే ప్రశ్నించారు. హైదరాబాద్‌పై ఆంక్షలు పెడితే అది తెలంగాణ ప్రజలను కించపర్చినట్లేనని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రానికే ఆంక్షలు, షరతులు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 10 ఏళ్ల తర్వాత వారే బాధపడతారని ఏఐసీసీ ఇన్చార్జీ దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 60 ఏళ్లలో తెలంగాణకు జరిగిన అన్యాయం, ఆవేదనను ఇప్పటికే చాలాసార్లు దిగ్విజయ్ సింగ్‌కు వివరించామన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ఎంపీ జి.వివేక్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో సీమాంధ్రులు 6 లక్షలు మాత్రమే అని శ్రీకృష్ణ కమిటీ నివేదికలో చెప్పినా సీమాంధ్ర నేతలు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 7 యూనివర్సిటీలుంటే సీమాం ధ్రలో 12 ఉన్నాయన్నారు. ఉద్యోగుల సంఖ్యపై కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేసినట్టుగా సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు పేర్కొనటం అబద్ధమని కేటీఆర్ చెప్పారు. దీన్ని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని సవాల్ చేశారు. ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేని తెలంగాణకోసం కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. నేడు ఢిల్లీకి కేసీఆర్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, కె.కేశవరావు జీవోఎంతో సమావేశమయ్యేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ నిర్వహించే శిక్షణా శిబిరాల ఉపన్యాసకులతో ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ కార్యాలయంలో కేసీఆర్ సమావేశం కానున్నారు. శిక్షణా శిబిరాలకు దిశానిర్దేశం చేసిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. -
కుట్రలు పటాపంచలు చేయాలి: కోదండరాం
సాక్షి, కొత్తగూడెం/భద్రాచలం : ఎలాంటి కోతలు లేకుండా సంపూర్ణ తెలంగాణ కావాలని, అలా తెచ్చే బాధ్యత తెలంగాణలోని కాంగ్రెస్ నేతలపై ఉందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లాలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్తగూడెం మండలం రుద్రంపూర్ గ్రామంలో స్థానిక జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమరవీరుల స్మారక స్థూపాన్ని కోదండరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. తెలంగాణను అడ్డుకునేందుకే కుట్రలు జరుగుతున్నాయని, వాటిని పటాపంచలు చేసేందుకు ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే తారకరామారావు మాట్లాడుతూ, ఈనెల 12న కేంద్ర మంత్రివర్గాన్ని కలిసే సందర్భంలో సింగరేణిపై హక్కులు, భద్రాచలం, బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్థాపన వంటి అంశాలు టీఆర్ఎస్ నివేదిస్తుందన్నారు. సమన్యాయం అంటే ఏమిటో టీడీపీ నేత చంద్రబాబు చెప్పరని, ఆయన మానసిక పరిస్థితి సరిగ్గాలేదని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఏర్పాటుచేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. భద్రాచలం తెలంగాణ ఆత్మ భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమేనని, ఎట్టి పరిస్థితులలోనూ సీమాంధ్రకు వదిలే పరిస్థితి లేదని కోదండరాం తేల్చి చెప్పారు. ‘భద్రాచలం తెలంగాణలో అంతార్భాగం’ అనే అంశంపై టీజేఏసీ ఆధ్వర్యంలో భద్రాచలంలో జరిగిన చర్చా వేదికకు హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. భద్రాచలానికి భౌగోళికంగా, సంస్కృతీ, పరిపాలనా పరంగా ఏన్నో ఏళ్ల నుంచి తెలంగాణతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు. కేవలం పోలవరం నిర్మాణం కోసమే నాయకులు భద్రాచలాన్ని ఆంధ్రలో కలపాలని అడగటం వారి స్వార్థపూరిత ఆలోచన అని విమర్శించారు. ముంపుతో ఆదివాసులకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.