ప్రతి పాటని ఒక తపస్సులా, తన సొంత బిడ్డలా భావిస్తూ పండితులను, పామరులను ఏకకాలంలో ఆకట్టుకుని కట్టిపడేసే ఒక సాహిత్యపు నిత్యాన్వేషి, నిరంతర పరిశోధకుడు అయిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి’గారు అకాల మరణం చెందటం తెలుగు చలన చిత్ర పరిశ్రమ చేసుకున్న దురదృష్టం. ఆయనతో, ఆయన బిడ్డలతో (పాటలతో), ఆయన కుటుంబ సభ్యులతో ఆత్మీయ పరిచయం నాకు కలగటం నేను చేసుకున్న అదృష్టం.
నా దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’, ‘సీతారామరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’ వంటి సినిమాల్లో అన్ని పాటలను ఆయనతో రాయించుకోగలిగిన అనుభవాన్ని పొందటం నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా పాటల రూపంలో తెలుగు సాహిత్య ప్రియుల మధ్య ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment