
సాక్షి, హైదరాబాద్: సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరన్న వార్త టాలీవుడ్ పెద్దలను, అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది. సుదీర్ఘ కరియర్‌లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలను అందించి సిరివెన్నెలను తలుచుకుని అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. తెలుగు పరిశ్రమకు ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ వెతికి పట్టుకున్న ఆణిముత్యం సీతారామ శాస్త్రి. సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయన ప్రతీ పాటను ఎంతో అద్భుతంగా మలిచారు. అప్పటికీ, ఇప్పటికీ ఆ పాటలు అజరామరమే. ‘విధాత తలపున ప్రభవించినది’ అంటూ మొదలు పెట్టిన ఆయన ప్రస్థానంలో మూడు వేలకు పైగా పాటలు.
ముఖ్యంగా గాయం మూవీలో నిగ్గు దీసి అడుగు అంటూ సిగ్గులేని జనాన్ని కడిగేసిన పదునైన కలం ఆయనది. అందరిలో ఉన్నా... ఒంటరిగా బతుకుతున్న ఓ యువకుడి కథ కోసం ‘జగమంతా కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది’ అంటూ తాత్వికతను ప్రదర్శించారు.
ఆయన రాసిన పాటల్లో కొన్ని ఆణిముత్యాలు
అంకురం : ఎవరో ఒకరు ఎపుడో అపుడు
శ్రుతిలయలు - తెలవారదేమో స్వామీ
మహర్షి - సాహసం నా పథం
రుద్రవీణ - తరలిరాదా తనే వసంతం, నమ్మకు నమ్మకు ఈ రేయినీ
కూలీ నెం:1 - కొత్త కొత్తగా ఉన్నదీ
రౌడీ అల్లుడు - చిలుకా క్షేమమా
క్రిమినల్ - తెలుసా మనసా
పెళ్లి - జాబిలమ్మ నీకు అంత కోపమా
మురారి మూవీలో అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి పాటతోపాటు, ‘చంద్రుడిలో ఉండే కుందేలు కిందకొచ్చిందా...కిందకొచ్చి నీలా మారిందా’ అనే భావుకత. ‘జామురాతిరి..జాబిలమ్మా...’ అంటూ జోల పాడి హాయిగా నిద్రపుచ్చే అందమైన సాహిత్యం ఆయన సొంతం. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ అలవైకుంఠపురంలో ‘సామజవరగమన పాటలు పెద్ద సంచలనం. ఈ మధ్య వెంకటేష్ నారప్ప, కొండపొలం సినిమాలో పాటలు రాశారు.
Comments
Please login to add a commentAdd a comment