
జగమంత అభిమానుల కుటుంబాన్ని వదిలి ఏకాకి జీవితం నాది అంటూ నిష్క్రమించిన ఈ మహనీయుడికి ఓ కోరిక ఉండేదట!..
తెలుగు సినీ పాటకు విశ్వఖ్యాతి తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం చిత్రపరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదంటూ సినీప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కలం నుంచి జాలివారిన పాటలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతున్నారు. జగమంత అభిమానుల కుటుంబాన్ని వదిలి ఏకాకి జీవితం నాది అంటూ నిష్క్రమించిన ఈ మహనీయుడికి ఓ కోరిక ఉండేదట! తన కొడుకు రాజాను ఒక మంచి నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో చూడాలని సిరివెన్నెల ఎంతగానో ఆశపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
దాదాపు 14 ఏళ్ల క్రితం దర్శకుడు తేజ తెరకెక్కించిన 'కేక' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు రాజా. తర్వాత 'ఎవడు' సినిమాలో విలన్‌గా, అనంతరం 'ఫిదా'లో వరుణ్‌తేజ్ అన్నయ్యగా నటించాడు. కొన్ని మంచి పాత్రలే దక్కినా కూడా రాజాకు రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు. దీంతో తన కొడుకు కెరీర్ విషయంలో సిరివెన్నెల మదనపడ్డారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. రాజా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటే సిరివెన్నెల ఆత్మకి శాంతి చేకూరుతుందని, అది జరగాలని ఆయన అభిమానులు మనసారా కోరుకుంటున్నారు.