టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ గీత రచయిత కులశేఖర్ చనిపోయారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం కన్నుమూశారు. సాంగ్ రైటర్‌గా ఓ వెలుగు వెలిగిన ఈయన తర్వాతి రోజుల్లో మానసికంగా చాలా కుంగిపోయారు. ఇప్పుడు ఇలా దయనీయ స్థితిలో మృత్యు ఒడికి చేరారు.
(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు)
వైజాగ్‌కి చెందిన కులశేఖర్.. హైదరాబాద్‌లో తొలుత జర్నలిస్టుగా చేశారు. తర్వాత గీత రచయిత అయ్యారు. అలా 'చిత్రం', ఔనన్నా కాదన్నా, ఘర్షణ, భద్ర, నువ్వు నేను, సంతోషం, జయం, సైనికుడు లాంటి మంచి సినిమాల్లో పాటలు రాశారు. తర్వాత ఈయన కెరీర్ డౌన్ ఫాల్ అయింది. దీంతో మానసికంగా చాలా కుంగిపోయారు. దొంగతనాల వల్ల పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు.
గత కొన్నాళ్లలో పెద్దగా సినిమాలు చేయలేదు. ఇంటర్వ్యూల్లోనూ కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు ఈయన చనిపోయారని తెలిసి పలువురు సినీ ప్రముఖు సంతాపం తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఐదేళ్ల నిరీక్షణ.. 'జీబ్రా' ఫలితంపై సత్యదేవ్ ఎమోషనల్)
Comments
Please login to add a commentAdd a comment